![England Farmer Captain Ray Illingworth Passes away aged 89 - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/26/engalnd.jpg.webp?itok=hFXxuv4o)
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ రే ఇల్లింగ్‌వర్త్(89) శనివారం కన్నుమూశారు. ఆయన ఆనరోగ్యంతో మరణించినట్లు యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ట్విటర్‌లో తెలిపింది. ఇంగ్లండ్ తరుపున 61 టెస్టులు ఆడిన ఇల్లింగ్‌వర్త్ 1836 పరుగులతో పాటు, 122 వికెట్లు పడగొట్టాడు. 1971లో అతని సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.
అదే విధంగా యార్క్‌షైర్ జట్టుకు మూడు సార్లు టైటిల్‌ను అందించారు. ఆయన క్రికెట్‌కు రిటైర్మంట్ ప్రకటించిన తర్వాత కూడా పలు రకాలగా ఇంగ్లండ్ జట్టుకు సేవలందించాడు. "రే ఇల్లింగ్‌వర్త్ మరణవార్త విన్నాక చాలా బాధ పడ్డాము. అతని కుటంబానికి మా అండదండలు ఎప్పడూ ఉంటాయి అని యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ట్విటర్‌లో పేర్కొంది.
చదవండి: India Vs SA: భారత ఆభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త కెప్టెన్ వచ్చేస్తున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment