తిరుమల: సంప్రదాయ దుస్తులు లేకున్నా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి ఓ భక్తురాలిని అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ బ్రేక్ దర్శనం, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు సంప్రదాయ దుస్తులతో దర్శనానికి వెళ్లాలి. పురుషులైతే ధోతీ/కుర్తా పైజమా ధరించాలి.
స్త్రీలైతే పంజాబీ డ్రెస్, లంగా వోణీ, చీరలు ధరించి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే వైకుంఠంలో పనిచేసే టీటీడీ, విజిలెన్స్ అధికారులు తాము అనుకుంటే ఎలాగైనా దర్శనానికి అనుమతిస్తామని సోమవారం రుజువు చేశారు. ఓ మహిళ టీ షర్టు, నైట్ ప్యాంటు వేసుకుని వీఐపీ బ్రేక్ దర్శనానికి రావడం.. ఆమెను అనుమతించడం పలు విమర్శలకు దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment