న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని కలుసుకున్న అనంతరం తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. సిద్ధూ తన రాజీనామా ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
(చదవండి: ‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు)
కాగా, రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో తాను లేవనెత్తిన సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తన విధులను యథావిధిగా తిరిగి కొనసాగిస్తునున్నట్లు పేర్కొన్నారు. చరణ్ జిత్ సింగ్ చన్నీ క్యాబినేట్‌లోని అధికారుల నియమాకాలపై తీవ్ర అసంతృప్తితోపాటు, ఇటీవల చన్నీ కుమారుడి వివాహానికి కూడా సిద్ధూ దూరంగా ఉండటం తదితర పరిణామాలన దృష్ట్య కాంగ్రెస్‌లో అంతర్గత ఉద్రిక్త వాతావరణం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఈ మేరకు "సిద్ధూ కూడా తాన తన పదవికి రాజీనామా చేసిన గానీ ‘తాను గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రీల సిద్ధాంతాలను పాటిస్తాను. తాను కాంగ్రెస్ పార్టీలో పదవి ఉన్నా.. లేకున్నా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన నిలబడతాను వ్యతిరేక శక్తులు నన్ను కిందకు తోయాలని చూసినా అంతకు మించిన ఆశావాదంతో పంజాబ్‌లో ప్రతి పౌరుడి గెలుపు కోసం కృషి చేస్తాను" అంటూ ట్విటర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
(చదవండి: "నా స్టార్ట్‌ప్ బిజినెస్‌కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్")
Comments
Please login to add a commentAdd a comment