గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయాన్ని అందుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. కివీస్‌పై విజయం పాక్‌కు వన్డేల్లో 500వది కావడం విశేషం. వన్డే క్రికెట్‌లో 500 విజయాలు నమోదు చేసిన మూడో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది.
ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, భారత్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటివరకు 978 మ్యాచ్‌లు ఆడి 594 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా ఇప్పటివరకు మొత్తం 1029 మ్యాచ్‌లు ఆడి 539 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుంది.
తాజాగా కివీస్‌పై విజయంతో పాక్ 949వ మ్యాచ్‌లో 500వ విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వెస్టిండీస్ 411, దక్షిణాఫ్రికా 399, శ్రీలంక 399, ఇంగ్లండ్ 392, న్యూజిలాండ్ 368, బంగ్లాదేశ్ 149, జింబాబ్వే 147 విజయాలతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.ఇక 1973లో మొదటి వన్డే మ్యాచ్ ఆడిన పాకిస్తాన్.. 1974 ఆగస్టులో నాటింగ్‌హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలి వన్డే విజయాన్ని అందుకుంది. 1992లో వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన పాకిస్తాన్.. ఆ తర్వాత 1999లో ఫైనల్ మెట్టుపై బోల్తా పడింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే రావల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. 289 లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్(117) సెంచరీతో చెలరేగగా.. ఇమామ్ ఉల్ హాక్(60) పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(86), డార్లీ మిచెల్(113) పరుగులలో రాణించారు.
చదవండి: సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్.. న్యూజిలాండ్‌పై పాక్ ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment