ENG VS NZ 2nd ODI: లివింగ్‌స్టోన్‌ విధ్వంసం.. తృటిలో సెంచరీ మిస్‌ | ENG vs NZ, 2nd ODI: Livingstone Miss Century By 5 Runs, As England Score 226 | Sakshi
Sakshi News home page

ENG VS NZ 2nd ODI: లివింగ్‌స్టోన్‌ విధ్వంసం.. తృటిలో సెంచరీ మిస్‌

Published Sun, Sep 10 2023 9:54 PM | Last Updated on Mon, Sep 11 2023 9:41 AM

ENG VS NZ 2nd ODI: Livingstone Miss Century By 5 Runs, As England Score 226 - Sakshi

4 మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 10) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ ప్రత్యర్ధి ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (78 బంతుల్లో 95 నాటౌట్‌; 9 ఫోర్లు, సిక్స్‌) సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోర్‌ సాధించగలిగింది.

లివింగ్‌స్టోన్‌కు బట్లర్‌ (30), మొయిన్‌ అలీ (33), సామ్‌ కర్రన్‌ (42) తోడ్పాటునందించడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో లివింగ్‌స్టోన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కష్టాల్లో ఉన్నప్పుడు (12.1 ఓవర్లలో 55/5) ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన లివింగ్‌స్టోన్‌ ఎంతో బాధ్యతాయుతంగా ఆడి కెరీర్‌లో తొలి సెంచరీకి చేరువగా వచ్చాడు.

ఇన్నింగ్స్‌ ఆఖరి రెండు బంతులు ఎదుర్కొనే అవకాశం లివింగ్‌స్టోన్‌కు వచ్చినప్పటికీ అతను 4 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. దీంతో శతకానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 4.2 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ టాప్‌-3 బ్యాటర్లను పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించిన బౌల్ట్‌ మొత్తంగా ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసి 3 వికెట్లు పడగొట్టగా.. సౌథీ 2, హెన్రీ, సాంట్నర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 19 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే డేవిడ్‌ విల్లే.. ఫిన్‌ అలెన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.  అయినప్పటికీ ఏమాత్రం తగ్గని విల్‌ యంగ్‌.. విల్లే వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో తొలి 3 బంతులను బౌండరీలుగా మలచి సత్తా చాటాడు. యంగ్‌ (17), కాన్వే (1) క్రీజ్‌లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement