
ఐపీఎల్-2022లో భారీ సిక్సర్ బాదిన లియామ్ లివింగ్‌స్టోన్ ఇప్పుడు ఇంగ్లీష్ టీ20 బ్లాస్ట్‌లో అదరగొడుతున్నాడు. టీ20 బ్లాస్ట్‌లో లాంక్‌షైర్ తరపున లివింగ్‌స్టోన్ ఆడుతున్నాడు. ఇక టోర్నీలో భాగంగా శుక్రవారం యార్క్‌షైర్‌తో జరగిన మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్ కొట్టాడు. లాంక్‌షైర్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన మాథ్యూ రెవిస్ బౌలింగ్‌లో అఖరి బంతికి లివింగ్‌స్టోన్ కొట్టిన సిక్స్ స్టేడియం బయట పడింది.
ఇందుకు సంబంధించిన వీడియోను టీ20 బ్లాస్ట్ మేనేజేమెంట్ ట్విటర్‌లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో 16 బంతులు ఎదుర్కొన్న లివింగ్‌స్టోన్ 23 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన లివింగ్‌స్టోన్ 117 మీటర్ల భారీ సిక్స్ బాదాడు.
చదవండి: RCB Tweet On RR: రాజస్తాన్‌కు ఆర్సీబీ విషెస్.. గుండెల్ని మెలిపెట్టే ట్వీట్! హృదయాలు గెలిచారు!
That. Is. Huge.
— Vitality Blast (@VitalityBlast) May 27, 2022
🔥 @liaml4893 🔥#Blast22 #RosesT20 pic.twitter.com/FAAaWKg85P