క్రికెట్‌లో టెక్నాలజీ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఫీల్డ్ అంపైర్ల పాత్రపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెక్నాలజీ ఉపయోగించి 90 శాతం నిర్ణయాలు థర్డ్ అంపైర్లు తీసుకుంటుంటే ఫీల్డ్ అంపైర్లు నామమాత్రంగా మారారని అన్నాడు. ఫీల్డ్ అంపైర్ అంటే ప్రతి నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు వదిలేయడం కాదని తెలిపాడు.
ఫీల్డ్ అంపైర్లు విచక్షణ ఉపయోగించి సొంత నిర్ణయాలు తీసుకుంటేనే క్రికెట్‌కు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రతి విషయాన్ని థర్డ్ అంపైరే తీసుకోవాల్సి వస్తే ఫీల్డ్ అంపైర్ అవసరమే లేదన్నాడు. ఇటీవల కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సంఘటనను దృష్టిలో పెట్టుకుని సిద్దూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో నడుము కంటే ఎత్తులో వచ్చిన ఫుల్ టాస్ బంతికి కోహ్లి ఔటయ్యాడు.
Navjot Singh Sidhu said, "now the on field umpire's job is not to stand in the stadium when 3rd umpire technology is being used for 90% of the decisions shown all on screen". (Star Sports). pic.twitter.com/uLmWRboLMZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2024
నో బాల్ కోసం కోహ్లి అప్పీల్ చేసినప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లి.. ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగి ఆగ్రహంగా మైదానాన్ని వీడాడు. ఈ వివాదాస్పద ఘటన క్రికెట్ వర్గాల్లో పెను దుమారం లేపింది.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ప్రస్తుతం రసపట్టులో సాగుతుంది. ఆర్సీబీ, పంజాబ్ మినహా అన్ని జట్లు ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి. రాజస్థాన్, కేకేఆర్, సన్‌రైజర్స్ జట్లకు ప్లే ఆఫ్స్ బెర్తులు దాదాపుగా ఖరారు కాగా.. మరో బెర్తు కోసం ఐదు జట్ల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్, కేకేఆర్, సన్‌రైజర్స్, లక్నో, సీఎస్‌కే, గుజరాత్, ముంబై, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ వరుస స్థానాల్లో ఉన్నాయి. అన్ని జట్లు మరో 5 లేదా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment