పుణే: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో విజయం సాధించి జోష్‌లో ఉన్న టీమిండియాకు షాక్ తగిలింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో శ్రెయాస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. బంతిని ఆపే క్రమంలో శ్రేయస్ అయ్యర్ భుజానికి బలంగా దెబ్బ తగిలింది. వెంటనే మైదానం వీడిన అతడిని స్కానింగ్ కోసం పంపించారు.గాయం తీవ్రత దృష్ట్యా అయ్యర్ తదుపరి మ్యాచ్‌ల్లో అతను బరిలోకి దిగే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలిసింది.
అయితే అయ్యర్ గాయం తీవ్రతపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. మిగిలిన వన్డేలకు ఒకవేళ అయ్యర్ దూరమైతే మాత్రం సూర్యకుమార్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అంతకముందు టీమిండియా బ్యాటింగ్ సమయంలో వుడ్ వేసిన బంతి రోహిత్ కుడి మోచేతికి బలంగా తాకింది. నొప్పికి రెండుసార్లు మైదానంలోనే చికిత్స చేయించుకొని ఆట కొనసాగించిన అతను ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. అయితే రోహిత్ గాయం పెద్దది కాకపోవడంతో అతను రెండో వన్డే ఆడే అవకాశాలు ఎక్కువగా ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఫీల్డింగ్‌లో గాయపడిన ఇంగ్లండ్ కెపె్టన్ మోర్గాన్ కూడా చేతికి నాలుగు కుట్లతో బ్యాటింగ్‌కు దిగాడు.
చదవండి:
'నో చాన్స్.. బుమ్రా ఆ అవకాశం ఇవ్వడు'
వైరల్: విచిత్రరీతిలో బ్యాట్స్‌మన్ రనౌట్
Comments
Please login to add a commentAdd a comment