భారత్‌ ‘ఎ’ ఘన విజయం | India 'A' posts a thumping innings win | Sakshi
Sakshi News home page

భారత్‌ ‘ఎ’ ఘన విజయం

Published Tue, May 28 2019 5:58 AM | Last Updated on Tue, May 28 2019 9:44 AM

 India 'A' posts a thumping innings win - Sakshi

బెల్గామ్‌: శ్రీలంక ‘ఎ’ జట్టుపై భారత్‌ ‘ఎ’ గర్జించింది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో లంక పనిపట్టింది. దీంతో తొలి అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ ఇన్నింగ్స్‌ 205 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ (4/78, 4/45) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తిప్పేశాడు. మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. డిక్‌వెలా (103; 15 ఫోర్లు) పోరాటంతో తొలి ఇన్నింగ్స్‌లో 200 పైచిలుకు పరుగులు చేసిన శ్రీలంక ‘ఎ’... రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది. ఏ ఒక్కరూ కనీసం 50 పరుగులైనా చేయకుండానే భారత బౌలర్లకు తలవంచారు.

సోమవారం 16 వికెట్లు కూలడంతో నాలుగు రోజుల మ్యాచ్‌ కాస్తా మూడు రోజుల్లోనే ముగిసింది. 83/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడోరోజు ఆట ప్రారంభించిన శ్రీలంక ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 232 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌లో  ప్రియాంజన్‌ (49; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా,  డిక్‌వెలా శతకం సాధించాడు. వీళ్లిద్దరు ఐదో వికెట్‌కు 111 పరుగులు జోడించారు.  సందీప్‌ వారియర్, జయంత్‌ చెరో 2 వికెట్లు తీశారు. భారత్‌కు 390 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో అనంతరం ఫాలోఆన్‌ ఆడిన శ్రీలంక ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 52.3 ఓవర్లలో 185 పరుగులకే కుప్పకూలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement