
photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లలిత్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. బుధవారం సీఎస్‌కేతో మ్యాచ్‌లో అజింక్యా రహానేను కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతిని రహానే స్ట్రెయిట్ షాట్ ఆడగా.. బంతి వేగంగా వెళ్లడంతో క్యాచ్ మిస్ అవుతుందని అనుకున్నాం.
కానీ లలిత్ యాదవ్ అద్బుతం చేశాడు. ఒకవైపుగా డైవ్‌చేస్తూ కుడిచేత్తో కేవలం వేళ్ల సాయంతోనే అద్బుతంగా అందుకున్నాడు. అయితే ఇక్కడ లలిత్ యాదవ్ దూబేను రనౌట్ చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ రహానే క్యాచ్ అందుకున్న లలిత్ ఆ పని చేయలేకపోయాడు.
అయితే లలిత్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌కు రహానే షాక్ తినగా.. అంపైర్ క్రిస్ గఫానీ మాత్రం ఇంప్రెస్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
What a Catch by Lalit Yadav 🤯🤯#LalitYadav #CSKvDC pic.twitter.com/WJP6GyPXtl
— Cricket Apna l Indian cricket l Bleed Blue 💙🇮🇳 (@cricketapna1) May 10, 2023