
లండన్: జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ జంటగా నటించిన చిత్రం దఢక్. ఇప్పటికే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రానికి అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ మూవీలోని జింగాత్ పాట మాస్ పేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ పాటకు ఇంగ్లండ్‌లోని టీమిండియా ఆటగాళ్లు చిందేశారు. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి బయలుదేరే ముందు భారత్ ఏ జట్టు ఆటగాళ్లు చివరి రోజు లండన్ వీధుల్లో విహరిస్తూ, ఉల్లాసంగా గడిపారు.
ఆటగాళ్లు బస్సులో ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న సమయంలో హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్, కే భరత్, అంకిత్ బావ్నే జింగాత్ పాటకు నృత్యం చేశారు. వీరు డ్యాన్స్ చేసిన వీడియోను సిరాజ్‌లో సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ‘లండన్‌లో చివరి రోజు జింగాత్ సాంగ్‌తో సరదాగా గడిచిపోయింది, త్వరలో కలుద్దాం’అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం క్రికెటర్ల డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా ఇంగ్లండ్ లయన్స్, వెస్టిండీస్ జట్లతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ను ‘టీమిండియా ఏ’ గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment