‘ఏడుస్తూ ఉంటే నువ్వు చాలా బాగున్నావ్‌ | Janhvi Kapoor Recalls Huge Fight With Mom Sridevi | Sakshi
Sakshi News home page

శ్రీదేవి మాటల్ని గుర్తు చేసుకున్న జాన్వీ

Apr 8 2019 8:51 PM | Updated on Apr 8 2019 8:57 PM

Janhvi Kapoor Recalls Huge Fight With Mom Sridevi - Sakshi

శ్రీదేవి గారాల తనయ జాన్వీ కపూర్‌ ధడక్‌ చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడమే కాక జాన్వీకి మరిన్ని అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా ఓ ఇంగ్లీష్‌ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమాల్లోకి రావాలనేది నా కల. దీన్ని సాకారం చేసుకోవడానికి నేను మా అమ్మతో గొడవ పడాల్సి వచ్చిందని తెలిపారు.

ఆ సందర్భా‍న్ని గుర్తు చేసుకుంటూ.. ‘ఆ రోజు నాకు ఇప్పటికి బాగా గుర్తుంది. నేను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నాను అని మా అమ్మతో చెప్పాను. తాను ముందు వద్దంది. ఆ తర్వాత ఇదే విషయమై మా ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. దాంతో నేను ఏడ్వడం మొదలుపెట్టాను. అప్పుడు మా అమ్మ నావైపు తిరిగి ఏడుస్తున్నప్పుడు నువ్వు చాలా బాగున్నావ్‌. యాక్టర్‌కు ఇది చాలా ముఖ్యం’ అని చెప్పిందంటూ గుర్తు చేసుకున్నారు.

అంతేకాక ధడక్‌ చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించడం తనకు చాలా మేలు చేసిందన్నారు జాన్వీ. ఒక వేళ తాను ఆ చిత్రంలో నటించకపోతే.. ప్రస్తుతం తన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేదని తెలిపారు. ఆ చిత్రం తనకు ఎన్నో విధాల మేలు చేసిందన్నారు. జాన్వీ ప్రస్తుతం.. వార్‌ ఎపిక్‌ డ్రామా ‘థక్త్‌’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో తొలిసారిగా బాబాయ్‌ అనిల్‌ కపూర్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న ఆమె.. భారత వైమానిక పైలట్‌ గుంజన్‌ సక్సేనా బయెపిక్‌ ‘కార్గిల్‌ గర్ల్‌’ సినిమా టైటిల్‌ రోల్‌లో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement