yorkshire
-
క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. వీడియో వైరల్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం యార్క్‌షైర్, లాంక్షైర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్‌కు సారథ్యం వహిస్తున్న పాకిస్తాన్ ఆటగాడు షాన్ మసూద్ ఒకే బంతికి హిట్ వికెట్‌తో పాటు రనౌటయ్యాడు.కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) నిబంధనల కారణంగా మసూద్ ఔటయ్యే ప్రమాదం నుంచి బతికిపోయాడు.అసలేం జరిగిందంటే?యార్క్‌షైర్ ఇన్నింగ్స్ 15వ వేసిన బ్లాథర్విక్ బౌలింగ్‌లో మూడో బంతిని షాన్ మసూద్ రివర్స్ స్కూప్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన మసూద్ తన కాలితో స్టంప్స్‌ను తాకాడు. దీంతో బెయిల్స్ కిందపడిపోయాయి. ఈ క్రమంలో తన ఔట్ అని గ్రహించిన మసూద్.. నాన్‌స్ట్రైకర్ జోరూట్ రన్‌కు పరిగెత్తుకుంటూ వచ్చినప్పటకి తను మాత్రం క్రీజులోనే ఉండిపోయాడు. అయితే అంతలోనే అంపైర్ నో బాల్‌గా సిగ్నల్ ఇవ్వడంతో మసూద్ కూడా నాన్‌స్ట్రైకర్ వైపు పరిగెత్తాడు. కాగా అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్లు వికెట్లను గిరాటేశారు. దీంతో మసూద్ రనౌటయ్యాని నిరాశచెందాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్టు చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్‌గా సిగ్నల్ ఇచ్చి అందరిని గందరగోళానికి గురిచేశాడు. అయితే మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) రూల్స్ ప్రకారమే అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.రూల్స్ ఏం చెబుతున్నాయి..?ఎంసీసీ రూల్ 31.7 ప్రకారం.. అంపైర్ ఔట్ ఇవ్వకుండా బ్యాటర్ తనంతట తానే ఔట్ అయినట్లు తప్పుగా భావిస్తే అంపైర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నాటౌట్ ఇవ్వవచ్చు. మసూద్ విషయంలో కూడా అదే జరిగింది. తన హిట్‌వికెట్ అయ్యాడని భావించిన మసూద్ రన్‌కు పరిగెత్తి మధ్యలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే రనౌటయ్యాడు. కానీ ఉద్దేశపూర్వకంగా మసూద్ అలా చేయలేదని భావించిన అంపైర్ నౌటౌట్‌గా ఇచ్చాడు. అయితే అది నో బాల్ కావడంతో హిట్‌వికెట్‌ను కూడా అంపైర్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో మసూద్ తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs SA: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే Shan Masood steps on his stumps off a no ball, Lancashire take the bails off at the other end - but Masood remained not out under law 31.7 pic.twitter.com/yQG6gP6Rac— Vitality Blast (@VitalityBlast) June 20, 2024 -
ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. జింబాబ్వే తరపున ఆడేందుకు!
ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ గ్యారీ బ్యాలెన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ దేశీవాళీ క్రికెట్లో యార్క్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాలెన్స్.. ఇప్పుడు తన సొంత దేశం జింబాబ్వే తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్‌తో బ్యాలెన్స్ తన బంధాన్ని తెంచుకున్నాడు. కాగా బ్యాలెన్స్ అభ్యర్థనను యార్క్‌షైర్ క్రికెట్ కూడా అంగీకరించింది. ఇక యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్‌తో తెగదింపులు చేసుకున్న బ్యాలెన్స్.. జింబాబ్వేలో రెండేళ్ల పాటు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక జింబాబ్వేలో జన్మించిన బ్యాలెన్స్.. తన చిన్న తనంలోనే అతడి తల్లిదండ్రలు ఇంగ్లండ్‌లో స్ధిర పడ్డారు. దీంతో ఇంగ్లీష్ జట్టు తరపున అతడు 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. బ్యాలెన్స్ 23 టెస్టులు, 16 వన్డేల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. జింబాబ్వేకు ఆడటమే నా లక్ష్యం ఇక యార్క్‌షైర్ నుంచి బయటకు వచ్చిన బ్యాలెన్స్ తొలి సారి స్పందించాడు. "జింబాబ్వే క్రికెట్లో చేరేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను. సీనియర్ కోచ్‌లు, ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కలిసే ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో రాణించి జింబాబ్వే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యమని" బ్యాలెన్స్ పేర్కొన్నాడు. చదవండి: ENG vs PAK: పాకిస్తాన్ క్రికెట్లో మరో యువ సంచలనం.. అరంగేట్ర మ్యాచ్‌లోనే 7 వికెట్లు.. -
మ్యాచ్ గెలిచిన ఆనందం.. టీమిండియా క్రికెటర్ డ్యాన్స్
టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం లంకాషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ కౌంటీల్లో బిజీగా ఉన్నాడు. గాయంతో దూరమైన సుందర్ కౌంటీల్లో ఆడుతూ సూపర్ ప్రదర్శనతో రెచ్చిపోతున్నాడు. తాజాగా మ్యాచ్ గెలిచిన ఆనందంలో సుందర్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాయల్ లండన్ వన్డే-కప్‌లో భాగంగా లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లంకాషైర్ ఏడు వికెట్లతో విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన సంతోషాన్ని లంకాషైర్ జట్టు సభ్యులు డ్రెస్సింగ్‌రూమ్‌లో పెద్ద ఎత్తున్న సెలట్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఒకరిని ఒకరు అభినందించుకుంటూ డ్యాన్స్ చేశారు. సుందర్ కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి గెంతులేయడం కనిపించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 48.3 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌట్ అయింది. విల్ ప్రెయిన్ 41 పరుగులు చేయగా.. టాటెర్సల్ 34 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంకాషైర్ 41 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. లూక్ వెల్స్ 88 పరుగులతో ఆకట్టుకోగా.. జోష్ బొహానన్ 51 పరుగులు చేశాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 30 నాటౌట్, స్టీవెన్ క్రాఫ్ట్ 31 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. A roses 𝒔𝒑𝒆𝒄𝒊𝒂𝒍 🌹 🌹 #RedRoseTogether pic.twitter.com/cKIGlfCj8g — Lancashire Cricket (@lancscricket) August 4, 2022 చదవండి: Wayne Parnel: ఐదు వికెట్లతో చెలరేగిన బౌలర్.. అల్లాడిపోయిన ఐర్లాండ్ Senior RP Singh: భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు -
'క్యాచెస్ విన్ మ్యాచెస్' అని ఊరికే అనరు
'క్యాచెస్ విన్ మ్యాచెస్' అని అంటారు. తాజాగా అది మరోసారి నిరూపితమైంది. విటాలిటీ బ్లాస్ట్ టి20 టోర్నీలో భాగంగా లంకాషైర్, యార్క్‌షైర్ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో క్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. విషయంలోకి వెళితే.. యార్క్‌షైర్ విజయానికి ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి ఆరు పరుగులు కావాలి. క్రీజులో డొమినిక్ డ్రేక్స్ ఉన్నాడు. అవతలి ఎండ్‌లో డానీ లాంబ్ బౌలింగ్ చేస్తున్నాడు. సిక్స్ కొడితే మ్యాచ్ విన్ అవుతుంది.. లేదంటే యార్క్‌షైర్‌కు ఓటమి తప్పదు. ఈ దశలో డానీ లాంబ్ పూర్తిగా ఆఫ్ స్టంప్ అవతల బంతిని విసిరాడు. అయితే డొమినిక్ డ్రేక్స్ డీమ్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అతని టైమింగ్ షాట్ చూసి అంతా సిక్స్ అని భావించారు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బౌండరీ లైన్ వద్ద టామ్ హార్ట్లే సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే లైన్ తొక్కాడేమోనన్న చిన్న అనుమానం ఉండడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించాడు. రిప్లేలో టామ్ హార్టీ చిన్న మిస్టేక్ కూడా చేయకుండా క్యాచ్‌ను ఒడిసిపడినట్లు తేలడంతో ఔట్ ఇచ్చాడు. దీంతో యార్క్‌షైర్ విజయానికి ఆరు పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన లంకాషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(32 బంతుల్లో 66), క్రాప్ట్ 41, జెన్నింగ్స్ 42 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ ఇన్నింగ్స్‌లో టామ్ కోహ్లెర్ 77, డేవిడ్ విల్లీ 52 పరుగులతో మెరిసినప్పటికి లాభం లేకుండా పోయింది. చదవండి: European T10 League: హతవిధి.. నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని స్థితిలో! UNBELIEVABLE DRAMA!!! Tom Hartley catches on the boundary to win it for @lancscricket!!#Blast22 #RosesT20 pic.twitter.com/StKY6rcv5T — Vitality Blast (@VitalityBlast) June 8, 2022 -
అదృష్టం బాగుంది.. కొంచెమైతే పరువు పోయేదే!
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టి20 బ్లాస్ట్ టోర్నమెంట్లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్‌లో ఫీల్డర్ క్యాచ్ అందుకునే క్రమంలో ప్యాంట్ జారిపోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యార్క్‌షైర్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు కావాల్సి ఉంది. అయితే మరో రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన దశలో లంకాషైర్ బౌలర్ హై ఫుల్‌టాస్ వేశాడు. క్రీజులో ఉన్న షాదాబ్ సిక్స్ కొట్టబోయే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి గాల్లోకి లేచింది. మిడాఫ్ నుంచి పరిగెత్తుకొచ్చిన డేన్ విలా క్యాచ్ అందుకునే ప్రయత్నం చేసినప్పటికి మిస్ అయింది. దీంతో బంతిని తీసుకోవడానికి పైకి లేచిన డేన్ ప్యాంట్ ఒక్కసారిగా కిందకు జారింది. షాక్ తిన్న డేన్ విలా.. ''ఎవరైనా చూశారేమో..నాకు సిగ్గేస్తుందన్న'' తరహాలో అక్కడే కూలబడ్డాడు. ఆ తర్వాత పైకి లేచి ప్యాంటును సర్దుకొని బంతిని విసిరేశాడు. ఈ వీడియోనూ విటాలిటీ బ్లాస్ట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ''అరె కొంచమైతే పరువు మొత్తం పోయేదే.. క్యాచ్ పట్టడం సంగతి దేవుడెరుగు.. ముందు పరువు పోయేది'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ టైగా ముగిసింది. యార్క్‌షైర్‌కు చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. 12 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంకాషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 41 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఇక టి20 బ్లాస్ట్ టోర్నమెంట్లో యార్క్‌షైర్ రెండో స్థానంలో ఉండగా.. లంకాషైర్ ఏడో స్థానంలో ఉంది. చదవండి: Paul Stirling: ఒక్క ఓవర్లో 34 పరుగులు.. అయినా మొహంలో చిరాకే! If the #RosesT20 didn't have enough drama... Dane Vilas had an unfortunate moment 😂#Blast22 pic.twitter.com/WBq2gSpMRx — Vitality Blast (@VitalityBlast) May 28, 2022 -
దటీజ్ లివింగ్‌స్టోన్.. బంతి స్టేడియం బయటకు వెళ్లాల్సిందే.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో భారీ సిక్సర్ బాదిన లియామ్ లివింగ్‌స్టోన్ ఇప్పుడు ఇంగ్లీష్ టీ20 బ్లాస్ట్‌లో అదరగొడుతున్నాడు. టీ20 బ్లాస్ట్‌లో లాంక్షైర్ తరపున లివింగ్‌స్టోన్ ఆడుతున్నాడు. ఇక టోర్నీలో భాగంగా శుక్రవారం యార్క్‌షైర్‌తో జరగిన మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్ కొట్టాడు. లాంక్షైర్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన మాథ్యూ రెవిస్ బౌలింగ్‌లో అఖరి బంతికి లివింగ్‌స్టోన్ కొట్టిన సిక్స్ స్టేడియం బయట పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను టీ20 బ్లాస్ట్ మేనేజేమెంట్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో 16 బంతులు ఎదుర్కొన్న లివింగ్‌స్టోన్ 23 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన లివింగ్‌స్టోన్ 117 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. చదవండి: RCB Tweet On RR: రాజస్తాన్‌కు ఆర్సీబీ విషెస్.. గుండెల్ని మెలిపెట్టే ట్వీట్! హృదయాలు గెలిచారు! That. Is. Huge. 🔥 @liaml4893 🔥#Blast22 #RosesT20 pic.twitter.com/FAAaWKg85P — Vitality Blast (@VitalityBlast) May 27, 2022 -
140 కి.మీ స్పీడుతో యార్కర్..దెబ్బకు బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్!
పాకిస్తాన్ స్టార్ పేసర్ హారిస్ రౌఫ్ ఇంగ్లండ్ కౌంటీల్లో యార్క్‌షైర్ తరపున ఆడుతోన్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే రౌఫ్ అదరగొట్టాడు. కెంట్‌తో జరుగుతోన్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రౌఫ్ ఐదు వికెట్లతో మెరిశాడు. కాగా ఈ మ్యాచ్‌లో రౌఫ్ అద్భుతమైన యార్కర్‌తో మెరిశాడు. కెంట్ తొలి ఇన్నింగ్స్ 85 ఓవర్లో రౌఫ్ వేసిన ఐదో బంతికి నాథన్ గిల్‌క్రిస్ట్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే 140 కి.మీ స్పీడుతో వేసిన యార్కర్‌కు కెంట్ బ్యాటర్ గిల్‌క్రిస్ట్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే.. విజయం ఎవరిది..? ✨@HarisRauf14 claiming his fifth wicket 😍 What a way to start his first match in a Yorkshire shirt at HQ! 🎉#OneRose pic.twitter.com/0Kdc1Mc1E0 — Yorkshire CCC (@YorkshireCCC) April 29, 2022 -
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కన్నుమూత..
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ రే ఇల్లింగ్‌వర్త్(89) శనివారం కన్నుమూశారు. ఆయన ఆనరోగ్యంతో మరణించినట్లు యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ట్విటర్లో తెలిపింది. ఇంగ్లండ్ తరుపున 61 టెస్టులు ఆడిన ఇల్లింగ్‌వర్త్ 1836 పరుగులతో పాటు, 122 వికెట్లు పడగొట్టాడు. 1971లో అతని సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. అదే విధంగా యార్క్‌షైర్ జట్టుకు మూడు సార్లు టైటిల్‌ను అందించారు. ఆయన క్రికెట్‌కు రిటైర్మంట్ ప్రకటించిన తర్వాత కూడా పలు రకాలగా ఇంగ్లండ్ జట్టుకు సేవలందించాడు. "రే ఇల్లింగ్‌వర్త్ మరణవార్త విన్నాక చాలా బాధ పడ్డాము. అతని కుటంబానికి మా అండదండలు ఎప్పడూ ఉంటాయి అని యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ట్విటర్లో పేర్కొంది. చదవండి: India Vs SA: భారత ఆభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త కెప్టెన్ వచ్చేస్తున్నాడు! -
జాతి వివక్ష.. 9 ఏళ్ల తర్వాత పుజారాకు క్షమాపణ
Jack Brooks Apologises Cheteshwar Pujara Over Racism.. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాను సోమర్సెట్ బౌలర్ జాక్ బ్రూక్స్ క్షమించమని కోరాడు. 2012లో పుజారా యార్క్‌షైర్‌కు ఆడుతున్న సందర్భంలో జాక్ బ్రూక్.. పుజారాకు 'స్టీవ్' అని నిక్‌నేమ్ పెట్టాడు.దీంతో పాటు పుజారాను అవమానిస్తూ వివక్షపూరిత వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడుతున్నానంటూ పేర్కొన్నాడు. ఇక స్టీవ్ అంటే పనివాడని అర్థం. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో జాక్ బ్రూక్స్ మాట్లాడాడు. చదవండి: Syed Mustaq Ali T20 Trophy: ఆఖరి బంతికి ఊహించని ట్విస్ట్.. సూపర్ ఓవర్ ద్వారా సెమీస్‌కు '2012లో పుజారాపై నేను చేసిన వ్యాఖ్యలు వివక్షపూరితంగా ఉన్నాయి. ఆ సమయంలో ఏం ఆలోచించకుండా ట్విటర్లో అతనిపై విరుచుకుపడ్డా. స్టీవ్ అని నిక్‌నేమ్‌తో పిలిచి అతన్ని అవమానించాను. తాజాగా ఈ విషయంలో పుజారాను క్షమాపణ కోరుతున్నా. అంతేగాక నా ట్వీట్‌ను చూసిన వారిని కూడా క్షమాపణ అడుగుతున్నా. కొద్దిరోజుల క్రితం యార్క్‌షైర్ క్రికెట్ కౌంటీ క్లబ్ అండర్-19 కెప్టెన్ అజీం రఫిక్ దాఖలు చేసిన ఫిర్యాదుపై అక్కడి కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఇందులో అనేక కీలక విషయాలు వెల్లడయ్యాయి. యార్క్‌షైర్ కౌంటీలో తెల్ల జాతీయులు నల్లజాతీయులతో కావాలనే వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వెల్లడవుతోంది. అందులో భారత క్రికెటర్ చటేశ్వర్ పుజారా కూడా ఉన్నట్లు తేలింది. అజీం రఫీక్ వెళ్లిన తర్వాత యార్క్‌షైర్ నుంచి వెళ్లిపోయిన తర్వాత పుజారా చేరాడు. దీంతో అతను యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఇంగ్లీష్ ఆటగాళ్లు పుజారాను స్టీవ్ అని పిలిచేవారు. కానీ పుజారా వీటిని పట్టించుకోకుండా తన పనిని చూసుకొని వెళ్లిపోయేవాడని రఫీక్ తాజా ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. చదవండి: మార్క్ చాప్మన్ అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా -
యార్క్‌షైర్ కౌంటీపై వేటు
లండన్: జాతి వివక్షపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కన్నెర్ర చేసింది. కుప్పలుతెప్పలుగా ఆరోపణలు వస్తున్నా... చర్యలు చేపట్టకుండా ఉదాసీనంగా వ్యవహరించిన యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (వైసీసీసీ)పై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆ జట్టు కౌంటీలకు దూరమవడంతో పాటు క్లబ్‌కు చెందిన హెడింగ్లీ స్టేడియంలో ఇకపై అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగవు. వచ్చే ఏడాది లీడ్స్‌లోని హెడింగ్లీ స్టేడియంలో పలు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో మూడో టెస్టు, దక్షిణాఫ్రికాతో వన్డే, యాషెస్ సిరీస్‌లో ఒక టెస్టు మ్యాచ్‌ను అక్కడి నుంచి తప్పిస్తారు. వైసీసీసీకి చెందిన మాజీ క్రికెటర్ అజీమ్ రఫీక్ (2008–2018) ఏళ్ల తరబడి వర్ణ వివక్షకు గురయ్యాడు. ఇస్లాం మతానికి చెందిన తను పదేపదే వివక్షకు గురయ్యానని, సహచరులు తనను బయటివాడిగానే చూసేవారని, దీనిపై క్లబ్‌కు 43 సార్లు ఫిర్యాదు చేశానని రఫిక్ గతేడాది ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈసీబీ రంగంలోకి దిగింది. కమిటీ విచారణలో యార్క్‌షైర్ ఉదాసీనత వెలుగులోకి వచ్చింది. వెంటనే ఈసీబీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
రషీద్ ఖాన్ హెలికాప్టర్ సిక్స్.. వీడియో వైరల్
లండన్: అఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అదరగొట్టాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్ ఖాన్ యార్క్‌షైర్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా రషీద్ ఖాన్ కొట్టిన హెలికాప్టర్ సిక్స్ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. జోర్డాన్ థాంప్సన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఆఫ్ స్టంప్ మీదుగా రషీద్ హెలకాప్టర్ సిక్స్ కొట్టాడు. అతని షాట్లో ఎంత కచ్చితత్వం అంటే ఫీల్డర్‌కు బంతి దొరికే చాన్స్ కూడా ఇవ్వకుండా గ్యాలరీలో పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓవరాల్‌గా రషీద్ 9 బంతులాడి మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 27 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. టామ్ కాడ్మోర్ 55, బాలన్స్ 55 పరుగులు చేశారు. ససెక్స్ బౌలింగ్‌లో టైమల్ మిల్స్ 3, రషీద్ ఖాన్, లెన్హమ్, జార్జ్ గార్టన్, క్రిస్ జోర్డాన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ససెక్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ లూక్ రైట్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రషీద్ ఖాన్ 27, డిల్రే రావ్లిన్స్ 27 పరుగులు చేశారు. ఈ విజయంతో ససెక్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలనతో రషీద్ ఖాన్ తన కుటుంబం గురించి ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. తన కుటుంబాన్ని తాలిబన్ల నుంచి కాపాడడంటూ కామెంట్స్ చేశాడు. ఇక పాకిస్తాన్, అఫ్గన్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ నిరవధిక వాయిదా పడింది. చదవండి: తాలిబన్ల మధ్యే కుటుంబం: పీటర్సన్ వద్ద రషీద్ ఆవేదన Virat Kohli- James Anderson: రవిశాస్త్రి ఏం జరిగినా పట్టించుకోడు 🚁 RASHID KHAN 🚁 How have you played this??!!#Blast21 pic.twitter.com/KU2DCptXgp — Vitality Blast (@VitalityBlast) August 24, 2021 -
పరిగెత్తుతూ కిందపడ్డాడు; రనౌట్‌కు అవకాశమున్నా..
మాంచెస్టర్: ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ టీ20 బ్లాస్ట్ క్రికెట్లో క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం యార్క్‌షైర్, లంకాషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. లంకాషైర్ ఇన్నింగ్స్ మధ్యలో లూక్ వెల్స్ మిడాఫ్ మీదుగా షాట్ ఆడి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న స్టీవెన్ క్రాప్ట్‌కు కాల్ ఇచ్చాడు. అయితే క్రాప్ట్ పరుగు కోసం యత్నించి పట్టుతప్పి క్రీజు మధ్యలోనే కిందపడ్డాడు. కాలు పిక్క పట్టేయడంతో క్రాప్ట్ నొప్పితో విలవిల్లాడాడు. అయితే అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ కీపర్ హ్యారీ డ్యూక్‌కు అందించాడు. ఇక్కడ బ్యాట్స్‌మన్ రనౌట్‌కు అవకాశమున్నా కెప్టెన్ రూట్ డ్యూక్‌ను వద్దంటూ వారించాడు. కాగా గాయపడిన క్రాప్ట్ను పక్కకు తీసుకెళ్లి ఫిజియోతో చికిత్స చేయించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూట్ చేసిన పనికి నెటిజన్లు వినూత్న రీతిలో స్పందించారు. కెప్టెన్ అనే పదానికి రూట్ సరైన నిర్వచనం... ఇది అసలైన క్రీడాస్ఫూర్తి.. అంటూ కామెంట్లు పెట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లంకాషైర్ 4 వికెట్ల తేడాతో యార్క్‌షైర్‌పై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 32, బాలన్స్ 31, విల్ ప్రెయిన్ 22* పరుగులు చేశారు. లంకాషైర్ బౌలింగ్‌లో లూక్ వుడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకాషైర్ మరో ఆరు బంతులు మిగిలి ఉండగా.. 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. లంకాషైర్ ఇన్నింగ్స్‌లో స్టీవెన్ క్రాప్ట్ 26 నాటౌట్, లూక్ వెల్స్ 30 పరుగులు చేసి జట్టును గెలిపించారు. What would you have done? Croft goes down injured mid run and @YorkshireCCC decide not to run him out#Blast21 pic.twitter.com/v1JHVGLn1T — Vitality Blast (@VitalityBlast) July 17, 2021 -
7 పరుగులకే ఆలౌట్.. ఇందులోనూ మూడు ఎక్స్‌ట్రాలు
లండన్: యార్క్‌షైర్ ప్రీమియర్ టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అత్యంత చెత్త గణాంకాలు నమోదయ్యాయి. ఈస్ట్‌రింగ్‌స్టన్ క్లబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో.. హిల్లమ్ మాన్క్ ఫ్రైస్టన్ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకే ఆలౌటై అప్రతిష్ట మూటగట్టుకుంది. అనంతరం స్వల్ప ఛేదనలో ప్రత్యర్ధి జట్టు కేవలం 8 బంతుల్లోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో పూర్తయిన మ్యాచ్‌గా చరిత్రలో నిలిచింది. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లు కేవలం 56 బంతుల్లోనే ముగిసిపోయాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హిల్లమ్ మాన్క్ ఫ్రైస్టన్ జట్టు.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో పని ఉందన్నట్లుగా క్రీజులోకి వచ్చీరాగానే వికెట్లు సమర్పించుకుని పెవిలియన్‌కు చేరారు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 10మంది బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేయగా, 8 మంది ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. మిగిలిప ఇద్దరు ఆటగాళ్లు అతికష్టం మీద తలో రెండు పరుగులు చేయగా, మిగిలిన మూడు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో ఫ్రైస్టన్ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్ధి బౌలర్ నాథన్ క్రీగర్ 4 ఓవర్లలో 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 8 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌రింగ్‌స్టన్ జట్టు.. కేవలం 1.2 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా టార్గెట్‌ను రీచ్ కావడంతో ఏ ఫార్మాట్టోనైనా అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్‌గా ఈ మ్యాచ్ చరిత్రకెక్కింది. ఈస్ట్‌రింగ్‌స్టన్ ఆటగాడు జేమ్స్ ఒక్కడే 8 బంతులను ఎదుర్కొని బౌండరీ సాయంతో 7 పరుగులు సాధించాడు. మరో పరుగు ఎక్స్ట్రాగా లభించింది. -
చివరి మూడు బంతుల్లో హ్యట్రిక్; అద్భుత విజయం
లీడ్స్: టీ20 బ్లాస్ట్ 2021లో భాగంగా శుక్రవారం లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. భారీస్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్ ఆఖరిఓవర్లో విజయాన్ని దక్కించుకుంది. యార్క్‌షైర్ బౌలర్ లోకి ఫెర్గూసన్ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్‌తో మెరిసి జట్టును గెలిపించాడు. లంకాషైర్‌కు చివరిఓవర్లో 20 పరుగులు అవసరం కాగా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను ఫెర్గూసన్ వేశాడు. అయితే ఫెర్గూసన్ వేసిన రెండో బంతి నోబాల్ కావడం, ఆ తర్వాత బంతిని రాబ్ జోన్స్ ఫోర్‌గా మలిచాడు. ఇన్నింగ్స్ మూడో బంతికి సింగిల్ తీయడంతో మూడు బంతుల్లో 10 పరుగులు చేస్తే లంకాషైర్ విజయం సాధిస్తుంది. ఈ దశలోనే ఫెర్గూసన్ అద్భుతం చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో బంతికి వెల్స్ ను వెనక్కి పంపిన ఫెర్గూసన్ ఐదో బంతికి లూక్ వుడ్‌ను అద్బుత యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికే లంకాషైర్ పరాజయం ఖరారైనా.. ఇంకా ఒక బంతి మిగిలి ఉండడంతో ఫెర్గూసన్ బంతిని విసిరాడు. టామ్ హార్ట్లీ భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో లిత్ చేతికి చిక్కాడు. అంతే ఎవరు ఊహించని విధంగా ఫెర్గూసన్ హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. యార్క్‌షైర్ బ్యాటింగ్‌లో హారీ బ్రూక్(50 బంతుల్లో 91నాటౌట్ ; 10 ఫోర్లు, 3 సిక్సర్లతో) విధ్వంసం చేయగా.. ఓపెనర్ కెప్టెన్ లిత్ 52 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంకాషైర్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడినా ఆఖర్లో ఫెర్గూసన్ హ్యాట్రిక్‌తో మెరవడంతో 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రాబ్ జోన్స్ 64 నాటౌట్, కీటన్ జెన్నింగ్స్ 37 పరుగులతో రాణించారు. LOCKIE FERGUSON HATTRICK 🔥 Look at those scenes 😍#Blast21 pic.twitter.com/QaFAp25KAZ — Vitality Blast (@VitalityBlast) July 2, 2021 -
ఊహించని విధంగా బౌన్సర్ వేశాడు.. దాంతో
లండన్: ఇంగ్లండ్ జట్టు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ మాత్రం యార్క్‌షైర్ తరపున ఆడుతూ టీ20 బ్లాస్ట్ 2021లో బిజీగా ఉన్నాడు. జో రూట్లో మంచి ఆఫ్ స్పిన్నర్ దాగున్న సంగతి మనం టీమిండియాతో టెస్టు సిరీస్‌లో చూశాము. తాజాగా యార్క్‌షైర్ తరపున మూడు మ్యాచ్‌లు ఆడిన రూట్ 65 పరుగులు మాత్రమే చేసి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక లీస్టర్‌షైర్ ఫాక్సెస్తో జరిగిన మ్యాచ్‌లో రూట్ తన ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌లో ఎవరు ఊహించని విధంగా బౌన్సర్‌తో మెరిశాడు. కానీ ఆ బంతిని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఆరోన్ లిల్లీ బౌండరీ తరలించాడు. రూట్ వేసిన ఆ ఓవర్లో సిక్స్, ఫోర్ సహా మొత్తం 10 పరుగులు వచ్చాయి. కాగా రూట్ వేసిన బౌన్సర్‌పై కామెంటేటర్స్‌తో పాటు అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ఇక ఈ మ్యాచ్‌లో లీస్టర్‌షైర్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లీస్టర్‌షైర్ 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 173 పరుగులకే పరిమితమైంది. చదవండి: పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు -
ఆ దెయ్యాల కంట పడ్డారో.. అంతే?!
దయ్యాలు.. ఆత్మలు గురించి మాట్లాడుతుంటే.. ఇంకా ఈ కాలంలో వాటి గురించి చర్చించే వాళ్లున్నారా? అని వింతగా చూస్తారు. ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే.. అబ్బే అవన్నీ ఉత్తి మాటలని కొట్టి పారేస్తాం. ఆత్మలు, దయ్యాలు అనేవి లేవు.. మన భ్రమ అని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. ఇటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. మీరు నమ్మినా నమ్మకపోయినా.. అక్కడ మాత్రం దయ్యాలున్నాయి. బ్రిటన్.. ఆధునికతకు మారు పేరుగా నిలిచన దేశం. ఇక్కడున్న యార్క్‌షైర్, విల్ట్‌షైర్, నర్ఫోక్, కుంబ్రియా, స్టాఫోర్డ్‌షైర్, ఎడ్విన్ బర్డ్, ఇజిల్ ఆఫ్ వెయిట్, లండన్ ప్రాంతాల్లో దయ్యాలు విరివిగా తిరుగుతున్నాయి. ఏదో ఒకటిరెండు కాదు.. వందల సంఖ్యలో ఆత్మలు, దయ్యాలు సంచరిస్తున్నాయట. యార్క్‌షైర్ : ఈ ప్రాంతాన్ని బ్రిటన్‌లో దయ్యాల అడ్డాగా పిలుస్తారు. ఇక్కడ రమారమీ 607 దయ్యాలను ప్రజలు గుర్తించారట. బ్రాడ్‌ఫోర్డ్‌లోని గోల్ఫ్ కోర్ట్ దగ్గర రాత్రి సమయాల్లో దయ్యాలు సంచరిస్తాయట. తూర్పు యార్క్‌షైర్ ప్రాంతంలోనూ.. అతీత శక్తులు తిరుగాడుతాయట. ఈ ప్రాంతంలో 1960-70 మధ్యనివసించిన ఒక దొంగ సాధువు.. అనేకమందిని హత్య చేశాడట. కొన్నాళ్లుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడట. దొంగ సాధువు చేతిలో అమాకయంగా హతులైన వారు.. చివరకు దొంగ సాధువు కూడా దయ్యాలై ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నారని ఒక కథనం ఉంది. ఇది నిజమని చాలా మంది విశ్వాసం. విల్ట్‌షైర్: విల్ట్‌షైర్, నోర్ఫోక్ ప్రాంతంలోని అడవుల్లో సుమారు 28 దయ్యాలు తిరుగుతున్నాయట. ఇవి చాలా వరకు నల్లటి భీకరమైన కుక్కలా కనిపిస్తాయని.. మనిషి కనిపిస్తే.. వెంటాడి వేటాడతాయని ప్రజలు చెబుతున్నారు. స్టాఫొర్డ్షైర్ : ఈ ప్రాంతంలో 2007 నుంచి భీకరమైన తోడేలు రూపంలో దయ్యాలు తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వీటిపైన వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ఘోస్ట్ క్లబ్ వారు పరిశోధనలు సైతం చేశారు. ఎవరైనా రాత్రి పూట ఒంటరిగా నడుస్తున్న సమయంలో.. ఈ తోడులు వెనకగా వస్తుందట.. మనిషి దానిన గమనిస్తే.. బిగ్గరగా అరిచి.. భయపెడుతుందట. లండన్ : గ్రేటర్ లండన్‌లోనూ ప్రజలకు ఇటువంటి అనుభవాలున్నాయట. సుమారు 547 మంది ప్రజలు వీటి బారిన పడి ఇబ్బందులు పడ్డారట. -
ఆ దెయ్యాల కంట పడ్డారో.. అంతే?!
-
పుష్పద్వేషి
పూలను ఇష్టపడనిదెవరు..? అందరూ ఇష్టపడతారు కదా.. అనుకుంటున్నారా..? గడచిన శతాబ్దంలో పూలంటేనే గిట్టని ఒక మహానుభావుడు ఇంగ్లాండ్‌లో ఉండేవాడు. అతగాడి పేరు సర్ టాటన్ సెకైస్. యార్క్‌షైర్‌లో నగరానికి రాచ ప్రతినిధిగా ఉన్న టాటన్ దొరగారికి పూలపై ఎంతటి ద్వేషమంటే, పురవీధుల్లో ఆయన సంచరించేటప్పుడు ఏ మొక్కకు పూలు కనిపించినా, వాటిని అక్కడికక్కడే తుంచి, నలిపి నాశనం చేసి గానీ శాంతించేవాడు కాదు. అంతేకాదు, నగర వాసులెవరూ పూలమొక్కలు పెంచనే పెంచరాదని కూడా హుకుం జారీ చేసి పారేశాడు. నగర పౌరులెవరైనా ఫ్లవర్స్‌ను పెంచాలనుకుంటే, కాలిఫ్లవర్స్ తప్ప మరే రకానికి చెందిన ఫ్లవర్స్ పెంచరాదని కరాఖండిగా శాసించాడు. పూలను విపరీతంగా ద్వేషించే టాటన్ దొరగారికి పిచ్చి బాగా ముదిరి, ఆరోగ్యంపై అతిజాగ్రత్త మొదలైంది. కేవలం కోల్డ్ రైస్ పుడ్డింగ్ మాత్రమే తినేవాడు. కొంపలంటుకుంటున్నా రాజీ పడకుండా తిండిలో కచ్చితమైన వేళలు పాటించేవాడు. చివరకు తన రాచప్రాసాదం మంటల్లో చిక్కుకున్నా, పుడ్డింగ్ తింటే తప్ప అందులోంచి కదిలేది లేదని భీష్మించుకున్న ఘనుడు ఇతగాడు. - పన్యాల జగన్నాథదాసు -
పాపం... పుజారా!
ముంబై: విదేశీ క్రికెటర్లంతా ఐపీఎల్ కోసం తమ దేశవాళీ క్రికెట్‌ను వదిలేసి రావాలని చూస్తారు. ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా తమ కౌంటీల నుంచి అనుమతి తీసుకుని వచ్చి మరీ ఐపీఎల్ ఆడుతుంటారు. ఈ లీగ్‌లో ఉన్న డబ్బు మహత్యం ఇది. అయితే భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా మాత్రం ఐపీఎల్ సమయంలోనే కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళుతున్నాడు. గత సీజన్లో పంజాబ్ తరఫున ఆడిన పుజారాను ఈసారి ఆ జట్టు వదిలేసింది. ఐపీఎల్-8 కోసం జరిగిన వేలంలోనూ ఎవరూ తనని తీసుకోలేదు. ఈలోగా ఇంగ్లండ్ కౌంటీ జట్టు యార్క్‌షైర్‌తో ఆడేందుకు అవకాశం వచ్చింది. సచిన్ తర్వాత యార్క్‌షైర్ తరఫున ఆడబోతున్న భారత క్రికెటర్ పుజారా. తొలుత పాకిస్తాన్ క్రికెటర్ యూనిస్‌ఖాన్‌తో యార్క్‌షైర్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ తను అందుబాటులో లేకపోవడంతో పుజారాను సంప్రదించారు. పాపం... భారత క్రికెటర్లంతా ఐపీఎల్‌తో కాసుల వర్షంలో తడుస్తుంటే పుజారా మాత్రం అలా ఇంగ్లండ్ వెళ్లాల్సివచ్చింది.