‘ఇప్పుడు నువ్వు ఉంటే ఎంత సంతోషించేదానివో’ | Shabana Azmi Over Janhvi Kapoor Debut Dhadak | Sakshi
Sakshi News home page

‘ఇప్పుడు నువ్వు ఉంటే ఎంత సంతోషించేదానివో’

Published Sat, Jul 21 2018 8:57 AM | Last Updated on Sat, Jul 21 2018 9:14 AM

Shabana Azmi Over Janhvi Kapoor Debut Dhadak - Sakshi

శ్రీదేవి - షబనా ఆజ్మి (ఫైల్‌ ఫోటో)

అలనాటి అందాల తార శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌గా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు. మరాఠీ మూవీ ‘సైరాట్‌’కు  రీమేక్‌గా తెరకెక్కిన ‘ధడఖ్‌’ సినిమా జూలై 20న విడుదల అయింది. అయితే సినిమాను థియేటర్‌లలో విడుదల చేయడానికి ఒక రోజు ముందే బాలీవుడ్‌ ప్రముఖలకు ప్రత్యేక షోను ఏర్పాటు చేశారు. వీరిలో శ్రీదేవికి అత్యంత ఆప్తురాలు, నటి షబానా ఆజ్మి కూడా ఉన్నారు. ధడక్‌ సినిమాను చూసిన అనంతరం షబనా ఆజ్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్‌ను పోస్టు చేశారు. అందులో ‘శ్రీదేవి నువ్వు ఈ సమయంలో ఇక్కడ ఉంటే ఎంత బాగుండేదో. నువ్వు జాన్వీ తొలి సినిమా చూడాల్సింది. చాలా గర్వపడేదానివి. ఒక తార జన్మించింది’ అంటూ పోస్ట్‌ చేశారు.

ఈ నెల 20 న విడుదలైన జాన్వీ కపూర్‌ తొలి బాలీవుడ్‌ చిత్రం ‘ధడక్‌’ మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా జాన్వీ నటనను పరిశ్రమ ప్రముఖులు తెగ మెచ్చుకుంటున్నారు. తొలి చిత్రమే అయినా చాలా బాగా నటించిందని, కళ్లతోనే అద్భుతమైన హవభావాలను పలికించిందని అభినందిస్తున్నారు. మరాఠీ చిత్రం ‘సైరాట్‌’కు రీమేక్‌ ఇది. శశాంక్‌ కేతన్‌ దర్శకత్వంలో ఇషాన్‌ కట్టర్‌ హీరోగా నటించారు. ‘ధడక్‌’ చిత్రాన్ని ధర్మప్రొడక్షన్స్‌ పతాకంపై కరణ్‌ జోహార్‌ నిర్మించారు. ఇప్పటికే చిత్రంలోని జింగత్‌ పాట యూట్యూబ్‌లో రికార్డ్‌ హిట్స్‌తో దూసుకుపోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement