Washington Sundar Dance With Lancashire Teammates Defeating Yorkshire, Video Viral - Sakshi
Sakshi News home page

Washinton Sundar: మ్యాచ్‌ గెలిచిన ఆనందం.. టీమిండియా క్రికెటర్‌ డ్యాన్స్‌

Published Sat, Aug 6 2022 9:10 AM | Last Updated on Sat, Aug 6 2022 10:36 AM

Washington Sundar Dance With Lancashire Teammates Defeating Yorkshire - Sakshi

టీమిండియా స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ప్రస్తుతం లంకాషైర్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ కౌంటీల్లో బిజీగా ఉన్నాడు. గాయంతో దూరమైన సుందర్‌ కౌంటీల్లో ఆడుతూ సూపర్‌ ప్రదర్శనతో రెచ్చిపోతున్నాడు. తాజాగా మ్యాచ్‌ గెలిచిన ఆనందంలో సుందర్‌ డ్యాన్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాయల్‌ లండన్‌ వన్డే-కప్‌లో భాగంగా లంకాషైర్‌, యార్క్‌షైర్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది.

ఈ మ్యాచ్‌లో లంకాషైర్‌ ఏడు వికెట్లతో విజయం సాధించింది. మ్యాచ్‌ గెలిచిన సంతోషాన్ని లంకాషైర్‌ జట్టు సభ్యులు డ్రెస్సింగ్‌రూమ్‌లో పెద్ద ఎత్తున్న సెలట్రేట్‌ చేసుకున్నారు. మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఒకరిని ఒకరు అభినందించుకుంటూ డ్యాన్స్‌ చేశారు. సుందర్‌ కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి గెంతులేయడం కనిపించింది.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన యార్క్‌షైర్‌ 48.3 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌట్‌ అయింది. విల్‌ ప్రెయిన్‌ 41 పరుగులు చేయగా.. టాటెర్సల్‌ 34 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన లంకాషైర్‌ 41 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. లూక్‌ వెల్స్‌ 88 పరుగులతో ఆకట్టుకోగా.. జోష్‌ బొహానన్‌ 51 పరుగులు చేశాడు. చివర్లో వాషింగ్టన్‌ సుందర్‌ 30 నాటౌట్‌, స్టీవెన్‌ క్రాఫ్ట్‌ 31 నాటౌట్‌ జట్టును విజయతీరాలకు చేర్చారు. 

చదవండి: Wayne Parnel: ఐదు వికెట్లతో చెలరేగిన బౌలర్‌.. అల్లాడిపోయిన ఐర్లాండ్‌

Senior RP Singh: భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్‌​ కుమారుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement