South Africa A
-
లంకేయులను గడగడలాడిస్తున్న సఫారీ స్పిన్నర్.. ఏకంగా 18 వికెట్లు
సౌతాఫ్రికా-ఏ స్పిన్నర్ సెనురన్ ముత్తుసామి (లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్) శ్రీలంక-ఏ జట్టును వారి స్వదేశంలో గడగడలాడిస్తున్నాడు. రెండు టెస్ట్‌ల అనధికారిక సిరీస్‌లో భాగంగా నిన్న (జూన్ 19) మొదలైన రెండో టెస్ట్‌లో ముత్తుసామి మరోసారి 5 వికెట్లు సాధించి, లంకేయులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ సిరీస్‌లో ముత్తుసామి 5 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన ముత్తుసామి.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ముత్తుసామి 3 ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. ముత్తుసామి ధాటికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన మిలన్ రత్నాయకే (53) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నిషాన్ మధుష్క (33), లసిత్ క్రూస్పుల్లే (27), భానుక (32), పసిందు సూరియబండార (41), లహిరు ఉదార (33), ఆర్ మెండిస్ (44) ఓ మోస్తరు స్కోర్లు సాధించారు. సఫారీ బౌలర్లలో ముత్తుసామితో (26.1-4-101-6) పాటు సిపామ్లా (2), విలియమ్స్ (1), స్వేన్పోయల్ (1) వికెట్లు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సఫారీ కెప్టెన్ టోనీ డి జోర్జి (0)ని ఇన్నింగ్స్ తొలి బంతికే విశ్వ ఫెర్నాండో ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. మాథ్యూ బ్రీట్జ్కీ (2), ట్రిస్టన్ స్టబ్స్ (5) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో శ్రీలంక-ఏ 160 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుమందు జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా-ఏ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
లంకేయులను వారి స్వదేశంలో ముప్పుతిప్పలు పెట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్
మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల అనధికారిక సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా ఏ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకోగా.. నిన్న ముగిసిన తొలి టెస్ట్‌లో శ్రీలంక-ఏ విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలింది. అనంతరం శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా 185 పరుగులకే చాపచుట్టేసి, 160 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లంకేయులకు ముప్పుతిప్పలు పెట్టిన సెనురన్ ముత్తుసామి.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించినప్పటికీ.. సఫారీ స్పిన్నర్ సెనురన్ ముత్తుసామి అందరి దృష్టిని ఆకర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన ముత్తుసామి, రెండో ఇన్నింగ్స్‌లో సైతం అదే రేంజ్లో రెచ్చిపోయి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 12 వికెట్లు పడగొట్టిన ముత్తుసామి లంక బ్యాటర్లకు వారి స్వదేశంలో ముచ్చెమటలు పట్టించాడు. ముత్తుసామికి సహచర బౌలర్ల నుంచి సహకారం లభించకపోవడంతో లంక బ్యాటర్లు పైచేయి సాధించారు. బౌన్సీ పిచ్‌లు అధికంగా ఉండే సౌతాఫ్రికా లాంటి దేశం నుంచి వచ్చిన స్పిన్ బౌలర్ పరాయి గడ్డపై, అందులో ఉపఖండపు పిచ్‌లపై ఈ స్థాయిలో రెచ్చిపోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇందుకే ముత్తుసామిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తన జట్టు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నా, ముత్తుసామిని అందరూ ప్రశంసిస్తున్నారు. మున్ముందు ముత్తుసామి సౌతాఫ్రికా జాతీయ జట్టులో కీలకంగా మారతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 29 ఏళ్ల ముత్తుసామి సౌతాఫ్రికా తరఫున ఇదివరకే అరంగేట్రం చేసి, 2 వికెట్లు పడగొట్టాడు. -
భారత్- దక్షిణాఫ్రికా సిరీస్ డ్రా..
India And South Africa A Series Draw: భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మూడో అనధికారిక టెస్టు కూడా ‘డ్రా’గా ముగిసింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 0–0తో ‘డ్రా’ అయ్యింది. 304 పరుగులు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్... మ్యాచ్ చివరి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 90 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 3 వికెట్లకు 311 పరుగుల వద్ద డిక్లేర్ చేసి భారత్ ముందు 304 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జుబేర్ హమ్జా (125 నాటౌట్; 15 ఫోర్లు) సెంచరీ చేశాడు. చాలెంజర్ విజేత ఇండియా ‘ఎ’ సాక్షి, విజయవాడ: సీనియర్ మహిళల క్రికెట్ చాలెంజర్ ట్రోఫీని ఇండియా ‘ఎ’ జట్టు గెలుచు కుంది. గురువారం మూలపాడు మైదానంలో జరిగిన ఫైనల్లో ‘ఎ’ 3 వికెట్ల తేడాతో ఇండియా ‘డి’ను ఓడించింది. ముందుగా ‘డి’ టీమ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అమన్‌జోత్ కౌర్ (74 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు), ఎస్. మేఘన (44 బంతుల్లో 45; 7 ఫోర్లు) రాణించారు. డీడీ కసట్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ‘ఎ’ టీమ్ 45.4 ఓవర్లలో 7 వికెట్లకు 224 పరుగులు చేసి టోర్నీ విజేతగా నిలిచింది. యస్తిక భాటియా (102 బంతుల్లో 86; 10 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగగా, చల్లా ఝాన్సీ లక్ష్మీ(70 బంతుల్లో 64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించింది. రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు తీసినా లాభం లేకపోయింది. చదవండి: Ravi Shastri: వన్డే వరల్డ్‌కప్ 2019.. అంబటిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ సెలక్టర్లే.. -
Ishan Kishan: సెంచరీకి 9 పరుగుల దూరంలో ఔట్
Ishan Kishan Misses Century With 9 Runs.. టీమిండియా-ఏతో జరుగుతున్న నాలుగురోజుల అనధికారిక టెస్టులో సౌతాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా-ఏ వికెట్ నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్ సారెల్ ఎర్వీ 85*, జుబేర్ హంజా 78* పరుగులతో క్రీజులో ఉన్నారు. 27 పరుగులు చేసిన పీటర్ మలన్ సైనీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకముందు టీమిండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 276 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ సెంచరీకి 9 పరుగుల దూరంలో ఔటయ్యాడు.153 బంతులెదుర్కొన్న ఇషాన్ కిషన్ 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 91 పరుగులు చేసి జాన్సెన్ బౌలింగ్‌లో క్యూషిల్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హనుమ విహారి 63 పరుగులతో రాణించాడు. చదవండి: David Warner Ashes Series: ఈసారి కచ్చితంగా ఔటయ్యేవాడు! బతుకుజీవుడా అనుకున్న వార్నర్ IND-A vs SA-A: చెలరేగిన ఇషాన్ కిషన్, హనుమ విహారి -
దక్షిణాఫ్రికాపై రాణించిన హనుమ విహారి..
Hanuma Vihari shines as India A South Africa A play out another draw: భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య బ్లోమ్‌ఫోంటెన్‌లో రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఆట చివరిరోజు శుక్రవారం దక్షిణాఫ్రికా నిర్దేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ‘ఎ’ వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 41.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారి (116 బంతుల్లో 72 నాటౌట్; 12 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చదవండి: Rohit sharma: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ! -
Navdeep Saini: కసితో వేశాడు.. స్టంప్ ఎగిరి గాల్లో పల్టీలు
Navdeep Saini Sends Off Stump Wicket Cartwheeling.. ఇండియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో స్పీడస్టర్ నవదీప్ సైనీ అద్భుత బంతితో మెరిశాడు. అతని బౌలింగ్ దాటికి స్టంప్ ఎగిరి గాల్లో పల్టీలు కొట్టి మూడు నుంచి నాలుగు అడుగు దూరంలో పడింది. దక్షిణా ఇన్నింగ్స్ 92 వ ఓవర్లో ఇది చోటు చేసుకుంది. అప్పుడే క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ హెండ్రిక్స్ క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తన 21వ ఓవర్ వేయడానికి వచ్చిన నవదీప్ సైనీ ఓవర్ తొలి బంతినే 100 కిమీవేగంతో విసిరాడు. పొరపాటున దాన్ని అంచనా వేయని హెండ్రిక్స్ వదిలేయడంతో బంతి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. ఇంకేముంది స్టంప్ ఎగిరి గాల్లో పల్టీలు కొడుతూ కింద పడింది. అయితే పక్కనే ఉన్న మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్‌లు మాత్రం ఇంచుకూడా కదలకపోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND Tour Of SA Delayed: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. టీమిండియా పర్యటన వాయిదా! ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సర్ఫరాజ్ ఖాన్ (94 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), హనుమ విహారి (164 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో 198/5 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 276 పరుగుల వద్ద ఆలౌటైంది. సర్ఫరాజ్, విహారి ఆరో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’కు 21 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట నిలిచే సమయానికి 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. చదవండి: IND VS NZ: అతడు టీమిండియా ఓపెనర్‌గా రావాలి... Truly one of the most beautiful sights in cricket as Navdeep Saini uproots Beuran Hendricks' off stump. Marco Jansen however has been the 1st SA A batsmen to score 50 and is desperately hoping for the number 11 to just stay with him. SA A: 249/9#SAAvINDA pic.twitter.com/xPj1OlFJUq — Shaun (@Shaun_Analytics) December 1, 2021 -
హనుమ విహారి అర్థ సెంచరీ.. భారత్ ‘ఎ’ 276 ఆలౌట్
బ్లూమ్‌ఫోంటీన్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ (94 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), హనుమ విహారి (164 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో 198/5 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 276 పరుగుల వద్ద ఆలౌటైంది. సర్ఫరాజ్, విహారి ఆరో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’కు 21 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట నిలిచే సమయానికి 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. సారెల్ ఎర్వీ (41), పీటర్ మలాన్ (31), రేనార్డ్ (33) ఫర్వాలేదనిపించారు. ఇషాన్ పోరెల్ 2, సౌరభ్, అపరాజిత్ చెరో వికెట్ తీశారు. మ్యాచ్‌కు నేడు ఆఖరి రోజు. -
డ్రాగా ముగిసిన భారత్ - దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్..
బ్లోమ్‌ఫొంటెయిన్: భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్టు ‘డ్రా’గా ముగిసింది. చివరి రోజు శుక్రవారం ఆట పూర్తిగా వర్షార్పణమైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ 4 వికెట్లకు 308 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ను 509/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కాగా దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వెరియంట్ విజృంభిస్తుండడంతో భారత ఆటగాళ్లను స్వదేశానికి రప్పించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: IND Vs NZ: దుమ్ము రేపిన కీవిస్ ఓపెనర్లు.. చేతులేత్తిసిన భారత బౌలర్లు -
టీమిండియా బౌలర్ ఫ్రస్ట్రేషన్ పీక్స్.. అంపైర్‌పై కోపంతో ఏం చేశాడంటే..
Rahul Chahar throws sunglasses in frustration: బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా భారత్-ఏ జట్టు, దక్షిణాఫ్రికా-ఏ జట్టు మధ్య నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో రెండో రోజు భారత బౌలర్ రాహుల్ చహర్ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 128వ వేసిన రాహుల్ చహర్ బౌలింగ్‌లో బంతి.. బ్యాటింగ్ చేస్తున్న క్యూషీలే ప్యాడ్లను తాకింది. అయితే వెంటనే ఎల్బీకు రాహుల్ అప్పీల్ చేయగా.. దానిని అంపైర్ తిరస్కరించాడు. దీంతో వెంటనే కోపంతో ఊగిపోయిన చహర్ తన సన్ గ్లాస్‌ను నేలకేసి కొట్టాడు. అంతేకాకుండా అంపైర్‌తో కొద్దిసేపు వాగ్వాదానికి కూడా దిగాడు. ఆ తర్వాత కిందపడ్డ కళ్లజోడు పెట్టుకుని ఓవర్ పూర్తి చేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఏ 509 పరుగులు చేసి ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే భారత బ్యాటర్లు కూడా ఈ మ్యాచ్‌లో తిరిగి పోరాడుతున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 308 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ (103) సెంచరీ సాధించగా, ప్రియాంక్ పాంచల్ (96) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్లనున్న సంగతి తెలిసిందే. Rahul Chahar might get pulled up here, showing absolute dissent to the umpires call. A double appeal and throwing his equipment. #SAAvINDA Footage credit - @SuperSportTV pic.twitter.com/TpXFqjB94y — Fantasy Cricket Pro (@FantasycricPro) November 24, 2021 చదవండి: IPL 2022 Auction: ఆర్సీబీ రిటైన్ లిస్ట్.. కోహ్లి, మ్యాక్స్‌వెల్ -
దక్షిణాఫ్రికాపై చెలరేగి ఆడుతున్న భారత్..
Update: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట వర్షం కారణంగా ప్రారంభం కాలేదు. కాగా భారత్ ఇంకా 201 పరుగుల వెనుకంజలో ఉంది. India A Rich 308-4 On Day 3 In Reply To South Africa A: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 308 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ (103) సెంచరీ సాధించగా, ప్రియాంక్ పాంచల్ (96) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు. హైదరాబాద్ ఆటగాడు హనుమ విహారి (25) విఫలమయ్యాడు. వర్షం కారణంగా గురువారం 60.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చదవండి: Shreyas Gopal: ప్రేయసిని పెళ్లాడిన శ్రేయస్.. ఫొటోలు వైరల్ -
మార్క్రమ్, ముల్డర్ శతకాలు
మైసూర్: టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు శుభ సూచకం. ఆ జట్టు రెగ్యులర్ ఓపెనర్, దక్షిణాఫ్రికా ‘ఎ’ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (253 బంతుల్లో 161; 20 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ శతకంతో ఫామ్ చాటుకున్నాడు.అతడికి తోడు ఆల్ రౌండర్ పీటర్ ముల్డర్ (230 బంతుల్లో 131 నాటౌట్; 17 ఫోర్లు, సిక్స్) శతకం బాదడంతో భారత్ ‘ఎ’తో ఇక్కడ జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ‘ఎ’కు 17 పరుగుల ఆధిక్యం దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 159/5తో మూడో రోజు గురువారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ను మార్క్రమ్, ముల్డర్ చక్కటి బ్యాటింగ్‌తో ముందుకు నడిపించారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న వీరు ఆరో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. ఆ తర్వాత ముల్డర్‌కు ఫిలాండర్ (21) సహకారం అందించాడు. ఈ దశలో కుల్దీప్ యాదవ్ (4/121), షాబాజ్ నదీం (3/76) చివరి మూడు వికెట్లను ఐదు పరుగుల తేడాతో పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ ‘ఎ’ వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (5), ప్రియాంక్ పాంచల్ (9) క్రీజులో ఉన్నారు. మ్యాచ్‌కు శుక్రవారం చివరి రోజు. -
శుబ్‌మన్ మళ్లీ శతకం మిస్
మైసూర్: యువ బ్యాట్స్‌మన్ శుబ్‌మన్ గిల్ (137 బంతుల్లో 92; 12 ఫోర్లు, సిక్స్) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’తో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టులో అతడు శతకానికి 8 పరుగుల దూరంలో ఔటయ్యాడు. తొలి మ్యాచ్‌లో శుబ్‌మన్ 90 పరుగులు చేశాడు. ప్రస్తుత మ్యాచ్‌లో అతడికి తోడు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ (167 బంతుల్లో 78 బ్యాటింగ్; 10 ఫోర్లు) రాణించడంతో భారత్ ‘ఎ’ తొలి రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (5), ప్రియాంక్ పాంచల్ (6) త్వరగానే వెనుదిరిగినా... శుబ్‌మన్, నాయర్ మూడో వికెట్‌కు 135 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. దక్షిణాఫ్రికా టెస్టు జట్టు సభ్యులైన పేసర్లు ఫిలాండర్, ఇన్‌గిడి, స్పిన్నర్ ముతుస్వామిలను దీటుగా ఎదుర్కొన్నారు. సిపామ్లా బౌలింగ్‌లో గిల్ పెవిలియన్ చేరాక... కరుణ్‌కు కెపె్టన్ వృద్ధిమాన్ సాహా (86 బంతుల్లో 36; 5 ఫోర్లు) సహకారం అందించాడు. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు వీరు 67 పరుగులు జోడించారు. వెలుతురు సరిగా లేని కారణంగా మంగళవారం 74 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. -
వికెట్ మిగిలుంది... మన గెలుపు ఖాయమైంది!
తిరువనంతపురం: తొలి అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ బౌలర్ల జోరును వర్షం అడ్డుకున్నా... సఫారీని మాత్రం ఆదుకోలేకపోయింది. మూడో రోజు ఆటలో కేవలం 20 ఓవర్ల ఆటే జరిగినా... దక్షిణాఫ్రికా ‘ఎ’ పతనం మాత్రం క్రితం రోజులాగే కొనసాగింది. బుధవారం రెండు సెషన్లను వర్షం తుడిచిపెట్టింది. ఆట చాలా ఆలస్యంగా ఆఖరి సెషన్లో ఆరంభమైంది. ఓవర్‌నైట్ స్కోరు 125/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి 55 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. సఫారీ జట్టు గత స్కోరుకు కేవలం 54 పరుగులు జోడించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ క్లాసెన్ (48; 5 ఫోర్లు), ముల్డర్ (46; 4 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు కుదురుగా ఆడారు. కానీ ఆఫ్‌స్పిన్నర్ జలజ్ సక్సేనా ఈ జోడీని విడగొట్టడంతో సఫారీ కష్టాలు మొదటికొచ్చాయి. ఆట నిలిచే సమయానికి సిపమ్లా (5 బ్యాటింగ్), ఇన్‌గిడి (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. గురువారం మ్యాచ్‌కు ఆఖరి రోజు. భారత్ ‘ఎ’ కంటే సఫారీ జట్టు కేవలం 40 పరుగుల స్వల్ప ఆధిక్యంలోనే ఉంది. ఆఖరి వికెట్‌ను తీసి... నిర్దేశించే కొద్దిపాటి లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత జట్టుకు తొలి సెషన్ సరిపోతుంది. -
మెరిసిన సామ్సన్, శార్దుల్
తిరువనంతపురం: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన చివరి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 36 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు వన్డేల సిరీస్‌ను 4–1తో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్ మెరుపులు... బౌలింగ్‌లో శార్దుల్ ఠాకూర్ (3/9) విజృంభణ భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించాయి. తొలుత భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (36 బంతుల్లో 51; 5ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజూ సామ్సన్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 135 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ హెండ్రిక్స్ ( 59; 10 ఫోర్లు) రాణించాడు. -
భారత్ ‘ఎ’ను గెలిపించిన ఇషాన్
తిరువనంతపురం: కీలక దశలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన భారత ‘ఎ’ జట్టు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 55; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. శనివారం జరిగిన రెండో అనధికారిక వన్డేలో ఇషాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ ‘ఎ’ రెండు వికెట్ల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వర్షం కారణంగా 21 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ‘ఎ’ కెప్టెన్ మనీశ్ పాండే ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ‘ఎ’ 21 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. జార్జి లిండే (25 బంతుల్లో 52 నాటౌట్; ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో మెరిపించాడు. కెప్టెన్ బవుమా (33 బంతుల్లో 40; 6 ఫోర్లు), క్లాసెన్ (27 బంతుల్లో 31; 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడారు. భారత్ ‘ఎ’ బౌలర్లలో దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్‌లకు ఒక్కో వికెట్ లభించింది. అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని భారత్ ‘ఎ’ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి అధిగమించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడటంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ ‘ఎ’ లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్‌కు జతగా అన్మోల్ప్రీత్ సింగ్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కృనాల్ పాండ్యా (15 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా బ్యాట్ ఝళిపించారు. ఇషాన్ కిషన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్‌లోని మూడో వన్డే సోమవారం జరుగుతుంది. -
భారత్ ‘ఎ’ విజయం
తిరువనంతపురం: దక్షిణాఫ్రికా ‘ఎ’తో ఆరంభమైన ఐదు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్ ‘ఎ’ శుభారంభం చేసింది. 69 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ను చిత్తు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ షోతో ఆదరగొట్టాడు. మొదట బ్యాటింగ్‌లో (36 బంతుల్లో 60 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి, అనంతరం కీలక సమయంలో రెండు వికెట్లు తీశాడు. యుజువేంద్ర చహల్ 5 వికెట్లతో రాణించాడు. 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత భారత్ 6 వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (46), మనీశ్ పాండే (39), ఇషాన్ కిషన్ (37) రాణించారు. శివమ్ దూబే (60 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరిశాడు. అనంతరం దక్షిణాఫ్రికా ‘ఎ’ చహల్ స్పిన్ దెబ్బకు 45 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. రీజా హెండ్రిక్స్ (108 బంతుల్లో 110; 12 ఫోర్లు, సిక్స్) ఒంటరి పోరాటం వృథా అయింది. రెండో వన్డే ఈ నెల 31న జరగనుంది. -
భారత్ ‘ఎ’దే టెస్టు సిరీస్
బెంగళూరు: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టును భారత్ ‘డ్రా’గా ముగించింది. తొలి టెస్టులో గెలిచిన భారత్ ‘ఎ’ 1–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆట చివరి రోజు సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 294/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ 319 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 25 పరుగులు జోడించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ మిగతా మూడు వికెట్లను కోల్పోయింది. హైదరాబాద్ బౌలర్ సిరాజ్ (4/72) మరోసారి రాణించాడు. 26 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 181 పరుగులు సాధించింది. ఈ దశలో వర్షం రావడం... మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం కూడా లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. సంక్షిప్త స్కోర్లు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 345; దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 319 (హమ్జా 93, ఇర్వీ 58; సిరాజ్ 4/72, అంకిత్ రాజ్‌పుత్ 3/52, చహల్ 2/84); భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 181/4 (51 ఓవర్లలో) (శ్రేయస్ అయ్యర్ 65, అంకిత్ బావ్నే 65 నాటౌట్; ఒలివియర్ 2/24, ముత్తుస్వామి 2/45). -
దక్షిణాఫ్రికా ‘ఎ’ 294/7
బెంగళూరు: భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు ‘డ్రా’ దిశగా పయనిస్తోంది. కీలకమైన మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. 219/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 92.3 ఓవర్లలో 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ డసెన్ (22; 2 ఫోర్లు), రూడీ సెకండ్ (47; 7 ఫోర్లు)లను భారత బౌలర్ అంకిత్ రాజ్‌పుత్ ఔట్ చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 51 పరుగులు వెనుకంజలోనే ఉంది. -
దక్షిణాఫ్రికా ‘ఎ’ 219/3
బెంగళూరు: భారత్ ‘ఎ’తో జరుగుతోన్న రెండో అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతున్న టీమిండియాను కట్టడి చేయడంతో పాటు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. దీంతో శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 59.5 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసింది. జుబైర్ హమ్జా (93; 15 ఫోర్లు) త్రుటిలో సెంచరీని చేజార్చుకోగా... ఇర్వీ (58; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం డసెన్ (18 బ్యాటింగ్), రూడీ సెకండ్ (35 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో చహల్ 2, హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 126 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 322/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 23 పరుగులు మాత్రమే జతచేసి మిగతా 6 వికెట్లు కోల్పోయి 345 పరుగులకు పరిమితమైంది. ఆంధ్ర రంజీ క్రికెటర్ హనుమ విహారి (148; 14 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు 10 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆంధ్రకే చెందిన వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ 34 పరుగులు చేశాడు. -
విహారి అజేయ సెంచరీ
బెంగళూరు: ఆంధ్ర రంజీ క్రికెటర్ గాదె హనుమ విహారి (138 బ్యాటింగ్; 13 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా ‘ఎ’తో శుక్రవారం ప్రారంభమైన రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ భారీ స్కోరు దిశగా సాగుతోంది. విహారితో పాటు అంకిత్ బావ్నే (80; 10 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి విహారితో పాటు మరో అంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ భరత్ (30 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. -
భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ విజయం
బెంగళూరు: రోజంతా ఆడి ‘డ్రా’తో గట్టెక్కాలని భావించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. భారత ‘ఎ’ బౌలర్ల ధాటికి సఫారీ జట్టుకు ఓటమి తప్పలేదు. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (5/56, 5/73) రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టడంతో... ఈ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ 30 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి రోజు ఆటలో భారత బౌలర్లు చాలా శ్రమించారు. మిగిలిన 6 వికెట్లు తీసేందుకు 88.5 ఓవర్ల పాటు కష్టపడ్డారు. మంగళవారం 99/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభిన దక్షిణాఫ్రికా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 128.5 ఓవర్లలో 308 పరుగుల వద్ద ఆలౌటైంది. రూడి సెకండ్ (94; 15 ఫోర్లు), షాన్ వోన్ బెర్గ్ (50; 6 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. పేసర్ రజనీశ్ గుర్బాని (2/45) ఎట్టకేలకు ఈ జోడిని విడగొట్టడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 584/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఈనెల 10 నుంచి రెండో అనధికారిక టెస్టు కూడా ఇక్కడే జరగనుంది. -
హడలెత్తించిన సిరాజ్
బెంగళూరు: అన్ని రంగాల్లో ఆధిపత్యం చాటిన భారత్ ‘ఎ’ జట్టు దక్షిణాఫ్రికా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోరు చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకుంది. 338 పరుగులు వెనుకబడి సోమవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన దక్షిణాఫ్రికా ‘ఎ’ను హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (4/18) హడలెత్తించాడు. అతడి ధాటికి దక్షిణాఫ్రికా 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆటకు మంగళవారం చివరి రోజు. ఓవర్‌నైట్ స్కోరు 411/2తో సోమవారం బరిలో దిగిన భారత్ ‘ఎ’... 584/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (220) క్రితం రోజు స్కోరు వద్దే వెనుదిరిగాడు.ఆంధ్ర బ్యాట్స్‌మెన్ హనుమ విహారి (54; 3 ఫోర్లు, 1 సిక్స్), కోన శ్రీకర్ భరత్ (64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ సిరాజ్ ప్రతాపంతో ఆరు పరుగులకే ఎర్వీ (3), మలాన్ (0), జొండొ (0)ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో హమ్జా (46 బ్యాటింగ్), ముత్తుస్వామి (41) నాలుగో వికెట్‌కు 86 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆట ముగిసే సమయంలో సిరాజ్... ముత్తుస్వామిని ఔట్ చేసి మరోసారి దెబ్బకొట్టాడు. -
మయాంక్ 220... పృథ్వీ షా 136
బెంగళూరు: ఫామ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్ (250 బంతుల్లో 220 బ్యాటింగ్; 31 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీకి తోడు... యువ సంచలనం పృథ్వీ షా (196 బంతుల్లో 136; 20 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతోన్న తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ భారీ స్కోరు చేసింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం భారత్ 165 పరుగుల ఆధిక్యంలో ఉంది. మయాంక్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 246/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు తొలి ఓవర్లోనే మిగతా రెండు వికెట్లు కోల్పోయి అదే స్కోరు వద్ద ఆలౌటైంది. ఆ రెండు వికెట్లు హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (5/56) పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడటంతో సఫారీ బౌలర్లు చూస్తుండిపోయారు. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వీరిద్దరు శతకాలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 277 పరుగులు జోడించింది. వీరిద్దరు కలిసి 58 ఫోర్లు, 5 సిక్స్‌లు కొట్టడం విశేషం. అనంతరం పృథ్వీ అవుటైనా... సమర్థ్ ( 37; 5 ఫోర్లు)తో కలిసి మయాంక్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఈ జంట రెండో వికెట్‌కు 118 పరుగులు జతచేసింది. -
కోహ్లితో ధోని సెలబ్రేషన్స్
జోహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ బృందంతోకలిసిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మూడో టెస్టు విజయానందంలో పాలుపంచుకున్నాడు. త్వరలో ఆరంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాకు ఇప్పటికే చేరుకున్న ధోని... జోహెన్నెస్‌బర్గ్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం తర్వాత జరిగిన పార్టీలో భాగమయ్యాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి ధోని విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ మేరకు శనివారం రాత్రి సాండ్టాన్లో జరిగిన జట్టు సెలబ్రేషన్స్ ఫొటోను హార్దిక్ పాండ్యా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ' జట్టు సభ్యులతో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మరచిపోలేని అనుభూతి' అనే క్యాప్షన్‌తో కూడిన ఫొటోను పోస్ట్ చేశాడు. గురువారం నుంచి భారత్-దక్షిణాఫ్రికాల ఆరు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. -
భారత్ ‘ఎ’ 276 ఆలౌట్
పోష్‌స్ట్రూమ్: భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. మూడో రోజు 181/3 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 89.4 ఓవర్లలో 276 పరుగుల వద్ద ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (82 బంతుల్లో 65; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) క్రితం రోజు స్కోరుకు మరో 9 పరుగులే జోడించి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన వారిలో షాబాజ్ నదీమ్ (36) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. డేన్ పీడ్ 4, ప్యాటర్సన్ 3 వికెట్లు తీశారు. సఫారీ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా ‘ఎ’ ఆట నిలిచే సమయానికి 52 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. స్టీఫెన్ కుక్ (55 బ్యాటింగ్; 7 ఫోర్లు), ఫెలుక్వాయో (29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సఫారీ జట్టు 184 పరుగుల ఆధిక్యంలో ఉంది.