SRH vs MI: Nitin Menon Takes Review, Never Before In IPL History - Sakshi
Sakshi News home page

#NitinMenon: ఇది విన్నారా.. ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారి!

Published Wed, Apr 19 2023 6:52 PM | Last Updated on Wed, Apr 19 2023 7:41 PM

Nitin Menon Takes Umpire Review Never Before-IPL History SRH Vs MI - Sakshi

Photo: IPL Twitter

క్రికెట్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ పనేంటని అడిగితే ఎవరైనా సమాధానం చెప్పగలరు. బ్యాటర్లు కొట్టే బౌండరీలు, సిక్సర్లకు సిగ్నల్స్‌ ఇవ్వడం.. బౌలర్లకు ఆదేశాలు ఇవ్వడం.. రనౌట్లు, నోబ్‌లు, వైడ్‌లు, లెగ్‌బైలు ఇలా చెప్పుకుంటూ పోతే మ్యాచ్‌లో ఆటగాళ్ల కన్నా అంపైర్‌కే ఎక్కువ పని ఉంటుంది. అనుక్షణం ఏకాగ్రతతో ఉంటూ మ్యాచ్‌లో కీలకంగా వ్యవహరించడం అతని పాత్ర.

ఒకప్పుడు ఫీల్డ్‌ అంపైర్‌ ఏది చెబితే అదే శాసనం. ఇప్పుడంటే డీఆర్‌ఎస్‌ల రూపంలో అంపైర్ల నిర్ణయాన్ని చాలెంజ్‌ చేయొచ్చు. కానీ ఒకప్పుడు బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌.. రనౌట్‌ ఈ రెండు అంశాల్లో తప్ప అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడంటే బ్యాటర్‌ మాట మాట్లాడకుండా పెవిలియన్‌కు వెళ్లాల్సిందే.

అయితే ఇప్పుడు డీఆర్‌ఎస్‌లు అంపైర్లను కన్ఫూజన్‌కు గురిచేస్తున్నాయి. బంతి బంతికి డీఆర్‌ఎస్‌ కోరే అవకాశం ఉండడంతో వైడ్‌ బాల్స్‌ను కూడా సందేహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం ఎస్‌ఆర్‌హెచ్‌, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో అర్జున్‌ వేసిన నాలుగో బంతి త్రిపాఠి పక్క నుంచి లెగ్‌స్టంప్‌ అవతల నుంచి వెళ్లింది. అయితే అర్జున్‌ టెండూల్కర్‌తో పాటు కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ క్యాచ్‌ఔట్‌ అంటూ అ‍ప్పీల్‌ చేశారు. కానీ అంపైర్‌ వైడ్‌ ఇచ్చాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా రివ్యూ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అర్జున్‌, ఇషాన్‌లు సైలెంట్‌ అయిపోయారు. 

కానీ ఇక్కడే అసలు కథ ప్రారంభమయింది. ఏమైందో తెలియదు కానీ నితిన్‌ మీనన్‌ తొలిసారి అంపైర్‌ రివ్యూను ఉపయోగించాడు. అసలు అది వైడ్‌ బాల్‌ అవునా కాదా అనే డౌట్‌తో రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో అది క్లియర్‌ వైడ్‌ అని తెలిసింది. అంపైర్‌గా ఇన్నేళ్ల అనుభవం ఉండి కూడా నితిన్‌ మీనన్‌ రివ్యూ వెళ్లడం  క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఆసక్తి కలిగించింది. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద ఉంటేనే ఈ రివ్యూను అంపైర్‌ ఉపయోగిస్తారు. ఐపీఎల్‌లో ఇంతవరకు ఈ రివ్యూ ఏ అంపైర్‌ వాడుకోలేదు. ఒక రకంగా ఐపీఎల్‌ చరిత్రలో ఒక అంపైర్‌ డీఆర్‌ఎస్‌ కోరడం ఇదే తొలిసారి.

అయితే ఒక వైడ్ బాల్ విషయంలో అయోమయానికి గురవ్వడం ఏంటో.. దీనికోసం థర్డ్ అంపైర్ వరకు వెళ్లడమేంటో అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అలాగే రివ్యూ కోరుకోవాల్సింది ఆటగాళ్లని.. అంపైర్లు కాదని కొందరు విమర్శించారు.

చదవండి: పిచ్చి ప్రవర్తన.. హీరో కాస్త విలన్‌ అయిపోతున్నాడు!

'ఎగతాళి చేసినోళ్లే మెచ్చుకుంటున్నారు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement