భారత్‌ ‘ఎ’ ఇన్నింగ్స్‌ విజయం  | Siraj takes 10-for as India A beat South Africa A by innings and 30 runs | Sakshi
Sakshi News home page

భారత్‌ ‘ఎ’ ఇన్నింగ్స్‌ విజయం 

Published Wed, Aug 8 2018 1:46 AM | Last Updated on Wed, Aug 8 2018 1:46 AM

Siraj takes 10-for as India A beat South Africa A by innings and 30 runs - Sakshi

బెంగళూరు: రోజంతా ఆడి ‘డ్రా’తో గట్టెక్కాలని భావించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. భారత ‘ఎ’ బౌలర్ల ధాటికి సఫారీ జట్టుకు ఓటమి తప్పలేదు. హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ (5/56, 5/73) రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టడంతో... ఈ మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ ఇన్నింగ్స్‌ 30 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి రోజు ఆటలో భారత బౌలర్లు చాలా శ్రమించారు. మిగిలిన 6 వికెట్లు తీసేందుకు 88.5 ఓవర్ల పాటు కష్టపడ్డారు.

మంగళవారం 99/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభిన దక్షిణాఫ్రికా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 128.5 ఓవర్లలో 308 పరుగుల వద్ద ఆలౌటైంది. రూడి సెకండ్‌ (94; 15 ఫోర్లు), షాన్‌ వోన్‌ బెర్గ్‌ (50; 6 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. పేసర్‌ రజనీశ్‌ గుర్బాని (2/45) ఎట్టకేలకు ఈ జోడిని విడగొట్టడంతో భారత్‌ ఊపిరిపీల్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆలౌట్‌ కాగా, భారత్‌ 584/8 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఈనెల 10 నుంచి రెండో అనధికారిక టెస్టు కూడా ఇక్కడే జరగనుంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement