ఆదివారం టీమిండియా,పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన హై వోల్జేజ్ మ్యాచ్‌లో కోహ్లి స్టన్నింగ్ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించాడు. ఈ విషయం పక్కనబెడితే.. ఇదే మ్యాచ్‌లో ఒక అంశం తెరమీదకు వచ్చింది. అదే స్పైడర్ కెమెరా. మ్యాచ్ జరగుతున్న సమయంలో మైదానంలో అటూ ఇటూ తిరుగుతూ ఆటగాళ్ల కదలికలతో పాటు మ్యాచ్‌ను కవరేజ్ చేస్తుంది. అయితే ఈ స్పైడర్ కెమెరా వల్ల పెద్ద చిక్కు వచ్చి పడుతుంది.
బాగా ఆడుతున్న బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్లు నేలపాలు చేస్తున్నారు. దానికి కారణం స్పైడర్ కెమెరానే. బ్యాటర్ కొట్టిన బంతి స్పైడర్‌కు తగిలి ఒకచోట పడాల్సింది పోయి మరొక చోట పడుతుంది. దీంతో బ్యాటర్లకు అదృష్టంగా.. బౌలింగ్ చేస్తున్న జట్టుకు దురదృష్టంగా మారిపోయింది. టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో అర్థసెంచరీతో రాణించిన షాన్ మసూద్ స్పైడర్ కెమెరా వల్ల బతికిపోయాడంటే నమ్ముతారా.
పాక్ ఇన్నింగ్స్ సమయంలో షాన్ మసూద్ కొట్టిన ఒక బంతి నేరుగా స్పైడర్ కెమెరా కేబుల్‌కు తగిలింది. దీంతో బంతి దిశ మారి వేరేచోట పడింది. ఒకవేళ స్పైడర్ కెమెరా లేకపోయుంటే డీప్‌లో కోహ్లి క్యాచ్ అందుకోవడం ద్వారా షాన్ మసూద్ ఔటయ్యేవాడు. ఇది చూసిన హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలు స్పైడర్ కెమెరాపై అసహనం వ్యక్తం చేశారు. అప్పటికి మసూద్ 31 పరుగుల వద్ద ఉన్నాడు. అలా బతికిపోయిన మసూద్ ఆ తర్వాత అర్థసెంచరీతో రాణించి చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
ఇలా స్పైడర్ కెమెరాకు బంతి తగిలి బ్యాటర్ బతికిపోవడం చాలాసార్లు జరిగింది. ఇంతకముందు 2014-15లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒక మ్యాచ్ సందర్భంగా ఈ స్పైడర్ కెమెరా అడ్డు వల్లే బతికిపోయాడు. ఇంకా చాలా సందర్భాల్లో ఈ కెమెరా వల్ల ఫీల్డర్లు ఇబ్బందిపడ్డారు. దీంతో స్పైడర్ కెమెరాపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
''స్పైడర్ కెమెరా వాడకం అవసరమా.. పరోక్షంగా ఇది బ్యాటర్లకు అదృష్టంగా కలిసొస్తుంది. అవవసరమా ఇవన్నీ మనకు.. స్పైడర్ కెమెరాను బ్యాన్ చేయండి'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో స్పైడర్ కెమెరాను పదేళ్లుగా వాడుతున్నారు. 2007లో ఐపీఎల్ తొలి సీజన్‌లో తొలిసారి స్పైడర్ కెమెరాలను ఉపయోగించారు. ఆ తర్వాత క్రమంగా అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అడుపెట్టింది.
— Vaishnavi Iyer (@Vaishnaviiyer14) October 23, 2022
చదవండి: Viirat Kohli: ఒక్క ఇన్నింగ్స్‌తో టాప్-10లోకి దూసుకొచ్చిన 'కింగ్' కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment