పాక్ ప్రాక్టీస్ సెషన్‌లో ఆటగాడికి గాయం (PC: Twitter)
T20 World Cup 2022- India Vs Pakistan: టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా పాక్ బ్యాటర్ షాన్ మసూద్ తలకు గాయమైంది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని జర్నలిస్టు బోరియా మజుందార్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
కాగా టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా శనివారం (అక్టోబరు 23) పాక్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రోహిత్ సేనతో మెల్‌బోర్న్ క్రికెట్ వేదికగా తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మెల్‌బోర్న్ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీసు మొదలుపెట్టాయి.
నవాజ్ షాట్ ఆడగా..
ఈ క్రమంలో పాక్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ షాట్ ఆడగా.. బంతి మసూద్ తలకు తగలగా గ్రౌండ్‌లో కుప్పకూలినట్లు సమాచారం. దెబ్బ గట్టిగా తగలడంతో సుమారు ఐదు నిమిషాల పాటు అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది షాన్ మసూద్‌ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
కాగా పాక్ వన్‌డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగే ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇప్పటి వరకు 12 టీ20 మ్యాచ్‌లు ఆడి 221 పరుగులు చేశాడు. ఇటీవల న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో ట్రై సిరీస్ నేపథ్యంలోనూ జట్టుతో ఉన్నాడు. అయితే, కీలక మ్యాచ్‌కు ముందు గాయపడ్డ అతడు.. టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దాయాదితో పోరుకు సిద్ధమవుతున్న వేళ టాపార్డర్ బ్యాటర్ గాయపడటంతో పాక్ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
చదవండి: T20 World Cup 2022: 'రిజ్వాన్, కోహ్లి, సూర్య కాదు.. అతడే ప్రపంచకప్ టాప్ రన్ స్కోరర్'
T20 WC 2022- Ind Vs Pak: ‘అలా అయితే అక్టోబరు 23న ఇండియాతో పాక్ మ్యాచ్ ఆడదు’
Update:
— Boria Majumdar (@BoriaMajumdar) October 21, 2022
Pakistani Batter Shan Masood has been taken to the hospital. Doctors will examine him and then further steps will be taken.
Mohd. Nawaz’s shot hit Masood on the head for this unfortunate injury. He was lying down on the ground for 5-7 mints. Wish him a speedy recovery.
Comments
Please login to add a commentAdd a comment