Richard Kettleborough Is Umpire For India Vs New Zealand: టీ20 ప్రపంచకప్-2021లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ల్లో టీమిండియాను దగ్గరుండి మరీ ఓడించే అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో మరోసారి తన ప్రతాపాన్ని చూపాడు. కివీస్‌తో మ్యాచ్‌కు ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించిన రిచర్డ్.. కోహ్లి సేనను దగ్గరుండి ఓడించాడు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సమష్టిగా విఫలమై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో పరాజయంపాలైంది.
Richard Kettleborough again? 😭😭 pic.twitter.com/kelnRU7Hg9
— Moon child 🌙 (@notsodumb_) October 31, 2021
దీంతో ఈ ఓటమికి అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోనే కారణమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కెటిల్‌బరో అంపైర్‌గా ఉండటం వల్లే టీమిండియా ఓడిందని ట్రోల్ చేస్తున్నారు. కొందరేమో రిచర్డ్ భారత జట్టు పాలిట శనిలా దాపురించాడని, అతను అంపైరింగ్ చేసిన నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కటి కూడా గెలవలేదని గుర్తు చేస్తున్నారు. కాగా, 2014 నుంచి ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేసిన (భారత్ ఆడినవి) ప్రతి నాకౌట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఆఖరికి రిచర్డ్ టీవీ అంపైర్‌గా ఉన్న మ్యాచ్‌ల్లో సైతం టీమిండియా విజయం సాధించలేకపోయింది.
చదవండి: నాలుగు శతకాలు బాదిన ఆటగాడిని అలా ఎలా ఆడిస్తారు.. కోహ్లిని ఏకి పారేసిన గంభీర్
Comments
Please login to add a commentAdd a comment