
PC: IPL Twitter
డీఆర్‌ఎస్ రూల్ వచ్చాకా ఔట్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. బ్యాటింగ్ జట్టుకు.. బౌలింగ్ జట్టుకు ఔట్‌పై ఏ మాత్రం సందేహం ఉన్నా వెంటనే రివ్యూకు వెళ్లిపోతున్నారు. కానీ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వకున్నా బ్యాట్స్‌మన్ తనంతట తానే క్రీజు విడిచి వెళ్లడం అరుదుగా చూస్తున్నాం. తాజాగా ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో అలాంటిదే చోటుచేసుకుంది.
విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 13వ ఓవర్ సందీప్ శర్మ వేశాడు. ఆ ఓవర్‌లో సందీప్ వేసిన ఒక బంతి డికాక్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్ జితేశ్ చేతిలో పడింది. పంజాబ్ ఆటగాళ్లు ఔట్‌కు అప్పీల్ చేసినప్పటికి ఫీల్డ్ అంపైర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే డికాక్ మాత్రం తాను ఔట్ అంటూ క్రీజు వీడాడు. ఈ నేపథ్యంలో పెవిలియన్ వెళ్తున్న డికాక్ నిజాయితీని సందీప్ శర్మ మెచ్చుకుంటూ అతని భుజాన్ని తట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Venkatesh Iyer: అప్పుడు హీరోలా కనిపించాడు; ఇప్పుడు విలన్.. ఎందుకిలా!
— Vaishnavi Sawant (@VaishnaviS45) April 29, 2022