SRH vs LSG
-
SRH: ‘రోడ్ల’ మీద బౌలింగ్ చేయించడం మానుకోండి: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ (Michael Vaughan) కీలక సూచనలు చేశాడు. ‘రోడ్ల’పై బౌలింగ్ చేయించే వైఖరికి స్వస్తి పలకాలని.. బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదని హితవు పలికాడు. మేటి బౌలర్లు జట్టులో ఉన్నా.. బౌలింగ్ కోసం స్పెషలిస్టు బ్యాటర్ల మీద ఆధారపడాల్సిన దుస్థితి ఇందుకు నిదర్శమని పేర్కొన్నాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సన్‌రైజర్స్ తమ ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. సొంత మైదానం ఉప్పల్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై 286 పరుగులు స్కోరు చేసింది. అయితే, రాయల్స్ కూడా అంత తేలికగ్గా తలవంచలేదు. 242 రన్స్ చేసింది.రైజర్స్‌కు చేదు అనుభవంఇక రెండో మ్యాచ్‌లో మాత్రం రైజర్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో ఉప్పల్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో కమిన్స్ బృందం 190 పరుగులకే కుప్పకూలింది. మరోవైపు.. రైజర్స్ బ్యాటింగ్ పవర్ రుచిని వారికే చూపిస్తూ.. ఆట అంటే ఇట్టా ఉండాలి అన్నట్లుగా లక్నో స్టార్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఈ పవర్ హిట్టర్‌ను కట్టడి చేయాలని రైజర్స్ బౌలర్లు ఎంతగా కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. 26 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. ఆఖరికి కమిన్స్ అద్భుత బంతితో అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఎట్టకేలకు సన్‌రైజర్స్‌కు బ్రేక్ దొరికింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 16.1 ఓవర్లలోనే లక్నో లక్ష్యాన్ని ఛేదించింది.Raining sixes in Hyderabad... but by #LSG 🌧Nicholas Pooran show guides LSG to 77/1 after 6 overs 👊Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @LucknowIPL pic.twitter.com/K2Dlk5AXQw— IndianPremierLeague (@IPL) March 27, 2025 400కు పైగా పరుగులుఇక తొలి రెండు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ బ్యాటర్ల గురించి పక్కనపెడితే.. బౌలర్లు మాత్రం బాధితులుగా మిగిలిపోయారు. మహ్మద్ షమీ, కమిన్స్, హర్షల్ పటేల్, ఆడం జంపా.. ఇలా జట్టులోని బౌలింగ్ విభాగం అంతా కలిసి ఇప్పటికే 400 (242, 193)కు పైగా పరుగులు సమర్పించుకున్నారు.కాగా లక్నోతో మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కూడా బౌలింగ్‌కు రావడం గమనార్హం. అతడు ఒకే ఒక్క బంతి వేయగా ప్రత్యర్థి బ్యాటర్ ఫోర్ బాదాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ మైకేల్ వాన్ మాట్లాడుతూ.. ‘‘ఎస్ఆర్హెచ్ ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి.తమ బౌలర్లు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్లు రోడ్లమీద బౌలింగ్ చేస్తున్నారు. జంపా ఆటను నాశనం చేశారు. షమీ ఓవర్‌కు 12 పరుగుల చొప్పున ఇచ్చాడు. అందుకే సన్‌రైజర్స్ జాగ్రత్త పడాలి.రోడ్ల మీద బౌలింగ్ చేయించడం మానుకోండిసొంత మైదానంలో రోడ్ల మీద బౌలింగ్ చేయించే పనులు మానుకోవాలి. ఇది ఇలాగే కొనసాగితే వేరే వేదికలపై మీ బౌలర్లు రాణించలేరు. అప్పటికే వాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోయి.. వేరే చోట బౌలింగ్ చేయాలంటే భయపడిపోయే స్థితికి వస్తారు’’ అని వాన్ చురకలు అంటించాడు.ఇక లక్నోతో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తో బ్యాటింగ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘నాకు తెలిసి కమిన్స్‌కు కొత్త బౌలర్ దొరికి ఉంటాడు. వాళ్లు సొంత గ్రౌండ్లో ఐదో మ్యాచ్ ఆడే సరికి ఇషాన్ కిషన్ మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వస్తదేమో!.. ఎందుకంటే మిగతా బౌలర్లు ..‘ఈ రోడ్ల మీద మేము బౌలింగ్ చేయలేము అని చేతులెత్తేస్తారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. క్రిక్‌బజ్ షోలో ఈ మేరకు వాన్ వ్యాఖ్యలు చేశాడు.చదవండి: BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు వార్షిక కాంట్రాక్టులు! -
అది ప్రపంచంలోనే బెస్ట్ వికెట్.. వాళ్లు అద్భుతంగా ఆడారు: కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తొలి ఓటమి ఎదురైంది. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన కమిన్స్ బృందం.. రెండో మ్యాచ్‌లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచింది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది.ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) మాట్లాడుతూ.. ఉప్పల్ పిచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మొన్నటికి.. ఇప్పటికి వికెట్ వేరుగా ఉంది. నిజానికి మేము మరికొన్ని పరుగులు చేయాల్సింది.ప్రపంచంలోనే అత్యుత్తమ పిచ్గత మ్యాచ్‌లోని పిచ్ ప్రపంచంలోనే అత్యుత్తమ పిచ్. ఇక ఈ మ్యాచ్‌లో మేము 190 పరుగులు చేయగలడం సానుకూల అంశమే. ఈరోజు వికెట్ బాగానే ఉంది. దీనిని రెండో అత్యుత్తమ పిచ్‌గా చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు.కాగా సొంతమైదానం ఉప్పల్‌లో తొలుత రాజస్తాన్ రాయల్స్‌తో తలపడిన సన్‌రైజర్స్.. 286 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో రాయల్స్‌ను 242 పరుగులకే కట్టడి చేసి.. 44 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. కానీ గురువారం సీన్ రివర్స్ అయింది.లక్నోతో మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి రైజర్స్ 190 పరుగులకే పరిమితమైంది. ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47), నితీశ్ రెడ్డి (28 బంతుల్లో 32), క్లాసెన్ (17 బంతుల్లో 26), కమిన్స్ (4 బంతుల్లో 18) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. యువబ్యాటర్ అనికేత్ వర్మ (Aniket Verma) మాత్రం అద్భుత ఇన్నింగ్స్(13 బంతుల్లో 36) ఆడాడు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఉత్తమంగా (4/34) రాణించాడు. 3⃣6⃣ runs5⃣ massive sixes 🔥Aniket Verma's explosive cameo gave #SRH the much-needed late flourish 🧡Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @SunRisers pic.twitter.com/21gh3f2jZR— IndianPremierLeague (@IPL) March 27, 2025 ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోను రైజర్స్ బౌలర్ల కట్టడి చేయలేకపోయారు. ఆరంభంలోనే ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్(1)ను అవుట్ చేసినా.. మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52), నికోలస్ పూరన్(26 బంతుల్లో 72)ల దూకుడుకు కళ్లెం వేయలేకపోయారు. వీరి అద్భుత అర్ధ శతకాల కారణంగా లక్నో 16.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి గెలుపొందింది.లక్నో బ్యాటర్లు అద్భుతంగా ఆడారుఈ క్రమంలో ఓటమి తర్వాత ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘లక్నో బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. వాళ్ల బౌలర్లు కూడా రాణించారు. ఏదేమైనా మేము 190 పరుగులు స్కోరు చేయడం మంచి విషయమే. ప్రతి మ్యాచ్ సరికొత్తగానే ఉంటుంది. గత మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ శతకంతో చెలరేగాడు.ఈసారి అతడు డకౌట్ అయ్యాడంటే.. అది లక్నో బౌలర్ల ప్రతిభ వల్లే. వారు మాకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. ఇలాంటివి ఆటలో సహజం. దీనికే మేము కుంగిపోవాల్సిన పనిలేదు. మా జట్టులో ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. వారిలో ఒకరో ఇద్దరో కచ్చితంగా ప్రభావం చూపిస్తారు. అయితే, ఈరోజు మేము మరింత గొప్పగా ఆడాల్సింది.తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడతాంటోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. ఈ పరాజయం నుంచి త్వరగా కోలుకుని.. తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడతాం’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కమిన్స్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో పాటు.. కీలకమైన మార్ష్, పూరన్‌ల వికెట్లను దక్కించుకున్నాడు. ఇక తదుపరి సన్‌రైజర్స్ ఆదివారం (మార్చి 30) ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఇందుకు ఢిల్లీ సెకండ్ హోం గ్రౌండ్ విశాఖపట్నంలోని డాక్టర్ వైస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక.చదవండి: BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు వార్షిక కాంట్రాక్టులు! -
మొన్న అలా.. ఇప్పుడిలా! లక్నో జట్టు యజమాని చర్య వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో వివిధ ఫ్రాంఛైజీ యజమానుల తీరు భిన్నంగా ఉంటుంది. అయితే గత సీజన్లో వివాదాస్పదంగా నిలిచి వార్తలలోకి ఎక్కిన యజమాని ఎవరంటే.. నిస్సందేహంగా లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజయ్ గోయెంకా(Sanjeev Goenka)నే. గత సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓడిపోయిన తర్వాత గోయెంకా స్టేడియంలోనే నిలబడి రాహుల్‌పై విమర్శలు గుప్పించారు.నాటి కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul)తో గోయెంకా చేసిన ఈ యానిమేటెడ్ చాట్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. గోయెంకా వ్యవహార శైలిపై అప్పట్లో అనేకమంది విమర్శలు గుప్పించారు. దీని ఫలితంగా చివరికి రాహుల్ ఫ్రాంచైజ్ నుంచి తప్పుకొన్నాడనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు తర్వాత మెగా వేలంలో భారత్ వికెట్టుకీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను లక్నో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు ఖర్చు కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. కానీ ఈ వికెట్ కీపర్-బ్యాటర్ తన పూర్వ ఫ్రాంచైజ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో తడబడ్డాడు. పంత్ ఆరు బంతులు ఆడి చివరికి తన ఖాతాను కూడా తెరవకుండా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో లక్నో పరాజయం చవిచూసిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా మళ్ళీ అదే రీతిలో కెప్టెన్ పంత్, ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్‌తో సమావేశమయ్యారు.Hyderabad conquered ✅Win secured ✅#LSG get their first 𝐖 of #TATAIPL 2025 with a comfortable victory over #SRH 💙Scorecard ▶ https://t.co/X6vyVEvxwz#SRHvLSG | @LucknowIPL pic.twitter.com/7lI4DESvQx— IndianPremierLeague (@IPL) March 27, 2025ఈసారి వీరి సంభాషణ కొద్దిగా స్నేహపూర్వకంగా వాతావరణంలో జరిగినట్లు కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు గోయెంకా మాజీ కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో చేసిన వివాదాస్పద సంభాషణ తో పోలుస్తూ ఈ వీడియో ని బాగా వైరల్ చేసారు.పంత్‌ను గట్టిగా కౌగిలించుకొనిఅయితే ఈసారి కథనం నాటకీయ మలుపు తీసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై లక్నో పూర్తి ఆధిపత్యం చెలాయించి సొంత గడ్డ పై ప్రత్యర్థి ని అయిదు వికెట్ల తేడాతో.. అదీ ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే ఓడించింది. దీంతో గోయెంకా ఆనందాన్ని పట్టలేక కెప్టెన్ రిషబ్ పంత్‌ను గట్టిగా కౌగిలించుకోవడం కనిపించింది. గత సంవత్సరం రాహుల్ కెప్టెన్సీలో ఇదే జట్టుపై ఓటమి తర్వాత గోయెంకా జరిపిన సంభాషణకు.. తాజా దృశ్యాలు పూర్తి విరుద్ధంగా కనిపించాయి. గోయెంకా ప్రవర్తనలో ఈ మార్పును అభిమానులు గ్రహించి సోషల్ మీడియాలో ఈ సంభాషను పోలుస్తూ మీమ్లతో ముంచెత్తారు. ఈ సందర్భంగా భారత మాజీ పేసర్, లక్నో బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ కూడా నవ్వుతూ కనిపించారు. ఈ విజయం లక్నో ఫ్రాంచైజ్ లోని అందరికీ చాలా ఉపశమనం ఇచ్చినట్టు స్పష్టంగా కనిపించింది.Sanjiv Goenka gives a tight hug to Rishabh Pant. pic.twitter.com/yHcnCCmxXP— Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2025 వ్యక్తిగత ఒడిదుడుకుల మధ్య పంత్ కెప్టెన్సీతన జట్టును విజయపథంలో నడిపించినప్పటికీ, రిషబ్ పంత్ బ్యాటింగ్ ఫామ్ ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. వ్యక్తిగతంగా చూస్తే తన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన పంత్ ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 15 పరుగులు చేసాడు. అయితే, బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ పై ముందుగా బౌలింగ్ చేయాలన్న పంత్ దృఢ సంకల్పం అతని నాయకత్వ ధోరణిని చెప్పకనే చెబుతుంది.చదవండి: Kavya Maran: క్యాచ్ డ్రాప్.. చిన్న పిల్లలా కేరింతలు.. కానీ పాపం ఆఖరికి! -
Kavya Maran: క్యాచ్ డ్రాప్.. చిన్న పిల్లలా కేరింతలు.. కానీ పాపం ఆఖరికి!
సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మరోసారి బ్యాటింగ్ పవర్ చూపిస్తుందనుకుంటే.. ఆరెంజ్ ఆర్మీకి నిరాశే మిగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో మ్యాచ్.. ఈసారి మూడు వందలు పక్కా అని మురిసిపోయిన అభిమానులు.. రైజర్స్ కనీసం 200 పరుగుల స్కోరు దాటకపోవడంతో ఉసూరుమన్నారు.ఈసారి బౌలర్లను నమ్ముకుందాంపర్లేదు.. ఈసారి బౌలర్లను నమ్ముకుందాం.. నామమాత్రపు స్కోరును మన కెప్టెన్ కమిన్స్ మామ, షమీ భయ్యా, హర్షల్ అన్న.. జంపా మావ కాపాడుతారులే అని సరిపెట్టుకున్నారు. కానీ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కట్టడి చేయడంలో వీళ్లంతా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఫలితంగా రైజర్స్ ఓటమిపాలు కాగా.. ఆరెంజ్ ఆర్మీ హృదయం ముక్కలైంది.లీగ్ మ్యాచ్.. అందులోనూ ఈ సీజన్లో రెండోదే అయినప్పటికీ హోం గ్రౌండ్లో రైజర్స్.. తమదైన శైలి బ్యాటింగ్‌ను.. ప్రత్యర్థి తమపైనే ప్రయోగించి సఫలం కావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇక ఈ మ్యాచ్ ఆసాంతం అభిమానులు కూడా భావోద్వేగ డోలికల్లో తేలిపోయారు.కావ్యా మారన్ ఎమోషనల్ రోలర్కోస్టర్ఓసారి సంతోషం.. మరోసారి బాధ.. ఆఖరికి ఓటమి.. ఇలా ప్రతి సమయంలో తమ భావాలను వ్యక్తం చేస్తూ కెమెరాలకు చిక్కారు. సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ (Kavya Maran) కూడా ఇందుకు అతీతం కాదు. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ముగిసేంత వరకు ఆమె హావభావాలను కెమెరా కన్ను ఒడిసిపట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వీక్షకులను ఆకర్షించాయి.ట్రవిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను లక్నో ఫీల్డర్లు డ్రాప్ చేసినప్పుడు చిన్నపిల్లలా గంతులేసిన కావ్య.. అతడు అవుట్ కాగానే బుంగమూతి పెట్టుకుంది. హెన్రిచ్ క్లాసెన్ రనౌట్ కాగానే ఆమె కోపం కట్టలుతెంచుకుంది. ఇక లక్ష్య ఛేదనలో లక్నో సూపర్‌స్టార్ నికోలస్ పూరన్ పవర్ ప్లేలోనే విశ్వరూపం చూపించడంతో.. కావ్య తీవ్ర నిరాశకు గురైంది.Kavya maran has more expressions than all bollywood heroines combined 🔥❤️Kavya maran >>heroines pic.twitter.com/IWzfyIQZI7— Mask 🎭 (@Mr_LoLwa) March 27, 2025 తమ బౌలింగ్‌ను చితక్కొడుతూ పూరన్ ఉప్పల్‌లో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో కావ్య నెత్తికి చేతులు పెట్టుకుంది. సాధారణంగా తమ బ్యాటర్ల నుంచి వచ్చే ఈ పవర్ఫుల్ ఇన్నింగ్స్.. ప్రత్యర్థి నుంచి రావడం చూడలేక ముఖం తిప్పేసుకుంది. అప్పుడు ఇలా ఆనందంఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక గత మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై రైజర్స్ ఘన విజయం సాధించగా.. కావ్యా ఆనందంతో గంతులేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.An epic run-fest goes the way of @SunRisers 🧡The Pat Cummins-led side registers a 4️⃣4️⃣-run win over Rajasthan Royals 👏Scorecard ▶ https://t.co/ltVZAvInEG#TATAIPL | #SRHvRR pic.twitter.com/kjCtGW8NdV— IndianPremierLeague (@IPL) March 23, 2025లక్నోతో మ్యాచ్ విషయానికొస్తే..కాగా గురువారం ఉప్పల్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ(6)తో పాటు గత మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదిన ఇషాన్ కిషన్ (0) ఈసారి పూర్తిగా విఫలమయ్యాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47) తనదైన షాట్లతో కాసేపు అలరించగా.. నితీశ్ రెడ్డి(28 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించాడు.అయితే, జోరు మీదున్న హెన్రిక్ క్లాసెన్ (17 బంతుల్లో 26) రనౌట్ కాగా.. తుపాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన అనికేత్ వర్మ (13 బంతుల్లో 36)కు దిగ్వేశ్ రాఠీ చెక్ పెట్టాడు. శార్దూల్ ఠాకూర్ ఫోర్ఆఖర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఆవేశ్ ఖాన్ అతడికి కళ్లెం వేశాడు. ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో రైజర్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులే చేయగలిగింది.లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు.. లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు రైజర్స్ పేసర్ మహ్మద్ షమీ.. ఐడెన్ మార్క్రమ్(1)ను ఆదిలోనే అవుట్ చేసి షాకిచ్చాడు.పూరన్‌ను పూనకాలుఅయితే, మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52), నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70) ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో రైజర్స్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి అర్ధ శతకాలతో దుమ్ములేపారు. ఈ క్రమంలో 16.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేసిన లక్నో.. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: IPL 2025: నికోలస్ పూరన్ ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైరల్ -
మా బెస్ట్ ఇవ్వలేకపోయాం.. గెలిచినందుకు సంతోషం: పంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరైన రైజర్స్‌కే షాకిస్తూ.. సొంతమైదానంలోనే కమిన్స్ బృందానికి చుక్కలు చూపించింది. బిగ్ రిలీఫ్ఇటు బౌలర్లు.. అటు బ్యాటర్లు.. సమిష్టి ప్రదర్శనతో రాణించగా.. లక్నో కెప్టెన్‌గా టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌కు తొలి గెలుపు దక్కింది. ఈ నేపథ్యంలో విజయానంతరం పంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నిజంగా మాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే ఫలితం ఇది. గెలిచినప్పుడు పొంగిపోయి.. ఓడినపుడు కుంగిపోయే రకం మేము కాదు. జట్టుగా మా నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెడతాం. మా మెంటార్ ప్రతిసారీ ఇదే చెబుతారు. మన పరిధిలో ఉన్న అంశాల గురించి మాత్రమే ఆలోచించాలని.. వాటి ద్వారా లబ్ది పొందేందుకు అత్యుత్తమ మార్గాలు అన్వేషించాలని అంటారు. ఈరోజు నేను అదే చేశాను.మా బెస్ట్ ఇవ్వలేకపోయాం.. పర్లేదు గెలిచాంమా బౌలర్లు ప్రిన్స్, ఠాకూర్ అద్భుతంగా ఆడారు. ఇక పూరన్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడిని మూడో స్థానంలో ఆడిస్తే బాగుంటుందని అనుకున్నాం. తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఈరోజు అతడు అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.మా జట్టు మొత్తం రాణించింది. మా స్థాయికి తగ్గ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాం. అయినప్పటికీ గెలుపొందినందుకు సంతోషంగా ఉంది’’ అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో లక్నో తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. విశాఖపట్నంలో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. వికెట్ కీపర్‌గా పంత్ చేసిన తప్పిదం కారణంగా భారీ మూల్యమే చెల్లించుకుంది.రైజర్స్ దూకుడుకు లక్నో బౌలర్ల కళ్లెం ఈ నేపథ్యంలో తాజాగా తదుపరి సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ఆడిన లక్నో ఉప్పల్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. సొంత గ్రౌండ్లో రైజర్స్ బ్యాటింగ్ సత్తా ఏమిటో తెలిసీ పంత్ ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే, కెప్టెన్ నమ్మకాన్ని లక్నో బౌలర్లు నిలబెట్టారు.రైజర్స్ పవర్ హిట్టర్లు అభిషేక్ శర్మ(6), ఇషాన్ కిషన్(0)లను శార్దూల్ ఠాకూర్ వెనువెంటనే పెవిలియన్‌కు పంపగా.. ప్రమాదకర బ్యాటర్లు ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 47)ను అవుట్ చేసిన ప్రిన్స్ యాదవ్.. హెన్రిచ్ క్లాసెన్(26)ను రనౌట్‌గా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో అనికేత్ వర్మ(13 బంతుల్లో 36) మెరుపులు మెరిపించగా.. దిగ్వేశ్ రాఠీ అతడిని అవుట్ చేశాడు.అయితే, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (4 బంతుల్లో 18) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి స్కోరును 200 దాటించే ప్రయత్నం చేయగా.. ఆవేశ్ ఖాన్ అతడి దూకుడుకు కళ్లెం వేశాడు. ఈ క్రమంలో రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ (4/34) నాలుగు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నికోలస్ పూరన్ తుపాన్ ఇన్నింగ్స్‌ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52) లక్నోకు శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్(1) మరోసారి విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ తుపాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం 26 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో డేవిడ్ మిల్లర్ (7 బంతుల్లో 13), అబ్దుల్ సమద్ (8 బంతుల్లో 22) ధనాధన్ బ్యాటింగ్‌తో అజేయంగా నిలిచి లక్నోను విజయతీరాలకు చేర్చారు.ఐపీఎల్-2025: సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో👉వేదిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్👉టాస్: లక్నో.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 190/9 (20)👉లక్నో స్కోరు: 193/5 (16.1)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై లక్నో గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శార్దూల్ ఠాకూర్ (4/34).చదవండి: IPL 2025: 13 బంతుల్లో విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ నయా హీరో! ఎవరీ అనికేత్? Hyderabad conquered ✅Win secured ✅#LSG get their first 𝐖 of #TATAIPL 2025 with a comfortable victory over #SRH 💙Scorecard ▶ https://t.co/X6vyVEvxwz#SRHvLSG | @LucknowIPL pic.twitter.com/7lI4DESvQx— IndianPremierLeague (@IPL) March 27, 2025 -
300 సాధ్యమే.. లక్నో బ్యాటింగ్ ఆర్డర్ కూడా ప్రమాదకరమైందే: SRH కోచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో తమ ఆరంభ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిన ఈ జట్టు.. రాజస్తాన్ రాయల్స్‌పై 286 పరుగుల స్కోరు నమోదు చేసింది. ఇక తదుపరి మ్యాచ్‌లో భాగంగా గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో రైజర్స్ తలపడనుంది.ఈ నేపథ్యంలో సొంతమైదానం ఉప్పల్ చెలరేగి ఆడే సన్‌రైజర్స్.. 300 పరుగుల మార్కును అందుకుంటుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ విషయంపై సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ (James Franklin) స్పందించాడు.300 సాధ్యమే.. ‘‘ఇలా జరగదని.. నేను ఎన్నటికీ చెప్పను. ఈ సీజన్లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో 230, 240 స్కోర్లు దాటాయి. కాబట్టి తాజా ఎడిషన్‌లో 300 పరుగుల మార్కు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మా జట్టు ఈ స్కోరుకు దగ్గరగా వచ్చింది. కాబట్టి.. 300 స్కోరు అనే మాటను కొట్టిపారేయలేం’’ అని రైజర్స్- లక్నో మ్యాచ్‌కు ముందు ఫ్రాంక్లిన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.లక్నో బ్యాటింగ్ ఆర్డర్ కూడా ప్రమాదకరమైందేఅదే విధంగా లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి ప్రస్తావన రాగా... ‘‘ఎల్ఎస్జీ బ్యాటింగ్ విభాగం ప్రమాదకరమైనది. ఆ జట్టులో టాపార్డర్ బ్యాటర్లు అద్భుతమైన ఆటగాళ్లు. వారిని ఎదుర్కోవాలంటే మూస తరహా వ్యూహాలు సరిపడవు. మేము కాస్త సృజనాత్మకంగా ఆలోచించాల్సి ఉంటుంది. వారి బ్యాటర్లను కట్టడి చేయడానికి మా బౌలింగ్ విభాగం బాగానే కష్టపడాల్సి ఉంటుంది’’ అని జేమ్స్ ఫ్రాంక్లిన్ చెప్పుకొచ్చాడు.కాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు టీమిండియా స్టార్ మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, సిమ్రన్‌జిత్ సింగ్‌లతో సన్‌రైజర్స్ పేస్ దళం పటిష్టంగా ఉంది. మరోవైపు లక్నో జట్టులో ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, కెప్టెన్ రిషభ్ పంత్, డేవిడ్ మిల్లర్ రూపంలో పవర్ హిట్టర్లు ఉన్నారు.ఇక ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలుపొందగా.. లక్నో మాత్రం పరాజయాన్ని చవిచూసింది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో పరాజయం పాలైంది.ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ జట్టుట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, సచిన్ బేబి, జయదేవ్ ఉనాద్కట్, జీషన్ అన్సారీ, ఆడం జంపా, వియాన్ ముల్దర్, రాహుల్ చహర్, కమిందు మెండిస్, అథర్వ టైడే, ఈషన్ మలింగలక్నో సూపర్ జెయింట్స్ జట్టుఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, రిషభ్ పంత్(కెప్టెన్/వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి, మణిమరన్ సిద్ధార్థ్, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, ఆర్ఎస్ హంగ్రేకర్, ఆకాశ్ మహరాజ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, యువరాజ్ చౌదరి, మయాంక్ యాదవ్.చదవండి: ‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా? ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు’