న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన 23ఏళ్ల ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్‌పై ఆదేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) రెండు నెలలపాటు నిషేధం విధించింది. ఈ నిర్ణయం తక్షణం అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని పేర్కొంది. ఇటీవల పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన చేసిన సమయంలో అక్కడ బుకీలు నవాజ్‌ను సంప్రదించారు. దీని గురించి బోర్డుకు తను ఆలస్యంగా తెలియజేశాడు. ఇదే విషయాన్ని జాతీయ అవినీతి నిరోధక విభాగం ముందు అతడు ఒప్పుకున్న క్రమంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
అంతేగాక రూ.2 లక్షల జరిమానాను కూడా విధించింది. సస్పెన్షన్ కాలంలో అతడు బోర్డుతో కుదుర్చుకున్న సెంట్రల్ కాంట్రాక్టుపై కూడా నిషేధం అమలులో ఉంటుందని పీసీబీ పేర్కొంది. గతంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఆదేశ క్రికెటర్లు నాసిర్ జంషేడ్, షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ నిషేధానికి గురైన విషయం తెలిసిందే.
పాక్ క్రికెటర్‌పై నిషేధం
Published Thu, May 18 2017 1:27 AM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM
Advertisement
Advertisement