darwin
-
సృష్టివాదులు ససేమిరా ఒప్పుకోని పరిణామ సత్యం
ఒక అక్షరం, ఒక ఆలోచన, ఒక పుస్తకం సమాజాన్ని ప్రభావితం చేస్తాయా? ఆలోచనలు అనంతం. అక్షర శక్తి అనల్పం. ఇవి రెండూ ఏకమై పుస్తక రూపం తీసుకుంటే అది చూపే ప్రభావానికి ఎల్లలు ఉండవు. ఛార్లెస్ డార్విన్ 1859 నవంబర్ 24న వెలువరించిన ‘జాతుల పుట్టుక’ (ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్) అనే గ్రంథం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. వచ్చిన తొలిరోజే 1,250 కాపీలు అమ్ముడు పోయాయంటే ఆ గ్రంథం సృష్టించిన సంచలనం ఎంతటిదో అర్థం చేసు కోవచ్చు. అంతగా సంచలనాత్మకం కావటానికి అందులో ఉన్నదేమిటి? డార్విన్ ఆ పుస్తకంలో ప్రతిపాదించిన ‘జీవ పరిణామ సిద్ధాంతం’! అది నూతన భావ విస్ఫోటనానికి నాంది పలికింది. నాటి వరకూ సమాజంలో పాతుకుపోయిన సృష్టివాద నమ్మకాలకు భిన్నంగా కొత్త అవగా హనకూ, ఆలోచనలకూ పట్టం కట్టడం. అందుకే పరిణామ సిద్ధాంతాన్ని ఎర్న్స్ట్ మయర్ అనే శాస్త్రవేత్త నూతన పథ నిర్దేశినిగా పేర్కొన్నాడు.ఇంతకూ ఆ సిద్ధాంతం ఏం చెప్పింది? జీవులు... దగ్గర లక్షణాలున్న వాటి పూర్వీకులైన జీవుల నుండి పరిణామం చెందాయని. ఏ జీవీ ఉన్నది ఉన్నట్లుగా సృష్టి కాలేదనీ, ప్రకృతి పరిస్థితుల నెదుర్కొని దీర్ఘకాలంలో నేడు మనం చూస్తున్న జీవులు, జీవ వైవిధ్యం రూపుదిద్దుకున్నాయనీ. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ భూమిపై నివసించే ప్రతి జీవీ ప్రకృతి చెక్కిన శిల్పమే! ఇది ఒక భౌతిక ప్రక్రియ. ఇందులో ఏ అతీత శక్తుల ప్రమేయం లేదని ఆధారాలతో మరీ వివరించాడు డార్విన్. ఇదే సృష్టివాదులకు కంటగింపుగా మారింది. మనిషితో సహా అన్ని రకాల జంతు, వృక్ష జాతులనూ ఇప్పుడు ఉన్నట్లుగానే దేవుడు సృష్టి చేశాడనీ, అవి మార్పు చెందటం కొత్త జాతులు రావటం అనే ప్రసక్తే లేదని దాదాపు అన్ని మతాల నమ్మకం. ఆ నమ్మకానికి చేటు తెస్తుందనుకున్న ఏ సిద్ధాంతాన్నైనా, ఎన్ని నిరూపణలు చూపినా అంగీకరించేందుకు సృష్టివాదులు ససేమిరా ఒప్పుకోరు. అందుకే ఆదిలోనే మతం నుండి వ్యతిరేకతను, దాడిని ఎదుర్కోవలసి వచ్చింది.అయినా ఈ సిద్ధాంతం 1930 నాటికి శాస్త్ర ప్రపంచ ఆమోదం పొందటం గమనార్హం. డార్విన్ చూపిన నిదర్శనాలు, ఇబ్బడిముబ్బడిగా సేకరించిన నమూనాలు, జీవ పరిణామ సిద్ధాంత ప్రతిపాదకుల్లో ఒకరైన ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలస్ మలయా దీవుల్లో కనిపెట్టిన అనేక జంతుజాతుల విశేషాలు సృష్టివాదుల నోరు కట్టేశాయి. డార్విన్ కాలం నాటి కంటే తరువాతి కాలంలోనే పరిణామాన్ని బలపరిచే ఎన్నో రుజువులు బయటపడినాయి. జీవించి ఉన్న జాతులను, గతించిన జాతులతో అనుసంధానించే అనేక మధ్యంతర జీవులు శిలాజాల రూపంలో దొరకటం డార్విన్ సిద్ధాంతాన్ని మరింత బలపరిచాయి. చదవండి: ఆదివాసులకు చేయూతనిద్దాం!శిలాజాలే కావు నేటి ఆధునిక పరిశోధనలు, జీనోమ్ సమాచారం సైతం డార్విన్ పరిణామ సిద్ధాంత విశిష్టతను, సత్యాన్ని చాటడం విశేషం. ఇంతటి ప్రభావశీలమైన జీవ పరిణామ సిద్ధాంతాన్ని వెల్లడించిన గ్రంథం వెలువడిన నవంబర్ 24వ తేదీని ‘అంతర్జాతీయ జీవ పరిణామ దినం’గా ప్రపంచం జరుపుకొంటోంది. పరిణామ విశ్వజనీనతనూ, సత్యాన్నీ ప్రజల ముందుంచే పనిని సైన్సు ప్రచార సంస్థలు భుజానికెత్తుకుని పరిణామ దినోత్సవాన్ని జరుపుతున్నాయి.– ప్రొఫెసర్ కట్టా సత్యప్రసాద్, జన విజ్ఞాన వేదిక ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షులు(నవంబర్ 24న అంతర్జాతీయ జీవ పరిణామ దినోత్సవం) -
హైదరాబాద్‌లో డార్విన్‌బాక్స్ కొత్త హెడ్‌క్వార్టర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానవ వనరుల టెక్నాలజీ సేవల సంస్థ డార్విన్‌బాక్స్ హైదరాబాద్‌లో తమ కొత్త గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌ను ప్రారంభించింది. వచ్చే ఆరు నెలల్లో ఇక్కడి ఉద్యోగుల సంఖ్యను 1,000కి పెంచుకోనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని సోమవారం తెలిపారు. ప్రస్తుతం ఈ సంఖ్య 700గా ఉండగా, అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లలో కలిపి దాదాపు 1,200 మంది ఉన్నట్లు ఆయన వివరించారు. కొత్తగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లో సిబ్బందిని తీసుకోనున్నట్లు చెప్పారు. మరోవైపు, రాబోయే మూడేళ్లలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉన్నట్లు రోహిత్ వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీ విభాగం లాభాలు నమోదు చేయడంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. యూరప్, అమెరికా తదితర మార్కెట్లలో కార్యకలాపాలు మరింతగా విస్తరించనున్నట్లు వివరించారు. 2015లో చైతన్య పెద్ది, జయంత్ పాలేటి, రోహిత్ చెన్నమనేని ప్రారంభించిన డార్విన్‌బాక్స్‌కు 700 పైచిలుకు క్లయింట్లు, దాదాపు 20 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో సమీకరించిన 72 మిలియన్ డాలర్ల నిధులతో యూనికార్న్ హోదా (బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) దక్కించుకుంది. -
‘మమ్మల్ని తేలిగ్గా తీసుకోవద్దు’ - రాజీవ్ బజాజ్ కీలక వ్యాఖ్యలు
పుణె: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో స్టార్టప్స్ సంస్థలు కుప్పతెప్పలుగా వస్తున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశీ టూ–వీలర్ దిగ్గజాలను అంత తేలికగా తీసుకోవద్దని పేర్కొన్నారు. ‘ఏవో కొన్ని స్టార్టప్‌లు అనుకుంటున్నట్లుగా మంచి భారతీయ ద్విచక్ర వాహన కంపెనీలు మరీ అంత తేలికైనవి కాదు. మేము అక్టోబర్‌లో మోటర్‌సైకిల్‌ను ఆవిష్కరిస్తే.. మీకు నవంబర్‌లో చేతికి అందుతుంది. అంతే గానీ 2021లో ఆవిష్కరిస్తే డెలివరీ తీసుకునేందుకు మీరు 2022 దాకా వేచి చూస్తూ కూర్చోనక్కర్లేదు. అది స్టార్టప్‌లు పనిచేసే తీరు. చాలా ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న దిగ్గజాల పనితీరు అలా ఉండదు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. డార్విన్ సిద్ధాంతం 150 సీసీ మించిన స్పోర్ట్స్ మోటర్‌సైకిల్స్ విభాగంలో ఎన్ఫీల్డ్, బజాజ్, టీవీఎస్‌లకు 70–80 శాతం మార్కెట్ వాటా ఉంటుందన్నారు. సరికొత్తగా పల్సర్ 250ని ఆవిష్కరించిన సందర్భంగా బజాజ్ ఈ విషయాలు రాజీవ్ బజాజ్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో స్టార్టప్‌ల నుంచి బడా కంపెనీలకు పోటీ ఎదురయ్యే అంశంపై స్పందిస్తూ.. చార్లెస్ డార్విన్ పరిణామ క్రమం సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. అత్యంత తెలివైన, బలమైన జీవి కాకుండా మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగించగలవని, సంస్థలకు కూడా అదే వర్తిస్తుందని పేర్కొన్నారు. -
తేనెను జుర్రేసే ప్రత్యేక పురుగు.. దీని నాలుక ఎంత పెద్దదో తెలుసా?
తేనెటీగలు, తుమ్మెదలు, ఇంకా కొన్నిరకాల పురుగులు పూలలో తేనెను జుర్రేస్తూ మజా చేస్తుంటాయి. పూల లోపలికి నాలుక (గొట్టం వంటి ప్రత్యేక నిర్మాణం) చాపి తేనెను పీల్చేస్తాయి. మరి బాగా పెద్దవో, పొడుగ్గానో ఉండే పూలు అయితే ఎలా? అలాంటి పూల నుంచీ తేనెను జుర్రేసే ప్రత్యేకమైన పురుగే.. డార్విన్స్ మోత్ (చిమ్మట). ఆఫ్రికా ఖండం తీరానికి సమీపంలోని మడగాస్కర్ దీవుల్లో ఉండే ఈ పురుగు నాలుక ఎంత పెద్దదో తెలుసా.. ఏకంగా 11.2 అంగుళాలు. ఇంచుమించు ఒక అడుగు పొడవు అన్నమాట. ఆ పురుగు సైజు మాత్రం రెండు, మూడు అంగుళాలే ఉంటుంది. డార్విన్స్ మోత్ ప్రత్యేకతలపై ఇటీవల పరిశోధన చేసిన లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు.. దాని నాలుక పొడవును కొలిచి రికార్డు చేశారు. చదవండి: మా నాన్న క్రేజీ.. పొద్దున మాత్రం లేజీ’.. ఐదేళ్ల చిన్నారి ఫన్నీ కవిత వైరల్ చూడక ముందే ఊహించి.. జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్‌కు ఈ చిమ్మట పురుగుకు ప్రత్యేక సంబంధం ఉంది. మడగాస్కర్‌లో చెట్లు, మొక్కలను పరిశీలిస్తున్న క్రమంలో డార్విన్‌కు ‘అంగ్రాకమ్ సెస్కీపెడబుల్’గా పిలిచే ఒకరకం ఆర్కిడ్ పూల మొక్క కనబడింది. దాని పూల కాడలు చాలా పొడవుగా ఉండి.. కిందివైపున తేనె (నెక్టార్) ఉన్నట్టు గుర్తించారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు ఇలాంటి పూల నుంచి తేనె పీల్చే సామర్థ్యమున్న పురుగులు ఉండి ఉంటాయని, వాటి నాలుక చాలా పొడవుగా ఉంటుందని 1862వ సంవత్సరంలోనే డార్విన్ అంచనా వేశారు. కానీ తర్వాత 40 ఏళ్ల వరకు కూడా ఎవరూ ఆ పురుగులను గుర్తించలేకపోయారు. 1903వ సంవత్సరంలో కొందరు శాస్త్రవేత్తలకు ఈ పురుగు కంటబడింది. దానిని ముందే ఊహించిన డార్విన్ పేరిటే దీనికి ‘డార్విన్స్ మోత్’ అని నామకరణం చేశారు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా చేరిన తొలి విమానం!
కాన్బెర్రా: దేశంలో కోవిడ్ విజృంభిస్తుండటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం గత నెలలో భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. దీనిపై తీవ్ర మిర్శలు తలెత్తడంతో ఈ నెల 15 నుంచి భారత్‌లో చిక్కుకున్న తమ దేశ పౌరులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా పౌరులను తీసుకువెళ్లిన తొలి విమానం శనివారం డార్విన్ చేరుకుంది. కాంటాస్ విమానం ద్వారా 80 మంది ప్రయాణికులను ఆస్ట్రేలియా చేర్చారు. విమానంలో బోర్డ్ అవ్వడానికి ముందే వీరంతా రెండు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్లు చూపించారు. ఇక వీరందరిని హోవార్డ్ స్ప్రింగ్స్ ప్రాంతంలో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కోశాధికారి జోశ్ ఫ్రైడెన్‌బర్గ్ మాట్లాడుతూ.. ‘‘వైద్యుల సూచనలు పాటిస్తూ.. ఇక్కడి పౌరులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇండియా నుంచి మొదటి విమానం వచ్చిందని తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇక వీరంతా ఆస్ట్రేలియా చేరడానికి ముందే వారికి పరీక్షలు నిర్వహించడం చాలా ముఖ్యం. మేం ఇదే అనుసరిస్తున్నాం. ఈ నెలలో మరో రెండు రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు మా పౌరులను స్వదేశానికి తీసుకురానున్నాయి. జూన్ వరకు 1,000 మంది స్వదేశానికి చేరుకోవాలని భావిస్తున్నారు’’ అని తెలిపారు. ‘‘మా ప్రభుత్వం డార్విన్ నగరానికి ఆగ్నేయంగా 25 కి.మీ (16 మైళ్ళు) దూరాన ఉన్న హోవార్డ్ స్ప్రింగ్స్‌లోని క్వారంటైన్ సెంటర్ సామార్థ్యాన్ని రెంటింపు చేయాలని నిర్ణయించుకుంది. ఫలితంగా జూన్‌లో ప్రతి రెండు వారాలకు సుమారు 2,000 మందిని ఆస్ట్రేలియా చేర్చనున్నాం’’ అన్నారు. ఇక భారత్ నుంచి దాదాపు 9 వేల మంది ఆస్ట్రేలి యాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు. చదవండి: భారత్‌పై నిషేధం: నిర్మోహమాటంగా కోర్టు నిరాకరణ -
‘జెట్’ విక్రయంలో కదలిక!
ముంబై: జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు ఆసక్తి చూపించిన డార్విన్ గ్రూపు బుధవారం ఎస్బీఐ క్యాప్స్‌తో భేటీ అయింది. జెట్‌ను అప్పులతో సహా సొంతం చేసుకునేందుకు రూ.14,000 కోట్లను ఇవ్వజూపినట్టు సమావేశం అనంతరం డార్విన్ గ్రూపు సీఈవో రాహుల్ గన్‌పులే తెలిపారు. ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, రియల్టీ తదితర రంగాల్లో డార్విన్ గ్రూపునకు పెట్టుబడులున్నట్టు గ్రూపు తెలియజేసింది. ‘‘ఎస్బీఐ క్యాప్స్ మమ్మల్ని ఆహ్వానించింది. జెట్ ఎయిర్వేస్ ఆస్తులు, అప్పుల వివరాలను సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. జెట్ కోసం తాము ఈ నెల 8న బిడ్ వేసినట్టు గన్‌పులే ధ్రువీకరించారు. ఫైనాన్షియల్ బిడ్ సమర్పించే ముందు తగిన విచారణలు చేశామని, అయినప్పటికీ బయటకు వెల్లడి కాని మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకున్నట్టు చెప్పారు. ఏకీకృత ఒప్పందం కింద గత కాలపు అప్పులన్నీ తీసుకుంటామని, కొనుగోలుకు అవసరమైన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని తెలిపినట్టు వెల్లడించారు. అయితే, ఎస్బీఐ క్యాప్స్ తమను నిధులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోరినట్టు చెప్పారు. ఎతిహాద్‌ను బోర్డులోకి తీసుకునేందుకు ఆ సంస్థతోనూ సంప్రదించినట్టు తెలిపారు. ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతలు జెట్ ఎయిర్వేస్కు రూ.8,000 కోట్లకు పైగా రుణాలివ్వగా, వసూలు చేసుకోలేని స్థితిలో చివరికి రుణాలను ఈక్విటీగా మార్చుకుని కంపెనీలో మెజారిటీ (51 శాతం) వాటాదారులు అయిన విషయం తెలిసిందే. అనంతరం జెట్ ఎయిర్వేస్లో 75 శాతం వాటాను బ్యాంకుల తరఫున ఎస్బీఐ క్యాప్స్ అమ్మకానికి ఉంచింది. కంపెనీలో ప్రస్తుతం 24 శాతం వాటా కలిగిన ఎతిహాద్‌తో పాటు మరో రెండు సంస్థల నుంచి బిడ్లు రాగా, ఎతిహాద్ బిడ్ షరతులతో కూడి ఉన్నట్టు గుర్తించింది. హిందుజాలను ఒప్పించే యత్నం? జెట్ ఎయిర్వేస్కు రుణాలిచ్చిన సంస్థలు, ఎతిహాద్ కలసి హిందుజా గ్రూపును సంప్రదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జెట్ ఎయిర్వేస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాటా తీసుకోవాలని కోరినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై హిందుజా సోదరులు ఎలాంటి హామీనీ ఇవ్వలేదు. ఎతిహాద్ ప్రతినిధులు తొలుత హిందుజా సోదరుల్లో గ్రూపు వ్యవహారాలు చూసే జీపీ హిందుజాను సంప్రదించారు. అయితే, భారత వ్యాపారాలను చూస్తున్న తమ్ముడు అశోక్ హిందుజాతో ఎతిహాద్ ప్రతినిధులను జీపీ హిందుజా మాట్లాడించారు. జెట్‌లో పెట్టుబడిపై హిందుజా గ్రూపు హామీ ఇవ్వలేదని ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఏవియేషన్‌పై గతంలో హిందుజాల ఆసక్తి ఆటోమోటివ్, ఆయిల్, స్పెషాలిటీ కెమికల్స్, మీడియా, ఐటీ, విద్యుత్, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ ఇలా పది వ్యాపారాల్లో హిందుజాలున్నారు. 2001లో ఎయిర్ ఇండియా కోసం హిందుజా గ్రూపు ఆసక్తి కూడా చూపించింది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా అప్పట్లో పోటీ పడ్డాయి. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో 26 శాతం వాటా పట్ల కూడా హిందుజా గ్రూపు గతంలో ఆసక్తి చూపించింది. మరింత నష్టపోయిన షేరు కంపెనీ నిర్వహణ విషయంలో అస్పష్టత నేపథ్యంలో వరుసగా మూడో రోజూ జెట్ ఎయిర్వేస్ షేరు నష్టపోయింది. కంపెనీ సీఈవో వినయ్‌దూబే, డిప్యూటీ సీఈవో అమిత్ అగర్వాల్ రాజీనామాలు చేయడం షేరుపై ప్రభావం చూపించాయి. బీఎస్ఈలో బుధవారం షేరు ధర 4 శాతానికి పైగా నష్టపోయి 123.70 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో నూతన 52 వారాల కనిష్ట స్థాయి రూ.120.25 నమోదు చేసింది. -
కోతికి కజిన్లు
తెలివైన శత్రువుకంటే తెలివితక్కువ స్నేహితుడే ఎక్కువ ప్రమాదకారి. ప్రతి ఒక్క ఫిలాసఫర్ ఎక్కడో ఒక చోట ఈ మాట చెప్పే ఉంటాడు. ఎవరూ చెప్పకపోయినా, ప్రతి ఒక్కరికీ జీవితంలో ఇలాంటి అనుభవం ఒకటి ఎదురయ్యే ఉంటుంది. సత్యపాల్ సింగ్ సెంట్రల్ మినిస్టర్. ఉన్నత విద్యాశాఖకు ఈమధ్యే సెప్టెంబర్‌లో మంత్రిగా వచ్చారు. శనివారం ఔరంగాబాద్‌లో అఖిలభారతీయ వైదిక సమ్మేళంలో ప్రసంగిస్తూ, డార్విన్ సిద్ధాంతం తప్పు అన్నారు. స్కూళ్లలోంచి, కాలేజీల్లోంచి పాఠ్యపుస్తకాల్లో డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతాన్ని తీసెయ్యాలి అన్నారు. ‘‘కోతి నుంచి మనిషి పుట్టాడని డార్విన్ చెప్పాడు. అదే నిజమైతే కోతి నుంచి మనిషి పుట్టడాన్ని మన పూర్వీకులు ఎవరైనా చూసి ఉండాలి కదా! చూసినట్లు ఏ వేదంలోనూ లేదు. మనుషులు రావడం రావడమే భూమ్మీదకు మనుషులుగా వచ్చారు’’ అన్నది సత్యపాల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మర్నాడు, ఆదివారం పుణెలోని సీనియర్ సైంటిస్టులు కొందరు కలిసి కూర్చొని సత్యపాల్ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ, పన్నెండొందల సంతకాలతో మంత్రిగారి శాఖకు ఒక లేఖ రాశారు! ‘చెప్పండి, డార్విన్ సిద్ధాంతాన్ని పిల్లల పుస్తకాల్లోంచి మీరెలా తీస్తారు?’ అని. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయంటే ఎలా? వందేళ్లుగా డార్విన్ సిద్ధాంతంపై మా సైంటిస్టులు అధ్యయనాలు చేస్తున్నారు. ఆ ఫలితాలన్నీ కూడా డార్విన్‌ని సమర్థించే విధంగానే ఉన్నాయి. మినిస్టర్ గారికి ఈ మాత్రం జీకే కూడా లేకపోవడం మాకు షాకింగ్‌గా ఉంది’ అని రేడియో ఆస్ట్రోనామర్ గోవింద్ స్వరూప్, హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ రీడర్ అనికేత్ సూళే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు! నిజానికి వీళ్లేం దిగ్భ్రాంతికి లోనుకానవసరం లేదు. మంత్రిగారి మాటలకు దిగాలు పడనవసరమూ లేదు. సత్యపాల్ తనకు తోచింది అన్నారు తప్ప, తోచినంత పనీ చేయిస్తాడని, ఒకవేళ మోదీని ఒప్పించి చేయించినా డార్విన్ సిద్ధాంతం మరుగున పడిపోతుందని ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. ముఖ్యంగా సైంటిస్టులు. మంత్రిగారు అన్నట్లు లేదా మనమంతా నమ్ముతున్నట్లు .. మనిషి కోతి నుంచి వచ్చాడని డార్విన్ ఎక్కడా చెప్పలేదు. అసలు ‘మనిషి ఫ్రమ్ కోతి’ అనే మాటే డార్విన్ రాసిన సిద్ధాంత గ్రంథం ‘ది డిస్సెంట్ ఆఫ్ మ్యాన్’లోని ఏ పేజీలోనూ లేదు! ‘కోతి, మనిషి ఒకే చెట్టు కొమ్మలు’ అని డార్విన్ అన్నాడు తప్ప, కోతి ఆ కొమ్మపై నుంచి ఈ కొమ్మకు ఎగిరీ ఎగిరీ చివరికి మనిషైపోయింది అనేమీ సూత్రీకరించలేదు. కోతి, మనిషి కజిన్స్. కజిన్ నుంచి మనిషి రాడు కదా! ఇంత చిన్న విషయం మంత్రిగారి మాటలకు ‘షాక్ తిన్న’ సైంటిస్టులకు తెలియకుండా ఉంటుందా?! మంత్రిగారి వల్ల సైన్స్‌కి వచ్చే నష్టంగానీ, ఆయన మాటలపై సైంటిస్టులు స్పందించకుండా ఉంటే డార్విన్ సిద్ధాంతానికి జరిగే హానిగానీ ఏమీ ఉండదు. సైంటిస్టులు కూల్‌గా ఉంటే పోయేది. తెలివైన శత్రువుకంటే తెలివితక్కువ స్నేహితుడే డార్విన్‌కి ఎక్కువ ప్రమాదకారి. – మాధవ్ శింగరాజు -
మళ్లీ కౌంటర్ వేసిన ప్రకాశ్ రాజ్
సాక్షి, బెంగళూర్ : సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ట్విటర్ లో కౌంటర్ వేశారు. కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ కు ఈ విలక్షణ నటుడు సూటిగా చురకలు అంటించాడు. ‘‘మనిషి కోతి నుంచి పుట్టాడన్న విషయాన్ని మన పూర్వీకులు చూడలేదని మంత్రిగారు చెబుతున్నారు. కానీ, అయ్యా.. అందుకు భిన్నమైన పరిస్థితులను మనం ఇప్పుడు చూస్తున్నామన్న విషయాన్ని మీరు అంగీకరించకుండా ఉండగలరా? మనిషి కోతిలాగా మారి గతాన్ని తవ్వుతూ మళ్లీ రాతి యుగం కాలం నాటికి తీసుకెళ్తున్నాడు’’ అంటూ ప్రకాశ్ రాజ్ మంత్రిని ఉద్దేశించి ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారు. కాగా, ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మానవజాతి భూమి మీద అలాగే ఉండేదని.. కాబట్టి డార్విన్ సిద్ధాంతం పూర్తిగా తప్పని ఆయన చెప్పారు. తక్షణమే ఈ సిద్ధాంతాన్ని కళాశాలలు, పాఠశాలల్లో అధ్యాపకులు బోధించడం ఆపాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రిని ట్రోల్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “ our ancestors have not seen ape evolving in to man” says minister. But dear sir,..can you deny that we are witnessing..the reverse....man evolving into ape by digging the past and trying to take us back into STONE AGE......#justasking — Prakash Raj (@prakashraaj) 22 January 2018 -
కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, ఔరంగాబాద్ : ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మానవజాతి భూమి మీద అలాగే ఉండేదని అన్నారు. ఈ నేపథ్యంలో డార్విన్ సిద్ధాంతం పూర్తిగా తప్పని చెప్పారు. ఈ సిద్ధాంతాన్ని కళాశాలలు, పాఠశాలల్లో అధ్యాపకులు బోధించడం ఆపాలని పిలుపునిచ్చారు. డార్విన్ సిద్ధాంతం ప్రతిపాదించిన విధంగా మానవ పరిణామ క్రమం గురించి పురాతన భారతీయ గ్రంథాల్లో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. డార్విన్ పేర్కొన్న జీవపరిణామక్రమ సిద్ధాంతం శాస్త్రీయంగా కూడా నిరూపితం కాలేదని అన్నారు. భూమి ఏర్పడ్డనాటి నుంచి మనిషి.. మనిషిగానే సంచరించాడని, అలాగే ఎదిగాడని తెలిపారు. డార్విన్ సిద్ధాంతం తప్పని 35 ఏళ్ల కిందటే శాస్త్రవేత్తలు నిరూపించారని గుర్తు చేశారు. -
భారత్ ‘ఎ’కే టైటిల్
ఫైనల్లో ఆస్ట్రేలియా ‘ఎ’పై గెలుపు నాలుగు దేశాల వన్డే టోర్నీ డార్విన్: టోర్నీ అంతటా నిలకడగా ఆడిన భారత ‘ఎ’ జట్టు నాలుగు దేశాల వన్డే టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం ఆతిథ్య ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన ఫైనల్లో భారత యువజట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కామెరూన్ వైట్ (150 బంతుల్లో 137; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ, ఫిలిప్ హ్యూజెస్ (70 బంతుల్లో 51; 3 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆసీస్‌కు గట్టి పునాది వేయగా, చివర్లో కటింగ్ (21 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి భారీస్కోరునందించాడు. అనంతరం భారత కుర్రాళ్లు 48.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసి గెలిచారు. ఒక దశలో 51 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను మనోజ్ తివారి (75 బంతుల్లో 50; 3 ఫోర్లు), కేదార్ జాదవ్ (73 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ఆదుకున్నారు. అయితే వీరిద్దరు వెంటవెంటనే అవుట్ కావడంతోపాటు 182 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మరోసారి భారత్ ఇక్కట్లలో పడింది. ఈ దశలో రిషి ధావన్ (55 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు), అక్షర్ పటేల్ (38 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్)లు ఏడో వికెట్‌కు అజేయంగా 93 పరుగులు జోడించి భారత్‌ను గెలిపించారు. సంక్షిప్త స్కోర్లు ఆస్ట్రేలియా ‘ఎ’: 50 ఓవర్లలో 274/5 (వైట్ 137, హ్యూజెస్ 51; ధావళ్ కులకర్ణి 3/51); భారత్ ‘ఎ’: 48.4 ఓవర్లలో 275/6 (జాదవ్ 78, రిషి ధావన్ 56 నాటౌట్; కటింగ్స్ 3/46). -
భారత్ ‘ఎ’ ఉత్కంఠ విజయం
డార్విన్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో ఉత్కంఠభరితంగా సాగిన వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ రెండు వికెట్లతో గెలిచింది. శనివారం గార్డెన్స్ ఓవల్ మైదానంలో జరిగిన వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 275 పరుగులు చేసింది. రిలీ రోసో (150 బంతుల్లో 137; 15 ఫోర్లు) సెంచరీ చేశాడు. భారత్ ‘ఎ’ 49.5 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 276 పరుగులు చేసి నెగ్గింది. కరణ్ శర్మ (16 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. ఈ క్వాడ్రాంగులర్ సిరీస్‌లో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి 15 పాయింట్లతో టాప్‌లో ఉంది. -
భారత్ ‘ఎ’ బోనస్ విజయం
రాణించిన తివారి, పాండే డార్విన్: నాలుగు జట్ల వన్డే టోర్నీలో భారత్ ‘ఎ’కు తొలి విజయం దక్కింది. ఆదివారం ఆస్ట్రేలియా ‘ఎ’ చేతిలో పరాజయం పాలైన భారత్... మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరు సాధించింది. మనోజ్ తివారి (73 బంతుల్లో 93; 9 ఫోర్లు, 1 సిక్స్), మనీశ్ పాండే (108 బంతుల్లో 91; 7 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీలు కోల్పోగా, ఉన్ముక్త్ చంద్ (62 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మర్చంట్ డి లాంజ్‌కు 5 వికెట్లు దక్కాయి. అనంతరం దక్షిణాఫ్రికా 47.1 ఓవర్లలో 256 పరుగులకే ఆలౌటైంది. హెండ్రిక్స్ (68 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ ఆంటాంగ్ (40 బంతుల్లో 48; 5 ఫోర్లు) మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. ధావల్ కులకర్ణి (5/54) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. భారీ తేడాతో గెలిచిన భారత్‌కు బోనస్ పాయింట్ కూడా లభించింది.