భారత్ ‘ఎ’ ఉత్కంఠ విజయం | India 'A' win thriller | Sakshi
Sakshi News home page

భారత్ ‘ఎ’ ఉత్కంఠ విజయం

Published Sun, Jul 27 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

India 'A' win thriller

డార్విన్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో ఉత్కంఠభరితంగా సాగిన  వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ రెండు వికెట్లతో  గెలిచింది. శనివారం గార్డెన్స్ ఓవల్ మైదానంలో జరిగిన వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 275 పరుగులు చేసింది. రిలీ రోసో (150 బంతుల్లో 137; 15 ఫోర్లు) సెంచరీ చేశాడు.   

భారత్ ‘ఎ’ 49.5 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 276 పరుగులు చేసి నెగ్గింది. కరణ్ శర్మ (16 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు.  ఈ క్వాడ్రాంగులర్ సిరీస్‌లో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి 15 పాయింట్లతో టాప్‌లో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement