
ముంబై : అందాల నటి శ్రీదేవి విషాదాంతం తర్వాత ఆమె కుమార్తె జాన్వీ కపూర్ తొలి మూవీ ధడక్‌పై బాలీవుడ్ ఇండస్ర్టీ మొత్తం దృష్టిసారించింది. మరాఠీ చిత్రం సైరాత్ రీమేక్‌గా తెరకెక్కిన ధడక్‌కు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనన ఎదురైంది. ధడక్ విడుదలైన కొద్ది రోజులకే జాన్వీకి బాలీవుడ్ సహా దక్షిణాది సినీ పరిశ్రమల నుంచి సైతం ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో దర్శక దిగ్గజం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మూవీలో జాన్వీ కపూర్‌ను ఓ హీరోయిన్‌గా తీసుకోవాలని, ఈ దిశగా జాన్వీతో సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం.
అయితే ఈ ప్రాజెక్టుకు జాన్వీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా లేదా అనేది తెలియరాలేదు. ఈ మూవీకి సంబంధించిన ఇతర తారాగణంపై త్వరలోనే అధికారిక సమాచారం వెలువడుతుందని భావిస్తున్నారు. మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారని, రామ్‌చరణ్ పోలీస్ అధికారిగా నటించనున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment