పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇన్నింగ్స్ 21వ ఓవర్ మహ్మద్ నవాజ్ వేశాడు. ఓవర్ తొలి బంతిని డారిల్ మిచెల్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. బంతిని ఆపే ప్రయత్నంలో నవాజ్ చేతి వేలికి తగిలింది.
బంతి వేగంగా రావడంతో అతని చూపుడు వేలు విరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నొప్పితో విలవిల్లాడిపోయిన నవాజ్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి వేలిని పరిశీలించగా.. బోన్ బ్రేక్ అయినట్లు గుర్తించాడు. దీంతో నవాజ్‌ను సిబ్బంది ఆసుపత్రికి తరలించి ఎక్స్-రే తీయించారు. కాగా రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది.
గాయం తీవ్రత ఎంతనేది తెలియకపోయినప్పటికి వేలు విరిగితే మాత్రం అతని కెరీర్ ప్రమాదంలో పడినట్లే. సర్జరీ జరిగినప్పటికి చూపుడు వేలు గ్రిప్ కోల్పోయే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో మహ్మద్ నవాజ్ బౌలింగ్ వేసే చాన్స్ తక్కువగానే ఉంటుంది. కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ వరుసగా మూడో వన్డేలోనూ విజయం సాధించి మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. పాకిస్తాన్‌కు 2011 తర్వాత న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ గెలవడం మళ్లీ ఇదే. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ 90, బాబర్ ఆజం 54 పరుగులతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ 49.1 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్ కావడంతో పాక్ 26 పరుగులతో విజయాన్ని అందుకుంది. టామ్ బ్లండల్ 65, కొల్ మెక్‌నికొంచి 64, టామ్ లాథమ్ 45 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ వసీమ్‌లు తలా రెండు వికెట్లు తీశారు.
Yaar ye kya hogya 😭
— 𝘽𝙖𝙗𝙖𝙧 ⁵⁶ × 𝘼𝙞𝙢𝙖𝙡 ¹¹ ⚡ (@Aymalkhan_112) May 3, 2023
The main finger of M Nawaz has been broken yaar ☹️🥺💔
Plzz remember him in ur prayers to comeback as quick as possible 🙏🤲❤️#BabarAzam𓃵 #NaseemShah #PAKvNZ #muhammadNawaz @Awaisii6 pic.twitter.com/NPOors4m0i
Comments
Please login to add a commentAdd a comment