ఐసీసీ వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. పాక్ విజయంలో ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజాం,మహ్మద్ నవాజ్ కీలక పాత్ర పోషించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఇమామ్-ఉల్-హక్(72),బాబర్ అజాం(77) పరుగులతో రాణించారు.
విండీస్ బౌలర్లలో అకేల్ హోసేన్ మూడు, ఫిలిప్, జోషఫ్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 155 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో షమర్ బ్రూక్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మహ్మద్ వసీం మూడు, షదాబ్ ఖాన్ రెండు, షాహిన్ ఆఫ్రిది ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ సిరీస్‌లో అఖరి వన్డే ఆదివారం జరగనుంది.
చదవండి: T20 WC 2022: 'అతడు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ అవుతాడు'
One jaffa after another! 🌟
— Pakistan Cricket (@TheRealPCB) June 10, 2022
Superstar @mnawaz94 registers his career-best figures of 𝟭𝟬-𝟬-𝟭𝟵-𝟰 🙌#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/jf8Eg05fwO
Comments
Please login to add a commentAdd a comment