Jack Brooks Apologises Cheteshwar Pujara Over Racism.. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాను సోమర్‌సెట్ బౌలర్ జాక్ బ్రూక్స్ క్షమించమని కోరాడు. 2012లో పుజారా యార్క్‌షైర్‌కు ఆడుతున్న సందర్భంలో జాక్ బ్రూక్.. పుజారాకు 'స్టీవ్' అని నిక్‌నేమ్ పెట్టాడు.దీంతో పాటు పుజారాను అవమానిస్తూ వివక్షపూరిత వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడుతున్నానంటూ పేర్కొన్నాడు. ఇక స్టీవ్ అంటే పనివాడని అర్థం. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో జాక్ బ్రూక్స్ మాట్లాడాడు.
చదవండి: Syed Mustaq Ali T20 Trophy: ఆఖరి బంతికి ఊహించని ట్విస్ట్.. సూపర్ ఓవర్ ద్వారా సెమీస్‌కు
'2012లో పుజారాపై నేను చేసిన వ్యాఖ్యలు వివక్షపూరితంగా ఉన్నాయి. ఆ సమయంలో ఏం ఆలోచించకుండా ట్విటర్‌లో అతనిపై విరుచుకుపడ్డా. స్టీవ్ అని నిక్‌నేమ్‌తో పిలిచి అతన్ని అవమానించాను. తాజాగా ఈ విషయంలో పుజారాను క్షమాపణ కోరుతున్నా. అంతేగాక నా ట్వీట్‌ను చూసిన వారిని కూడా క్షమాపణ అడుగుతున్నా.
కొద్దిరోజుల క్రితం యార్క్‌షైర్ క్రికెట్ కౌంటీ క్లబ్ అండర్-19 కెప్టెన్ అజీం రఫిక్ దాఖలు చేసిన ఫిర్యాదుపై అక్కడి కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఇందులో అనేక కీలక విషయాలు వెల్లడయ్యాయి. యార్క్‌షైర్ కౌంటీలో తెల్ల జాతీయులు నల్లజాతీయులతో కావాలనే వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వెల్లడవుతోంది. అందులో భారత క్రికెటర్ చటేశ్వర్ పుజారా కూడా ఉన్నట్లు తేలింది. అజీం రఫీక్ వెళ్లిన తర్వాత యార్క్‌షైర్ నుంచి వెళ్లిపోయిన తర్వాత పుజారా చేరాడు. దీంతో అతను యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఇంగ్లీష్ ఆటగాళ్లు పుజారాను స్టీవ్ అని పిలిచేవారు. కానీ పుజారా వీటిని పట్టించుకోకుండా తన పనిని చూసుకొని వెళ్లిపోయేవాడని రఫీక్ తాజా ఇంటర్య్వూలో పేర్కొన్నాడు.
చదవండి: మార్క్ చాప్‌మన్ అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment