బెంగళూరు: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టును భారత్ ‘డ్రా’గా ముగించింది. తొలి టెస్టులో గెలిచిన భారత్ ‘ఎ’ 1–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆట చివరి రోజు సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 294/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ 319 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 25 పరుగులు జోడించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ మిగతా మూడు వికెట్లను కోల్పోయింది. హైదరాబాద్ బౌలర్ సిరాజ్ (4/72) మరోసారి రాణించాడు. 26 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 181 పరుగులు సాధించింది. ఈ దశలో వర్షం రావడం... మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం కూడా లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్‌లు ‘డ్రా’కు అంగీకరించారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 345; దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 319 (హమ్జా 93, ఇర్వీ 58; సిరాజ్ 4/72, అంకిత్ రాజ్‌పుత్ 3/52, చహల్ 2/84); భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 181/4 (51 ఓవర్లలో) (శ్రేయస్ అయ్యర్ 65, అంకిత్ బావ్నే 65 నాటౌట్; ఒలివియర్ 2/24, ముత్తుస్వామి 2/45).
భారత్ ‘ఎ’దే టెస్టు సిరీస్
Published Tue, Aug 14 2018 12:47 AM | Last Updated on Tue, Aug 14 2018 12:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment