పోష్‌స్ట్రూమ్: భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. మూడో రోజు 181/3 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 89.4 ఓవర్లలో 276 పరుగుల వద్ద ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (82 బంతుల్లో 65; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) క్రితం రోజు స్కోరుకు మరో 9 పరుగులే జోడించి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన వారిలో షాబాజ్ నదీమ్ (36) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.
డేన్ పీడ్ 4, ప్యాటర్సన్ 3 వికెట్లు తీశారు. సఫారీ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా ‘ఎ’ ఆట నిలిచే సమయానికి 52 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. స్టీఫెన్ కుక్ (55 బ్యాటింగ్; 7 ఫోర్లు), ఫెలుక్‌వాయో (29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సఫారీ జట్టు 184 పరుగుల ఆధిక్యంలో ఉంది.
భారత్ ‘ఎ’ 276 ఆలౌట్
Published Tue, Aug 22 2017 12:40 AM | Last Updated on Tue, Sep 12 2017 12:41 AM
Advertisement
Advertisement