స్పాట్ ఫిక్సింగ్: క్రికెటర్‌పై నిషేధం
కరాచీ: స్పాట్ ఫిక్సింగ్ జాడ్యం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)కు పాకింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వేటు వేసింది. అతడు క్రికెట్ ఆడకుండా రెండు నెలల పాటు నిషేధం విధించింది. లక్ష రూపాయల జరిమానా వేసింది. నవాజ్‌పై విధించిన నిషేధం మే 16 నుంచి అమల్లోకి వస్తుందని పీసీబీ ప్రకటించింది.
23 ఏళ్ల నవాజ్ పీఎస్‌ఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ చేసేందుకు తనను సంప్రదించిన బుకీల వివరాలు పీసీబీ విజిలెన్స్ అండ్ సెక్యురిటీ విభాగంకు అందించడంలో విఫలమయ్యాడు. దీంతో పీసీబీ అతడిపై చర్య తీసుకుంది. పీసీబీ నిర్దేశించిన విధంగా లిఖితపూర్వక వివరణయిస్తే నవాజ్‌పై నిషేధం నెల రోజులకు తగ్గించే అవకాశముంది.
ఫిబ్రవరి-మార్చిలో జరిగిన రెండో పీఎస్‌ఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు నవాజ్‌తో పాటు ఏడుగురు ఆటగాళ్లపై ఆరోపణలు వచ్చాయి. మహ్మద్ ఇర్ఫాన్‌పై పీసీబీ ఏడాది పాటు నిషేధం విధించింది. మూడు టెస్టులు, 9 వన్డేలు ఆడిన నవాజ్... పీఎస్‌ఎల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.