
జాన్వీ కపూర్ - అనన్య పాండే
దివంగత నటి శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మరాఠీ మూవీ ‘సైరత్’ రీమేక్‌గా తెరకెక్కిన ‘ధడఖ్’ సినిమా ఈ రోజు(జూలై 20) విడుదల అయింది. ఈ సందర్భంగా ఎంతో మంది స్నేహితులు జాన్వీకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే అందరిలోనూ జాన్వీ చిన్ననాటి స్నేహితురాలు, స్టార్ కిడ్ అనన్య పాండే విషెస్ ప్రత్యేకంగా నిలిచాయి.
తాను, జాన్వీ కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోను పోస్ట్ చేసిన అనన్య... ‘నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గుడ్‌లక్ ధడఖ్ టీమ్’ అంటూ జాన్వీని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. ‘ఇద్దరు యువరాణులను ఒకేచోట చూడటం సంతోషంగా ఉందంటూ’ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా కరణ్ జోహార్ నిర్మాణంలో రూపొందుతోన్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో అనన్య పాండే హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ‘ధడఖ్’ సినిమాను కూడా కరణే నిర్మించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment