షార్జా: ఈ ఐపీఎల్ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ముంబైపై సీఎస్‌కే ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. కాగా, ఆ తర్వాత చతికిలబడ్డ సీఎస్‌కే వరుస ఓటములను చవిచూసి టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించింది. అయితే ఈరోజు(శుక్రవారం) ముంబై ఇండియన్స్-సీఎస్‌కేల మధ్య షార్జా వేదికగా రెండో అంచె మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కేపై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ముంబై ఇండియన్స్. (‘మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది’)
ఈ మేరకు ముంబై స్పిన్నర్ రాహుల్ చాహర్ మాట్లాడుతూ.. నేటి మ్యాచ్‌లో కచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు. అదే సమయంలో సీఎస్‌కే తరఫున ఆడుతున్న అన్న దీపక్ చాహర్‌ను కూడా టీజ్ చేస్తానంటున్నాడు. దీనిలో భాగంగా రాహుల్ చాహర్ ఒక వీడియోలో మాట్లాడుతూ అనేక విషయాలను షేర్ చేసుకున్నాడు. దీన్ని ముంబై ఇండియన్స్ తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
‘సీఎస్‌కేపై మేము మ్యాచ్ గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. ఒకవేళ మేము గెలిస్తే మాత్రం మా అన్న దీపక్ చాహర్‌ను టీజ్ చేయడం ఖాయం. నాకు 2018 బాగా గుర్తుంది. నన్ను మా బ్రదర్ దీపక్ చాహర్ టీజ్ చేశాడు. అతని జట్టు సీఎస్‌కే గెలిచిన తర్వాత నన్ను ఏడిపించాడు. ఆ తర్వాత నాకు అవకాశం వచ్చింది. 2019లో మేము సీఎస్‌కేపై గెలిచిన తరవఆత దీపక్‌ను టీజ్ చేశా. మళ్లీ ఇప్పుడు మరో అవకాశం నాకు వస్తుందని ఆశిస్తున్నా. బ్రదర్ కాస్కో.. నేను టీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అంటూ రాహుల్ చాహర్ పేర్కొన్నాడు. కాగా, తామిద్దరం ఎప్పుడు కలిసిన ఒకరి ఆట గురించి మరొకరం మాట్లాడుకోమని రాహుల్ చెప్పాడు. కానీ తాము జట్ల కోసం వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నాడు. మ్యాచ్ ఆడేటప్పుడు అన్నను కూడా ప్రత్యర్థి ఆటగాడు మాదిరిగానే చూస్తానన్నాడు. (గంభీర్.. ఇప్పుడేమంటావ్?)
Comments
Please login to add a commentAdd a comment