టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ 1లో బిజీగా ఉన్నాడు. లంకాషైర్ తరపున డెబ్యూ సీజన్ ఆడుతున్న సుందర్ సూపర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన సుందర్ తాజాగా కెంట్‌తో మ్యాచ్‌లో తన ఆఫ్ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. సుందర్ వేసిన బంతి గింగిరాలు తిరుగుతూ ఆఫ్‌స్టంప్ మీదుగా వెళ్లింది. అయితే బంతిని డిఫెన్స్ చేద్దామని ప్రయత్నించిన కెంట్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ విఫలమయ్యాడు. బంతి ప్యాడ్ల సందులో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది.
బంతి ఎలా వెళ్లిందో అర్థంగాక జోర్డాన్ కాక్స్ నోరెళ్లబెట్టాడు. దీంతో కేవలం ఒక్క పరుగుకు కాక్స్ పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోనూ కౌంటీ చాంపియన్‌షిప్ షేర్ చేస్తూ.. ''సుందర్ నుంచి నమ్మశక్యం కాని డెలివరీ.. సూపర్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. తెలివైన బంతితో బోల్తా కొట్టించిన సుందర్‌ను తోటి ఆటగాళ్లు అభినందించారు. కాగా సుందర్‌కు కాక్స్‌ది రెండో వికెట్.. అంతకముందు కెంట్ కెప్టెన్ జాక్ లీనింగ్ రూపంలో తొలి వికెట్ తీసుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లంకాషైర్ 182 పరుగుల తేడాతో కెంట్‌పై విజయం అందుకుంది. లంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌట్ కాగా.. కెంట్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌట్ అయి 125 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం లంకాషైర్ అద్బుత ఆటతీరు కనబరిచింది. 9 వికెట్ల నష్టానికి 436 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెంట్ అనూహ్యంగా 127 పరుగులకే కుప్పకూలింది. టామ్ బెయిలీ 5 వికెట్లతో చెలరేగగా.. వాషింగ్టన్ సుందర్ 3, విల్ విలియమ్స్ రెండు వికెట్లు తీశాడు.
That is an incredible delivery from @Sundarwashi5 😲#LVCountyChamp pic.twitter.com/rLyMvMmI9l
— LV= Insurance County Championship (@CountyChamp) July 28, 2022
చదవండి: Sanju Samson In T20I Squad: విండీస్‌తో తొలి టి20.. టీమిండియాకు గుడ్‌న్యూస్
ఆరేళ్ల తర్వాత జట్టులోకి.. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్; ఇంగ్లండ్‌పై ప్రతీకారం
Comments
Please login to add a commentAdd a comment