పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డేలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గ్రౌండ్‌లో 30 యార్డ్ సర్కిల్ దూరం ఎక్కువగా ఉన్నట్లు అంపైర్లు గుర్తించి సరిచేయడం ఆసక్తిగా మారింది. వాస్తవానికి మ్యాచ్ ప్రారంభానికి ముందే గ్రౌండ్స్‌మెన్ కొలతలతో 30-యార్డ్ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలి.
అయితే కొలతలు తప్పుగా తీసుకోవడం వల్ల 30-యార్డ్ సర్కిల్ అసలు దానికంటే కాస్త దూరంగా పెట్టారు. పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా తొలి ఓవర్‌లో నాలుగు బంతులు వేసిన తర్వాత ఫీల్డ్ అంపైర్లు అలీమ్ దార్, రషీద్ రియాజ్‌లు తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మ్యాచ్‌ను హాల్డ్ చేసి గ్రౌండ్స్‌మెన్‌ను పిలిచి 30-యార్డ్ సర్కిల్‌ను సరిచేశారు.
గ్రౌండ్స్‌మెన్‌తో పాటు పాక్ ఆటగాళ్లు కూడా సర్కిల్‌ను సరిచేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ట్రోల్ చేశారు. పీసీబీ ఘనకార్యం.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. 30 యార్డ్ సర్కిల్‌ను సరిగ్గా సెట్ చేయలేకపోయారు.. ఇక ఆసియాకప్‌ను హోస్ట్ చేస్తారంటా.. అంటూ కామెంట్ చేశారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) April 29, 2023
Comments
Please login to add a commentAdd a comment