Rashid Khan Helicopter Shot Video: Rashid Khan Outrageous Helicopter Six Became Viral In T20 Blast Tourney - Sakshi
Sakshi News home page

Rashid Khan: రషీద్‌ ఖాన్‌ హెలికాప్టర్‌ సిక్స్‌.. వీడియో వైరల్‌

Published Wed, Aug 25 2021 11:26 AM | Last Updated on Wed, Aug 25 2021 5:24 PM

Rashid Khan Outrageous Helicopter Six Became Viral In T20 Blast Tourney - Sakshi

లండన్‌: అఫ్గనిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అదరగొట్టాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్‌ ఖాన్‌ యార్క్‌షైర్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ కొట్టిన హెలికాప్టర్‌ సిక్స్‌ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. జోర్డాన్‌ థాంప్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ఆఫ్‌ స్టంప్‌ మీదుగా రషీద్‌ హెలకాప్టర్‌ సిక్స్‌ కొట్టాడు.  అతని షాట్‌లో ఎంత కచ్చితత్వం అంటే ఫీల్డర్‌కు బంతి దొరికే చాన్స్‌ కూడా ఇవ్వకుండా గ్యాలరీలో పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓవరాల్‌గా రషీద్‌ 9 బంతులాడి మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 27 పరుగులు సాధించాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన  యార్క్‌షైర్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. టామ్‌ కాడ్‌మోర్‌ 55, బాలన్స్‌ 55 పరుగులు చేశారు.  ససెక్స్‌ బౌలింగ్‌లో టైమల్‌ మిల్స్‌ 3, రషీద్‌ ఖాన్‌, లెన్హమ్‌, జార్జ్‌ గార్టన్‌, క్రిస్‌ జోర్డాన్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ససెక్స్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్‌ లూక్‌ రైట్‌ 54 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రషీద్‌ ఖాన్‌ 27, డిల్‌రే రావ్‌లిన్స్‌ 27 పరుగులు చేశారు.

ఈ విజయంతో ససెక్స్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలనతో రషీద్‌ ఖాన్‌ తన కుటుంబం గురించి ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. తన కుటుంబాన్ని తాలిబన్ల నుంచి కాపాడడంటూ కామెంట్స్‌ చేశాడు. ఇక పాకిస్తాన్‌, అఫ్గన్‌ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌ నిరవధిక వాయిదా పడింది. 

చదవండి: తాలిబన్ల మధ్యే కుటుంబం: పీటర్సన్‌ వద్ద రషీద్‌ ఆవేదన

Virat Kohli- James Anderson: రవిశాస్త్రి ఏం జరిగినా పట్టించుకోడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement