navjot singh siddhu
-
‘ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడిని ఆడించండి.. చుక్కలు చూపిస్తాడు’
ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టోక్స్ బృందంపై భారత్ తమ అత్యుత్తమ ‘స్పిన్’ అస్త్రాన్ని ప్రయోగించాలని సూచించాడు. ‘మిస్టరీ స్పిన్నర్ల’ను ఇంగ్లండ్ బ్యాటర్లు ఎదుర్కోలేరని.. వారి బలహీనతను అవకాశంగా మలచుకోవాలని పేర్కొన్నాడు.కాగా ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) గెలిచిన టీమిండియా.. రెండున్నర నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025తో బిజీబిజీగా గడుపనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.మింగుడుపడని మాత్రఇందులో భాగంగా ఇంగ్లిష్ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు టీమిండియా మేనేజ్మెంట్కు కీలక సూచనలు చేశాడు. ‘‘మిస్టరీ స్పిన్నర్లను ఎదుర్కోలేకపోవడం ఇంగ్లండ్‌కు ఉన్న అతిపెద్ద బలహీనత. వాళ్లకు ఇది మింగుడుపడని మాత్ర.ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలేమరి అలాంటప్పుడు వరుణ్ చక్రవర్తి లేకుండానే ఇంగ్లండ్‌కు వెళ్తారా? లేదు.. లేదు.. కచ్చితంగా అతడి ఇంగ్లండ్‌లో ఆడించాల్సిందే. లేదంటే కుల్దీప్ యాదవ్‌నైనా ప్రయోగిస్తారు. ఒకవేళ అతడు చెలరేగిపోయాడంటే.. ఇంగ్లండ్‌కు తిప్పలు తప్పవు.వరుణ్, కుల్దీప్.. ఇద్దరూ ఉన్నారంటే ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలే’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు అభిప్రాయపడ్డాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ప్రయోగించడం ద్వారా ఇంగ్లిష్ బ్యాటర్ల ఆట త్వరగా కట్టించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ వచ్చిన తర్వాత ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి రాత మారిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా ఉన్న సమయంలో ఈ స్పిన్ బౌలర్ నైపుణ్యాలను గుర్తించిన గౌతీ.. భారత జట్టులో అతడి పునరాగమనానికి మార్గం సుగమం చేశాడు. అయితే, కోచ్ పెట్టుకున్న నమ్మకాన్ని వరుణ్ నిలబెట్టుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీలోనూ సత్తా చాటి స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో దుమ్ములేపి.. వన్డేల్లోనూ అరంగేట్రం చేసిన వరుణ్.. చాంపియన్స్ ట్రోఫీలోనూ సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్ సందర్భంగా తుదిజట్టులోకి వచ్చిన ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్.. ఐదు వికెట్లతో దుమ్ములేపాడు.అనంతరం ఆస్ట్రేలియాతో సెమీస్‌లో రాణించిన వరుణ్.. కివీస్‌తో ఫైనల్లోనూ రెండు వికెట్లు తీశాడు. తద్వారా టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిని టెస్టుల్లోనూ అరంగ్రేటం చేయించాలని నవజ్యోత్ సింగ్ సిద్ధు బీసీసీఐకి సూచించడం గమనార్హం.‘తొలి విజయం’ కోసం..కాగా టీమిండియా గత రెండు టెస్టు సిరీస్‌లలో ఘోర పరాజయం చవిచూసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన రోహిత్ సేన.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్ అవకాశాలను పోగొట్టుకుంది. ఇక డబ్ల్యూటీసీ కొత్త ఎడిషన్(2025-27)లో ఇంగ్లండ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న భారత్.. భారీ విజయంతో కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. కాగా జూన్ 30 నుంచి టీమిండియా ఇంగ్లండ్ పర్యటన మొదలుకానున్నట్టు సమాచారం.చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’ -
అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారు: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు(Navjot Singh Sidhu) మండిపడ్డాడు. అందరు ఆటగాళ్లను సమానంగా చూడాలని.. అభ్రతా భావంతో కుంగిపోయేలా చేయకూడదని హితవు పలికాడు. భారత తుదిజట్టులో కేఎల్ రాహుల్(KL Rahul)ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారంటూ సిద్ధు ఘాటు విమర్శలు చేశాడు.ఆరంభంలో ఓపెనర్‌గా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆరంభంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తర్వాత మిడిలార్డర్‌కు డిమోట్ చేశారు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ ఓపెనర్‌గా పంపారు.టీ20లకు దూరంఇక వన్డే జట్టులో వికెట్ కీపర్‌గా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా రాహుల్ సేవలు వినియోగించుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. టీ20ల నుంచి పూర్తిగా అతడిని పక్కనపెట్టింది. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాహుల్‌కు కలిసివచ్చిన ఐదో స్థానంలో అక్షర్ పటేల్‌ను ప్రమోట్ చేసి.. ఆరో స్థానంలో అతడిని ఆడించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఇదే కొనసాగించింది.మారుస్తూనే ఉన్నారుఅయితే, తాను ఏ స్థానంలో వచ్చినా చాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ మాత్రం అదరగొడుతున్నాడు. గ్రూప్ దశలో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 47 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను ఐదు, అక్షర్‌ను ఆరో స్థానంలో పంపగా.. రాహుల్‌కు ఆడే అవకాశం రాలేదు.ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మళ్లీ రాహుల్‌ను ఆరో స్థానంలో పంపగా.. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 29 బంతుల్లో 23 రన్స్ చేశాడు. అయితే, ఆస్ట్రేలియాతో కీలకమైన సెమీ ఫైనల్లో మాత్రం ఈ కర్ణాటక స్టార్ అదరగొట్టాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో వచ్చిన రాహుల్ 34 బంతుల్లోనే 42 పరుగులతో అజేయంగా నిలిచి.. సిక్సర్‌తో జట్టు విజయాన్ని ఖరారు చేశాడు.అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారుఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు కురుస్తున్నా... జట్టులో తనకంటూ సుస్థిర స్థానం లేకపోవడం పట్ల నవజ్యోత్ సింగ్ సిద్ధు సానుభూతి వ్యక్తం చేశాడు. ‘‘కేఎల్ రాహుల్... మీకు తెలుసా?.. అదనంగా మన దగ్గర పెట్టుకునే టైర్ కంటే కూడా అధ్వాన్నంగా, దారుణంగా అతడిని మేనేజ్మెంట్ వాడుకుంటోంది.ఓసారి వికెట్ కీపర్‌గా మాత్రమే ఆడిస్తారు, ఓసారి ఓపెనర్‌గా రమ్మంటారు.. మరోసారి ఐదు.. ఆరు స్థానాలు.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ వస్తే.. మూడో నంబర్లో ఆడమంటారు. మీ రెగ్యులర్ ఓపెనర్లు అందుబాటులో లేకుంటే మళ్లీ ఇన్నింగ్స్ ఆరంభించమంటారు.వన్డేల్లో ఓపెనర్‌గా రావడం సులువే. కానీ టెస్టుల్లో మాత్రం కష్టం. ఏదేమైనా జట్టు కోసం అతడు నిస్వార్థంగా తన స్థానాన్ని త్యాగం చేస్తూనే ఉన్నాడు’’ అని భారత జట్టు మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.కాగా కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 58 టెస్టులు, 84 వన్డేలు, 72 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఎనిమిది శతకాల సాయంతో 3257 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో ఏడు సెంచరీలు కొట్టి 3009 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇక టీ20లలోనూ రెండు శతకాలు నమోదు చేసిన రాహుల్ ఖాతాలో 2265 పరుగులు ఉన్నాయి.చదవండి: ‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్ -
IPL 2024: ఫీల్డ్ అంపైర్ల పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సిద్దూ
క్రికెట్లో టెక్నాలజీ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఫీల్డ్ అంపైర్ల పాత్రపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెక్నాలజీ ఉపయోగించి 90 శాతం నిర్ణయాలు థర్డ్ అంపైర్లు తీసుకుంటుంటే ఫీల్డ్ అంపైర్లు నామమాత్రంగా మారారని అన్నాడు. ఫీల్డ్ అంపైర్ అంటే ప్రతి నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు వదిలేయడం కాదని తెలిపాడు.ఫీల్డ్ అంపైర్లు విచక్షణ ఉపయోగించి సొంత నిర్ణయాలు తీసుకుంటేనే క్రికెట్‌కు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రతి విషయాన్ని థర్డ్ అంపైరే తీసుకోవాల్సి వస్తే ఫీల్డ్ అంపైర్ అవసరమే లేదన్నాడు. ఇటీవల కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సంఘటనను దృష్టిలో పెట్టుకుని సిద్దూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో నడుము కంటే ఎత్తులో వచ్చిన ఫుల్ టాస్ బంతికి కోహ్లి ఔటయ్యాడు. Navjot Singh Sidhu said, "now the on field umpire's job is not to stand in the stadium when 3rd umpire technology is being used for 90% of the decisions shown all on screen". (Star Sports). pic.twitter.com/uLmWRboLMZ— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2024 నో బాల్ కోసం కోహ్లి అప్పీల్ చేసినప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లి.. ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగి ఆగ్రహంగా మైదానాన్ని వీడాడు. ఈ వివాదాస్పద ఘటన క్రికెట్ వర్గాల్లో పెను దుమారం లేపింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ప్రస్తుతం రసపట్టులో సాగుతుంది. ఆర్సీబీ, పంజాబ్ మినహా అన్ని జట్లు ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి. రాజస్థాన్, కేకేఆర్, సన్‌రైజర్స్ జట్లకు ప్లే ఆఫ్స్ బెర్తులు దాదాపుగా ఖరారు కాగా.. మరో బెర్తు కోసం ఐదు జట్ల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్, కేకేఆర్, సన్‌రైజర్స్, లక్నో, సీఎస్కే, గుజరాత్, ముంబై, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ వరుస స్థానాల్లో ఉన్నాయి. అన్ని జట్లు మరో 5 లేదా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. -
రాజీనామా ఉపసంహరించుకున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని కలుసుకున్న అనంతరం తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. సిద్ధూ తన రాజీనామా ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. (చదవండి: ‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు) కాగా, రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో తాను లేవనెత్తిన సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తన విధులను యథావిధిగా తిరిగి కొనసాగిస్తునున్నట్లు పేర్కొన్నారు. చరణ్ జిత్ సింగ్ చన్నీ క్యాబినేట్లోని అధికారుల నియమాకాలపై తీవ్ర అసంతృప్తితోపాటు, ఇటీవల చన్నీ కుమారుడి వివాహానికి కూడా సిద్ధూ దూరంగా ఉండటం తదితర పరిణామాలన దృష్ట్య కాంగ్రెస్‌లో అంతర్గత ఉద్రిక్త వాతావరణం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు "సిద్ధూ కూడా తాన తన పదవికి రాజీనామా చేసిన గానీ ‘తాను గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రీల సిద్ధాంతాలను పాటిస్తాను. తాను కాంగ్రెస్ పార్టీలో పదవి ఉన్నా.. లేకున్నా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన నిలబడతాను వ్యతిరేక శక్తులు నన్ను కిందకు తోయాలని చూసినా అంతకు మించిన ఆశావాదంతో పంజాబ్‌లో ప్రతి పౌరుడి గెలుపు కోసం కృషి చేస్తాను" అంటూ ట్విటర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. (చదవండి: "నా స్టార్ట్ప్ బిజినెస్‌కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్") -
'సిద్దూ ఆడకపోవడంతోనే నాకు చాన్స్ వచ్చింది'
సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా ఎంత సక్సెస్ అయ్యాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని కెరీర్లో అగ్రభాగం ఓపెనింగ్ స్థానంలో ఆడిన విషయం విదితమే. అయితే కెరీర్ మొదట్లో పలు మ్యాచ్‌ల్లో మిడిల్ ఆర్డర్ స్థానంలోనూ సచిన్ ఆడాడు. అయితే తాను ఓపెనర్‌గా ప్రమోట్ అయిన విషయాన్ని సచిన్ తన పర్సనల్ యాప్ 100 ఎంబి ద్వారా మరోసారి గుర్తుచేశాడు. అప్పటి ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్దూ న్యూజిలాండ్ పర్యటనలో గాయపడడంతో తనకు ఓపెనర్‌గా ఆడే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో అప్పటి కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, మేనేజర్ అజిత్ వాడేకర్లకు కూడా స్థానం ఉందంటూ అభిప్రాయపడ్డాడు. 'ఆరోజు మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌కు అని హోటల్ నుంచి బయలుదేరాను. అయితే ఓపెనర్‌గా ఆడే అవకాశం వస్తుందని మాత్రం అనుకోలేదు. నేను మైదానంలోకి వెళ్లేసరికి అప్పటికే అజహర్, వాడేకర్‌లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు. మెడనొప్పి కారణంగా సిద్ధూ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదని, ఓపెనర్‌గా ఎవరిని ఆడిద్దామా అనే ఆలోచనలో ఉన్నారు. ఇంతలో తాను కలగజేసుకొని ఓపెనర్‌గా ఒక అవకాశం ఇవ్వాలని అడిగాను. అయితే నా ఆటతీరుపై నాకు నమ్మకం ఉండడంతో ఓపెనర్‌గా చెలరేగిపోతాననే నమ్మకం ఉండేది. కానీ ఎక్కడో ఓ మూల ఓపెనర్‌గా రాణించగలనా అనే అనుమానం ఉండేది.. ఏది ఏమైనా నా ఆట నేను ఆడుతూనే అటాకింగ్ గేమ్‌కు ప్రాధాన్యమివ్వాలని అనుకున్నా' అంటూ తన మనోభావాన్ని వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 బౌండరీలు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఆ తర్వాత సచిన్ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన సచిన్ వన్డే కెరీర్లో 463 మ్యాచులాడి 18426 పరుగులు చేశాడు. కాగా ఇందులో 49 సెంచరీలు, 96 అర్థసెంచరీలు ఉన్నాయి. (డక్‌వర్త్ ‘లూయిస్’ కన్నుమూత) -
మాజీ క్రికెటర్‌పై కాంగ్రెస్ వల
బీజేపీకి రాజీనామా చేసి.. ఆమ్ ఆద్మీ పార్టీలో తగిన స్థానం లభించక ఏం చేయాలోనని కొట్టుమిట్టాడుతున్న మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల విసురుతోంది. వచ్చే సంవత్సరం పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ కీలక పాత్ర పోషించడానికి వేరే పార్టీలో చేరాలని సిద్ధూ ప్రయత్నించి.. బీజేపీ నుంచి బయటకు వచ్చారు. తన ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే.. పంజాబ్‌లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని భావించిన సిద్ధూకు అక్కడ తీవ్ర నిరాశ ఎదురైంది. పంజాబ్ ఎన్నికల కోసం ఆప్ విడుదల చేసే అభ్యర్థుల జాబితాలో తన భార్య పేరు కూడా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్ధూను కావాలంటే స్టార్ ప్రచారకుడిగా పెడతాం తప్ప ముఖ్యమంత్రి పదవికి మాత్రం ప్రకటించేది లేదని ఆప్ చెప్పేసింది. పైగా, ఒక కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మందికి ఎన్నికల్లో అవకాశం ఇవ్వకూడదన్నది తమ పార్టీ విధానమని తెలిపింది. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం అలాంటి ఇబ్బందులేమీ లేవు. ఒకే కుటుంబం నుంచి ఎంతమందికైనా టికెట్లు ఇస్తారు కాబట్టి.. సిద్ధూకు తమ పార్టీలో అయితే మంచి అవకాశాలు ఉంటాయని అంటున్నారట. అయితే వాళ్లు కూడా ఆయనను ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రిగా ప్రకటించలేం గానీ, రెండు మూడేళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే అమృతసర్ లోక్‌సభ స్థానాన్ని కూడా కావాలంటే సిద్ధూ లేదా ఆయన భార్యకు ఇస్తామని చెప్పారంటున్నారు. ప్రస్తుతం అక్కడ పార్టీ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇంకా ఇది ప్రతిపాదనల దశలోనే ఉందని.. చర్చలకు సిద్ధూ ముందుకు రావాలని చెబుతున్నారు. ఇక ఈ సిక్సర్ల వీరుడు ఎటువైపు మొగ్గుచూపుతాడో చూడాలి. -
క్రికెటర్ భార్యా భర్తలు చెరో దారి!
-
క్రికెటర్ భార్యా భర్తలు చెరో దారి!
వాళ్లిద్దరూ భార్యాభర్తలు. అందులో భర్త ఒకప్పుడు బ్రహ్మాండంగా సిక్సర్లు బాది భారతజట్టుకు విజయాలు అందించిన క్రికెటర్. అలవోకగా ఎడాపెడా బాదేసేవాడు.. తర్వాత తనదైన శైలిలో కామెంట్రీ చెప్పడం ద్వారా ఇటీవలి కాలంలో అందరికీ దగ్గరయ్యాడు. ఆయనే.. నవ్‌జోత్ సింగ్ సిద్ధూ. కమెడియన్ కపిల్ శర్మ నిర్వహించే ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోలో కూడా తనదైన స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు. తాజాగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆయన ఒక్కసారిగా మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. తన భర్త అటు రాజ్యసభ సభ్యత్వంతో పాటు బీజేపీకి కూడా రాజీనామా చేశారని చెబుతున్న సిద్ధూ భార్య నవ్‌జోత్ కౌర్ సిద్ధూ.. తాను మాత్రం బీజేపీని వీడలేదని స్పష్టం చేశారు. తన భర్త పంజాబ్ అభివృద్ధి కోసం కష్టపడాలని అనుకుంటున్నారని ఆమె చెప్పారు. ఆయన నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు తప్ప తాను ఏమీ చెప్పలేనని.. ఆయన ఏం చేసేదీ ఆయననే చెప్పనివ్వాలని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో సిద్ధూ చేరతారా లేదా అనే విషయాన్ని మాత్రం ఆమె నిర్ధారించలేదు. పంజాబ్‌కు సేవ చేయాలన్న స్పష్టత ఆయనకుందని, పంజాబ్ తప్ప మరో ఆప్షన్ ఆయనకు ఏమీ లేదని అన్నారు. అయితే... సిద్ధూతో పాటు ఆయన భార్య కూడా ఆమ్ ఆద్మీ పార్టీలోకి వస్తే తాము సాదరంగా స్వాగతిస్తామని ఆప్ నేత భగవంత్ మాన్ చెప్పారు. ప్రస్తుతం నవ్‌జోత్ కౌర్ సిద్ధూ అమృతసర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకపక్క తాను బీజేపీకి రాజీనామా చేయలేదని చెబుతూనే.. అకాలీదళ్- బీజేపీ సర్కారుపై ఆమె విమర్శలు గుప్పించారు. పంజాబ్ అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, రాష్ట్రానికి ఆమ్ ఆద్మీ పార్టీయే సరైన ప్రత్యామ్నాయమని చెప్పారు. ఎన్నికల్లో పెద్దపెద్ద హామీలిచ్చినా, ఆ మేరకు పెట్టుబడులు ఏమీ రాలేదని అన్నారు.