
Photo Courtesy: BCCI/IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో వివిధ ఫ్రాంఛైజీ యజమానుల తీరు భిన్నంగా ఉంటుంది. అయితే గత సీజన్లో వివాదాస్పదంగా నిలిచి వార్తలలోకి ఎక్కిన యజమాని ఎవరంటే.. నిస్సందేహంగా లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజయ్ గోయెంకా(Sanjeev Goenka)నే. గత సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓడిపోయిన తర్వాత గోయెంకా స్టేడియంలోనే నిలబడి రాహుల్‌పై విమర్శలు గుప్పించారు.
నాటి కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul)తో గోయెంకా చేసిన ఈ యానిమేటెడ్ చాట్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. గోయెంకా వ్యవహార శైలిపై అప్పట్లో అనేకమంది విమర్శలు గుప్పించారు. దీని ఫలితంగా చివరికి రాహుల్ ఫ్రాంచైజ్ నుంచి తప్పుకొన్నాడనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.
రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు
తర్వాత మెగా వేలంలో భారత్ వికెట్టుకీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను లక్నో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు ఖర్చు కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. కానీ ఈ వికెట్ కీపర్-బ్యాటర్ తన పూర్వ ఫ్రాంచైజ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో తడబడ్డాడు. పంత్ ఆరు బంతులు ఆడి చివరికి తన ఖాతాను కూడా తెరవకుండా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్ లో లక్నో పరాజయం చవిచూసిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా మళ్ళీ అదే రీతిలో కెప్టెన్ పంత్, ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్‌తో సమావేశమయ్యారు.
Hyderabad conquered ✅
Win secured ✅#LSG get their first 𝐖 of #TATAIPL 2025 with a comfortable victory over #SRH 💙
Scorecard ▶ https://t.co/X6vyVEvxwz#SRHvLSG | @LucknowIPL pic.twitter.com/7lI4DESvQx— IndianPremierLeague (@IPL) March 27, 2025
ఈసారి వీరి సంభాషణ కొద్దిగా స్నేహపూర్వకంగా వాతావరణంలో జరిగినట్లు కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు గోయెంకా మాజీ కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో చేసిన వివాదాస్పద సంభాషణ తో పోలుస్తూ ఈ వీడియో ని బాగా వైరల్ చేసారు.
పంత్‌ను గట్టిగా కౌగిలించుకొని
అయితే ఈసారి కథనం నాటకీయ మలుపు తీసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై లక్నో పూర్తి ఆధిపత్యం చెలాయించి సొంత గడ్డ పై ప్రత్యర్థి ని అయిదు వికెట్ల తేడాతో.. అదీ ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే ఓడించింది. దీంతో గోయెంకా ఆనందాన్ని పట్టలేక కెప్టెన్ రిషబ్ పంత్‌ను గట్టిగా కౌగిలించుకోవడం కనిపించింది.
గత సంవత్సరం రాహుల్ కెప్టెన్సీలో ఇదే జట్టుపై ఓటమి తర్వాత గోయెంకా జరిపిన సంభాషణకు.. తాజా దృశ్యాలు పూర్తి విరుద్ధంగా కనిపించాయి. గోయెంకా ప్రవర్తనలో ఈ మార్పును అభిమానులు గ్రహించి సోషల్ మీడియాలో ఈ సంభాషను పోలుస్తూ మీమ్‌లతో ముంచెత్తారు.
ఈ సందర్భంగా భారత మాజీ పేసర్, లక్నో బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ కూడా నవ్వుతూ కనిపించారు. ఈ విజయం లక్నో ఫ్రాంచైజ్ లోని అందరికీ చాలా ఉపశమనం ఇచ్చినట్టు స్పష్టంగా కనిపించింది.
Sanjiv Goenka gives a tight hug to Rishabh Pant. pic.twitter.com/yHcnCCmxXP
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2025
వ్యక్తిగత ఒడిదుడుకుల మధ్య పంత్ కెప్టెన్సీ
తన జట్టును విజయపథంలో నడిపించినప్పటికీ, రిషబ్ పంత్ బ్యాటింగ్ ఫామ్ ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. వ్యక్తిగతంగా చూస్తే తన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన పంత్ ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 15 పరుగులు చేసాడు. అయితే, బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ పై ముందుగా బౌలింగ్ చేయాలన్న పంత్ దృఢ సంకల్పం అతని నాయకత్వ ధోరణిని చెప్పకనే చెబుతుంది.
చదవండి: Kavya Maran: క్యాచ్ డ్రాప్.. చిన్న పిల్లలా కేరింతలు.. కానీ పాపం ఆఖరికి!