Mohammad Nawaz
-
అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే!
ICC WC 2023- South Africa Beat Pakistan By 1 Wicket: ‘‘మ్యాచ్ సాగుతూ.. ఉంది. ఎనిమిది వికెట్లు పడ్డాయి.. ఆ తర్వాత తొమ్మిదో వికెట్ కూడా తీశారు. అయినా.. గెలుపు కోసం అంతలా తంటాలు.. అసలు ఇదేం కెప్టెన్సీ? అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమైందా? టెయిలెండర్లకు సింగిల్స్ తీసే అవకాశం ఇచ్చావు. నీ ఆలోచన ఏంటో అర్థం కాలేదు. ఇందుకు మీరు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని అందరికీ అర్థమైపోయింది. ఇంకా ఓవర్లు మిగిలే ఉన్నాయి కదా.. ప్రధాన బౌలర్ల కోటా పూర్తయ్యేటప్పటికే మ్యాచ్ ముగించాల్సింది. ఆఖర్లో మీకు మిగిలిన ఆప్షన్లు స్పిన్ బౌలర్లు మాత్రమే. ఇదంతా తెలిసి కూడా లోయర్ ఆర్డర్ బ్యాటర్లను సింగిల్స్‌కు అనుమతించేలా ఫీల్డింగ్ సెట్ చేశావంటే నిన్ను ఏమనుకోవాలి? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు బాబర్? నలుగురైదుగురు సర్కిల్ లోపల.. మిగిలిన వాళ్లు బౌండరీ వద్ద.. ఇలా ఫీల్డ్ సెట్ చేసి నువ్వేం సాధించావు? ఒకవేళ సౌతాఫ్రికా ఆటగాళ్లను చివరి ఓవర్ వరకు తీసుకొచ్చి మ్యాచ్‌ను కాపాడుకుందామని భావించావా? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు బాబర్? నీ కెప్టెన్సీ నాకైతే అంతుపట్టలేదు. ప్రధాన బౌలర్లు బరిలోకి దిగినపుడు స్లిప్ పెట్టాలి.. సర్కిల్ లోపల ఎక్స్ట్రా ఫీల్డర్లను సెట్ చేయాలి అని తెలియదా?’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కెప్టెన్సీపై మండిపడ్డాడు. చెత్త కెప్టెన్సీ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సారథిగా బాబర్ పూర్తిగా విఫలమయ్యాడంటూ విమర్శలు గుప్పించాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓటమిని ఆహ్వానించావంటూ బాబర్ తీరును తప్పుబట్టాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతులెత్తేసిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ మైదానంలో తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాక్‌పై సౌతాఫ్రికా ఒక్క వికెట్ తేడాతో గట్టెక్కి టేబుల్ టాపర్‌గా నిలిచింది. మరోవైపు.. బాబర్ ఆజం బృందం సెమీ ఫైనల్ అవకాశాలు పూర్తి సంక్లిష్టంగా మారాయి. నీ వల్లే ఓటమి! ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. సౌతాఫ్రికా- పాకిస్తాన్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. హైడ్రామా నెలకొన్న మ్యాచ్‌లో టెయిలెండర్లను కూడా కట్టడి చేయలేక చతికలపడ్డ పాకిస్తాన్ ఓటమికి బాబర్ కెప్టెన్సీనే ప్రధాన కారణమని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. అతడి రాతే అంత ఈ సందర్భంగా పాకిస్తాన్ స్పిన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నవాజ్ రాతే అంత. దుబాయ్ గ్రౌండ్లో హార్దిక్ పాండ్యా.. మెల్బోర్న్లో రవిచంద్రన్ అశ్విన్.. ఇప్పుడు ఇక్కడ చెన్నై గ్రౌండ్లో కేశవ్ మహరాజ్.. అతడి బౌలింగ్‌లో అద్భుతం చేశారు. పాపం ప్రతిసారి నవాజ్ ఎందుకో ఇలా కఠిన పరిస్థితుల్లో చిక్కుకుపోతాడు’’ అంటూ ఆకాశ్ చోప్రా సానుభూతి వ్యక్తం చేశాడు. కాగా సౌతాఫ్రికా విజయలక్ష్యానికి ఐదు పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఉసామా మిర్, మహ్మద్ నవాజ్లలో ఒకరిని బరిలోకి దింపాల్సి రాగా బాబర్ ఆజం నవాజ్ వైపు మొగ్గు చూపాడు. ఊహించని షాకిచ్చిన కేశవ్ మహరాజ్ అప్పటికి పేసర్ల కోటా పూర్తవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. అయితే, 48 ఓవర్లో నవాజ్ బౌలింగ్‌లో మొదటి బంతికి తబ్రేజ్ షంసీ సింగిల్ తీసి కేశవ్ మహరాజ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. అంతే.. రెండో బంతిని ఫోర్‌గా మలిచిన కేశవ్ ఊహించని రీతిలో సౌతాఫ్రికాను గెలుపుతీరాలకు చేర్చాడు. పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నవాజ్ మరోసారి బలిపశువు అయ్యాడు. చదవండి: ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా? View this post on Instagram A post shared by ICC (@icc) -
తీవ్ర గాయం.. ప్రమాదంలో పాక్ క్రికెటర్ భవితవ్యం!
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇన్నింగ్స్ 21వ ఓవర్ మహ్మద్ నవాజ్ వేశాడు. ఓవర్ తొలి బంతిని డారిల్ మిచెల్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. బంతిని ఆపే ప్రయత్నంలో నవాజ్ చేతి వేలికి తగిలింది. బంతి వేగంగా రావడంతో అతని చూపుడు వేలు విరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నొప్పితో విలవిల్లాడిపోయిన నవాజ్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి వేలిని పరిశీలించగా.. బోన్ బ్రేక్ అయినట్లు గుర్తించాడు. దీంతో నవాజ్‌ను సిబ్బంది ఆసుపత్రికి తరలించి ఎక్స్-రే తీయించారు. కాగా రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. గాయం తీవ్రత ఎంతనేది తెలియకపోయినప్పటికి వేలు విరిగితే మాత్రం అతని కెరీర్ ప్రమాదంలో పడినట్లే. సర్జరీ జరిగినప్పటికి చూపుడు వేలు గ్రిప్ కోల్పోయే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో మహ్మద్ నవాజ్ బౌలింగ్ వేసే చాన్స్ తక్కువగానే ఉంటుంది. కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ వరుసగా మూడో వన్డేలోనూ విజయం సాధించి మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. పాకిస్తాన్‌కు 2011 తర్వాత న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ గెలవడం మళ్లీ ఇదే. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ 90, బాబర్ ఆజం 54 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ 49.1 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్ కావడంతో పాక్ 26 పరుగులతో విజయాన్ని అందుకుంది. టామ్ బ్లండల్ 65, కొల్ మెక్నికొంచి 64, టామ్ లాథమ్ 45 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ వసీమ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. Yaar ye kya hogya 😭 The main finger of M Nawaz has been broken yaar ☹️🥺💔 Plzz remember him in ur prayers to comeback as quick as possible 🙏🤲❤️#BabarAzam𓃵 #NaseemShah #PAKvNZ #muhammadNawaz @Awaisii6 pic.twitter.com/NPOors4m0i — 𝘽𝙖𝙗𝙖𝙧 ⁵⁶ × 𝘼𝙞𝙢𝙖𝙡 ¹¹ ⚡ (@Aymalkhan_112) May 3, 2023 చదవండి: ఐపీఎల్లో 16 సీజన్లు ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా? -
మహ్మద్ నవాజ్ రనౌటా లేక ఎల్బీనా?
టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్ మహ్మద్ నవాజ్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఆఖరి బంతికి నవాజ్ ప్యాడ్లను తాకుతూ ఇన్సైడ్ ఎడ్జ్ అయింది. సౌతాఫ్రికా ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. కానీ నవాజ్ ఎలాంటి రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అయితే రిప్లేలో మాత్రం బంతి ముందు బ్యాట్‌ను తాకినట్లు స్పైక్స్ కనిపించాయి. ఒకవేళ నవాజ్ రివ్యూకు వెళ్లి ఉంటే నాటౌట్ అయ్యేవాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ జరిగింది. అంపైర్ ఔట్ ఇచ్చేసరికే మహ్మద్ నవాజ్ క్రీజు బయట ఉన్నాడు. అప్పుడే బంతిని అందుకున్న ఫీల్డర్ డైరెక్ట్ త్రోతో వికెట్లను గిరాటేశాడు. అప్పటికి నవాజ్ క్రీజులోకి చేరుకోలేదు. అయితే నవాజ్ పెవిలియన్ బాట పట్టింది రనౌట్ అయినందుకా లేక ఎల్బీగానా అన్నది ఎవరికి అర్థం కాలేదు. ఒకవేళ నవాజ్ రివ్యూ తీసుకొని ఫలితం అనుకూలంగా వచ్చినా రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చేది. కానీ క్రికెట్ రూల్స్ ప్రకారం అంపైర్ ఒకసారి తన వేలిని పైకెత్తిన తర్వాత బంతిని డెడ్‌బాల్‌గా పరిగణిస్తారు. ఈ దశలో రనౌట్ చేసినా పనికిరాదు. మొత్తానికి తాను ఎలా ఔటయ్యాననే దానిపై క్లారిటీ లేకుండానే మహ్మద్ నవాజ్ పెవిలియన్ చేరడం ఆసక్తి కలిగించింది. ఇక పాకిస్తాన్‌కు సెమీస్ ఆశలు నిలవాలంటే కచ్చితంగా సౌతాఫ్రికాపై నెగ్గాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇప్తికర్ అహ్మద్ 51, షాదాబ్ ఖాన్ 52 అర్థసెంచరీలతో చెలరేగగా.. మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్‌లు తలా 28 పరుగులు చేశారు. pic.twitter.com/8lZ6zc7Qr9 — Guess Karo (@KuchNahiUkhada) November 3, 2022 చదవండి: పదే పదే మైదానంలోకి.. టీమిండియాతో ఉన్న సంబంధం? -
ఆ బంతి తిరిగి ఉంటే రిటైర్మెంట్ ఇచ్చేవాడిని!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా గత ఆదివారం పాకిస్తాన్‌పై విజయంలో కోహ్లిదే కీలకపాత్ర అనేది నగ్నసత్యం. అయితే కోహ్లితో పాటు అశ్విన్‌కు కూడా విజయంలో క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆఖరి ఓవర్లో మహ్మద్ నవాజ్ వేసిన బంతిని వైడ్‌గా భావించి అశ్విన్ వదిలేశాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. అయితే కోహ్లి మ్యాజిక్‌లో అశ్విన్ తెలివిని ఎవరు గుర్తించలేకపోయారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత అశ్విన్ చేసిన పనిని అందరూ మెచ్చుకున్నారు. స్వయంగా కోహ్లినే అశ్విన్‌ను.. సరైన సమయంలో మెదుడు చురుకుగా పనిచేసింది అంటూ పొగడడం విశేషం.తాజాగా బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో పాక్‌తో మ్యాచ్ అనంతరం తన సహచరుల నుంచి ఎదురైన ప్రశ్నను పంచుకున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నవాజ్ వేసిన బంతి వైడ్ కాకుండా తిరిగి ఉంటే ఏమయ్యేది అని అడిగారు. వాళ్లు అడిగిన ప్రశ్నకు నా శైలిలో సమాధానం ఇచ్చాను. ''ఈ మ్యాచ్ లో నేను బ్యాటింగ్ కు వెళ్లేప్పుడు బ్లాంక్ మైండ్ తో గ్రౌండ్ లోకి అడుగుపెట్టాను. బౌలర్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడని కోహ్లీని అడిగాను. అప్పుడు కోహ్లీ నా ఫేవరేట్ షాట్ కొట్టు పర్లేదు అని చెప్పాడు. అయితే మ్యాచ్ గెలిచాం కాబట్టి సరిపోయింది గానీ ఒకవేళ నవాజ్ వేసిన ఆ బంతి వైడ్ గా కాకుండా టర్న్ అయి ప్యాడ్ కు తాకడమో లేక పరుగులు రాకపోవడమో అయితే నువ్వు ఏం చేసేవాడివని అడిగారు. నేను వారితో.. ఏం లేదు. వెంటనే అక్కడ్నుంచి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయి నా ఫోన్ లో ట్విటర్ ఓపెన్ చేసి.. ''ఇన్నాళ్లు నన్ను ఆదరించిన అభిమానులకు, బీసీసీఐకి ధన్యవాదాలు.. ఈ ప్రయాణం చాలా గొప్పది.. ఇక గుడ్ బై'' అని చెప్పి రిటైర్మెంట్ ప్రకటించేవాడిని..'' అని పేర్కొన్నా'' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. A golden rewind - When two heroes of two engrossing finishes get together to dissect their famous victories👌 Here's @hrishikanitkar & @ashwinravi99 talking about the two #INDvPAK games 👍 - by @RajalArora Click 👉https://t.co/fDy4r9U2cH to watch the full interview 😃 — BCCI (@BCCI) October 26, 2022 చదవండి: నెదర్లాండ్స్‌పై గెలుపు.. 'సంతోషంగా మాత్రం లేను' క్రికెట్ ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు -
Ind Vs Pak: పాక్‌కు ఊహించని షాక్.. కీలక బ్యాటర్ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు
T20 World Cup 2022- India Vs Pakistan: టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా పాక్ బ్యాటర్ షాన్ మసూద్ తలకు గాయమైంది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని జర్నలిస్టు బోరియా మజుందార్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా శనివారం (అక్టోబరు 23) పాక్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రోహిత్ సేనతో మెల్బోర్న్ క్రికెట్ వేదికగా తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మెల్బోర్న్ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీసు మొదలుపెట్టాయి. నవాజ్ షాట్ ఆడగా.. ఈ క్రమంలో పాక్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ షాట్ ఆడగా.. బంతి మసూద్ తలకు తగలగా గ్రౌండ్లో కుప్పకూలినట్లు సమాచారం. దెబ్బ గట్టిగా తగలడంతో సుమారు ఐదు నిమిషాల పాటు అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది షాన్ మసూద్‌ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా పాక్ వన్‌డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగే ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇప్పటి వరకు 12 టీ20 మ్యాచ్‌లు ఆడి 221 పరుగులు చేశాడు. ఇటీవల న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో ట్రై సిరీస్ నేపథ్యంలోనూ జట్టుతో ఉన్నాడు. అయితే, కీలక మ్యాచ్‌కు ముందు గాయపడ్డ అతడు.. టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దాయాదితో పోరుకు సిద్ధమవుతున్న వేళ టాపార్డర్ బ్యాటర్ గాయపడటంతో పాక్ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. చదవండి: T20 World Cup 2022: 'రిజ్వాన్, కోహ్లి, సూర్య కాదు.. అతడే ప్రపంచకప్ టాప్ రన్ స్కోరర్' T20 WC 2022- Ind Vs Pak: ‘అలా అయితే అక్టోబరు 23న ఇండియాతో పాక్ మ్యాచ్ ఆడదు’ Update: Pakistani Batter Shan Masood has been taken to the hospital. Doctors will examine him and then further steps will be taken. Mohd. Nawaz’s shot hit Masood on the head for this unfortunate injury. He was lying down on the ground for 5-7 mints. Wish him a speedy recovery. — Boria Majumdar (@BoriaMajumdar) October 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సంయుక్తంగా రాణించిన బ్యాటర్లు.. పాకిస్తాన్‌దే ట్రై సిరీస్
న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో జరిగిన ముక్కోణపు టి20 టోర్నీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌కు ఈ విజయం మంచి ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రై సిరీస్‌కు ముందు ఆసియా కప్ ఫైనల్.. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ల్లో పాకిస్తాన్ ఓటమిపాలయింది. ఇక శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. పాక్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (29 బంతుల్లో 34 పరుగులు), మహ్మద్ నవాజ్(22 బంతుల్లో 38 పరుగులు), హైదర్ అలీ(15 బంతుల్లో 31 పరుగులు).. చివర్లో ఇప్తికర్ అహ్మద్(14 బంతుల్లో 25 నాటౌట్) సంయుక్తంగా రాణించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గ్లెన్ పిలిప్స్ 29, మార్క్ చాప్మన్ 25 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హారిస్ రౌఫ్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్, నవాజ్‌లు చెరొక వికెట్ తీశారు. రేపు(శనివారం) ఆస్ట్రేలియాకు బయలుదేరనున్న పాకిస్తాన్ జట్టు టి20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్ 23న(ఆదివారం)తమ తొలి మ్యాచ్ ఆడనుంది. Nawaz and Iftikhar finish it for Pakistan in the final over 🏆#NZvPAK — ESPNcricinfo (@ESPNcricinfo) October 14, 2022 చదవండి: జర్నలిస్ట్ తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్ -
వెస్టిండీస్‌పై పాకిస్తాన్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
ఐసీసీ వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. పాక్ విజయంలో ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజాం,మహ్మద్ నవాజ్ కీలక పాత్ర పోషించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఇమామ్-ఉల్-హక్(72),బాబర్ అజాం(77) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో అకేల్ హోసేన్ మూడు, ఫిలిప్, జోషఫ్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 155 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో షమర్ బ్రూక్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మహ్మద్ వసీం మూడు, షదాబ్ ఖాన్ రెండు, షాహిన్ ఆఫ్రిది ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ సిరీస్‌లో అఖరి వన్డే ఆదివారం జరగనుంది. చదవండి: T20 WC 2022: 'అతడు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ అవుతాడు' One jaffa after another! 🌟 Superstar @mnawaz94 registers his career-best figures of 𝟭𝟬-𝟬-𝟭𝟵-𝟰 🙌#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/jf8Eg05fwO — Pakistan Cricket (@TheRealPCB) June 10, 2022 -
పాక్ క్రికెటర్‌పై నిషేధం
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన 23ఏళ్ల ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్‌పై ఆదేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) రెండు నెలలపాటు నిషేధం విధించింది. ఈ నిర్ణయం తక్షణం అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని పేర్కొంది. ఇటీవల పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన చేసిన సమయంలో అక్కడ బుకీలు నవాజ్‌ను సంప్రదించారు. దీని గురించి బోర్డుకు తను ఆలస్యంగా తెలియజేశాడు. ఇదే విషయాన్ని జాతీయ అవినీతి నిరోధక విభాగం ముందు అతడు ఒప్పుకున్న క్రమంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాక రూ.2 లక్షల జరిమానాను కూడా విధించింది. సస్పెన్షన్ కాలంలో అతడు బోర్డుతో కుదుర్చుకున్న సెంట్రల్ కాంట్రాక్టుపై కూడా నిషేధం అమలులో ఉంటుందని పీసీబీ పేర్కొంది. గతంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఆదేశ క్రికెటర్లు నాసిర్ జంషేడ్, షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ నిషేధానికి గురైన విషయం తెలిసిందే. -
స్పాట్ ఫిక్సింగ్: క్రికెటర్‌పై నిషేధం
కరాచీ: స్పాట్ ఫిక్సింగ్ జాడ్యం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)కు పాకింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వేటు వేసింది. అతడు క్రికెట్ ఆడకుండా రెండు నెలల పాటు నిషేధం విధించింది. లక్ష రూపాయల జరిమానా వేసింది. నవాజ్‌పై విధించిన నిషేధం మే 16 నుంచి అమల్లోకి వస్తుందని పీసీబీ ప్రకటించింది. 23 ఏళ్ల నవాజ్ పీఎస్ఎల్లో స్పాట్ ఫిక్సింగ్ చేసేందుకు తనను సంప్రదించిన బుకీల వివరాలు పీసీబీ విజిలెన్స్ అండ్ సెక్యురిటీ విభాగంకు అందించడంలో విఫలమయ్యాడు. దీంతో పీసీబీ అతడిపై చర్య తీసుకుంది. పీసీబీ నిర్దేశించిన విధంగా లిఖితపూర్వక వివరణయిస్తే నవాజ్‌పై నిషేధం నెల రోజులకు తగ్గించే అవకాశముంది. ఫిబ్రవరి-మార్చిలో జరిగిన రెండో పీఎస్ఎల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు నవాజ్‌తో పాటు ఏడుగురు ఆటగాళ్లపై ఆరోపణలు వచ్చాయి. మహ్మద్ ఇర్ఫాన్‌పై పీసీబీ ఏడాది పాటు నిషేధం విధించింది. మూడు టెస్టులు, 9 వన్డేలు ఆడిన నవాజ్... పీఎస్ఎల్లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.