t shirt
-
డ్రెస్ కోడ్ ‘గోవిందా.. గోవింద..!’
తిరుమల: సంప్రదాయ దుస్తులు లేకున్నా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి ఓ భక్తురాలిని అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వీఐపీ బ్రేక్ దర్శనం, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు సంప్రదాయ దుస్తులతో దర్శనానికి వెళ్లాలి. పురుషులైతే ధోతీ/కుర్తా పైజమా ధరించాలి. స్త్రీలైతే పంజాబీ డ్రెస్, లంగా వోణీ, చీరలు ధరించి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే వైకుంఠంలో పనిచేసే టీటీడీ, విజిలెన్స్ అధికారులు తాము అనుకుంటే ఎలాగైనా దర్శనానికి అనుమతిస్తామని సోమవారం రుజువు చేశారు. ఓ మహిళ టీ షర్టు, నైట్ ప్యాంటు వేసుకుని వీఐపీ బ్రేక్ దర్శనానికి రావడం.. ఆమెను అనుమతించడం పలు విమర్శలకు దారి తీసింది. -
టీ షర్ట్స్ వేసుకున్నందుకు అరెస్టు చేశారు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: రేవంత్,అదానీ వ్యవహారంపై ఎండగట్టేందుకు అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణభవన్‌లో ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా సోమవారం(డిసెంబర్ 9) కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.టీ షర్ట్స్ ధరించి అసెంబ్లీ లోపలికి రావొద్దన్న కారణంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారన్నారు. హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందన్నారు.తెలంగాణ వనరులను అదానీకి దోచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రేవంత్,అదానీల చీకటి ఒప్పందాలపై రాహుల్ గాంధీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిర్బంధాలు,దాడులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందన్నారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్ నేతల టీ షర్ట్స్పై రేవంత్ ఫొటో.. తీవ్ర ఉద్రిక్తత -
USA Presidential Elections 2024: ‘ట్రంప్ ధిక్కార’ టీ షర్టుల జోరు
బ్యాంకాక్: అటు తూటాల వర్షం. ఇటు చెవి నుంచి చెంప మీదుగా బొటబొటా కారుతున్న రక్తం. అంతలోకే రక్షణ వలయంగా కమ్ముకున్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది. అంతటి భీతావహ పరిస్థితిలోనూ పిడికిలి గట్టిగా బిగించి పైకెత్తి ‘పోరాటమే’నంటూ గొంతెత్తి నినాదాలు. ట్రంప్‌పై దాడి జరిగిన క్షణాలకు శాశ్వతత్వం కలి్పంచిన ఫొటో ఇది. హత్యాయత్నం నుంచి త్రుటిలో బయటపడ్డ క్షణాల్లో కూడా ట్రంప్ ఆత్మనిబ్బరానికి, ఆయన ప్రదర్శించిన సాహసానికి ప్రతీకగా నిలిచిన ఈ ఫొటో అప్పుడే టీ షర్టులపైకి కూడా ఎక్కింది. అది కూడా దాడి జరిగిన రెండు గంటల్లోపే! అంత తక్కువ సమయంలోనే టావోబావో, జేడీ.కామ్ వంటి చైనా ఈ కామర్స్ దిగ్గజాలు ఆన్లైన్ దుకాణాలు ఆ ఫొటోలతో కూడిన టీ షర్టులను తయారు చేయడం, ఇ–కామర్స్ ప్లాట్‌ఫాంల్లో అమ్మకానికి పెట్టడం చకచకా జరిగిపోయాయి! వాటికి చూస్తుండగానే చైనా, అమెరికాల నుంచి 2,000 పై చిలుకు ఆర్డర్లు వచ్చాయి! -
పెరిగిన ట్రంప్ క్రేజ్.. ‘ఫైట్ ఫైట్’ టీషర్ట్‌లకు ఫుల్ డిమాండ్
న్యూయార్క్: అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు జరగడం సంచలనం రేపింది. ఈ ఘటనలో ట్రంప్ చెవికి బుల్లెట్ గాయమై రక్తం చిందింది. బుల్లెట్ కొంచెం పక్కకు తాకి ఉంటే ట్రంప్ ప్రాణాలు పోయేవి. ఇంత జరిగిన తర్వాత కూడా కొద్దిసేపటికే తేరుకున్న ట్రంప్ అదే వేదికపై చేయి పైకి లేపి ఫైట్ఫైట్ అని నినదించడం అందరినీ ఆకర్షించింది.ర్యాలీకి హాజరైన వారంతా ట్రంప్‌నకు మద్దతుగా నినాదాలు చేశారు. పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు సరిగ్గా శనివారం(జులై13) సాయంత్రం 6.30 గంటలకు జరిగాయి.ఘటనపై అధ్యక్షుడు బైడెన్ 8 గంటలకు స్పందించారు. ఇదంతా ఇలాఉంటే చైనాలోని రిటైలర్ కంపెనీలు కాల్పుల తర్వాత ట్రంప్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని డిసైడయ్యాయి.100% of profits from this shirt go to Trump’s campaignhttps://t.co/AUeoyZ6XPT pic.twitter.com/eS18aZNl2o— Hodgetwins (@hodgetwins) July 13, 2024 కాల్పులు జరిగిన రెండు గంటల్లోనే చైనాలోని ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ తొవాబో ట్రంప్ చేయి పైకెత్తి ఫైట్ఫైట్ అని నినాదాలు చేసే ఫొటోతో కూడిన టీషర్ట్లను అమ్మకానికి పెట్టింది. ఈ ఉదంతంపై అమెరికా మీడియా కథనాలు ప్రసారం చేసింది. దీనిపై తొవాబో స్పందించింది.‘కాల్పులు జరగ్గానే టీషర్ట్లను ఈ కామర్స్ సైట్లో అమ్మకానికి పెట్టాం. అసలు మేము వాటిని ఇంకా ప్రింట్ కూడా చేయలేదు.అప్పుడే 2000కుపైగా టీషర్ట్‌లకు ఆర్డర్ వచ్చింది’అని తొవాబో తెలిపింది. -
టీషర్ట్స్, చిరిగిన జీన్స్‌తో రావొద్దు.. విద్యార్థులకు కళాశాల ఆదేశాలు
ముంబై: ఇటీవల కళాశాల క్యాంపస్ ఆవరణలో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ నిలిచిన ముంబైలోని ఓకళాశాల తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు కళాశాలకు టీషర్ట్స్, చిరిగిన జీన్స్‌తో రావడాన్ని నిషేధించింది. కొత్త డ్రెస్ కోడ్‌ను విధించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.టీవలే కళాశాలలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కళాశాలకు వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో రావొద్దని ఆదేశించింది. ముంబైలో ఈ సొసైటీ నిర్వహిస్తోన్న ఎన్జీ ఆచార్య , డీకే మరాఠే కళాశాలల్లో చిరిగిన జీన్స్, టీషర్టులు, జెర్సీలతో వస్తే విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేసింది. విద్యార్థులు తప్పనిసరిగా ఫార్మల్, డీసెంట్ దుస్తుల్లో మాత్రమే కళాశాలకు రావాలని ఆదేశించింది.‘విద్యార్థులు క్యాంపస్‌లో ఉన్నప్పుడు ఫార్మల్, డీసెంట్ దుస్తులు ధరించాలి. వారు హాఫ్ షర్ట్ లేదా ఫుల్ షర్ట్ , ప్యాంటు ధరించవచ్చు. అమ్మాయిలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులను ధరించవచ్చు. విద్యార్థులు మతాన్ని లేదా సాంస్కృతిక అసమానతలను చూపించే ఎలాంటి దుస్తులూ ధరించకూడదు. జీన్స్, టీషర్టులు, రివీలింగ్ డ్రెస్సులు, జెర్సీలు ధరించి వస్తే అనుమతించబోము’ అని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసును కళాశాల గేటుకు అంటించింది.అయితే ఈ నిబంధనలపై పలువురు విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త డ్రెస్ కోడ్ గురించి తమకు తెలియదని, జీన్స్, టీ షర్టులు ధరించి ఉండడంతో కాలేజీలోకి రానివ్వడం లేదని కొందరు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు..కాగా ఇదే కళాశాల గతంలో తమ ప్రాంగణంలో హిజాబ్, నఖాబ్, బుర్కా, స్టోల్స్, క్యాప్‌లు, బ్యాడ్జీలపై నిషేధం విధించింది, దీనిపై విద్యార్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే కాలేజీ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని న్యాయమూర్తులు ఎఎస్ చందూర్కర్, రాజేష్ పాటిల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
ప్లాస్టిక్ బాటిల్స్‌తో టీ షర్ట్స్..ఏకంగా రూ. 80 కోట్లు..!
ప్లాస్టిక్ బాటిల్స్‌తో టీ షర్ట్స్ తయారు చేయడం గురించి విన్నారా?. ఔను ఇది నిజం. ఎనిమిది పెట్ బాటిల్స్ ఉంటే ఒక టీ షర్ట్ రెడీ. ఇరవై-ముప్పై బాటిల్స్ ఉంటే జాకెట్, బ్లేజర్ సిద్ధం. ఎంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. పైగా ఎకో లైన్ బ్రాండ్‌తో దుస్తులను మార్కెట్లోకి తీసుకొచ్చి లాభాలను ఆర్జించాడు. నేడు ఏకంగా ఎనభై కోట్ల టర్నోవర్‌గా కంపెనీగా మార్చాడు. అంతేగాదు పర్యావరణాన్ని సంరక్షిస్తూ కూడా కోట్లు గడించొచ్చని చాటి చెప్పాడు. అతడెవరంటే..చెన్నైలో పెట్టి పెరిగిన సెంథిల్ శంకర్ మెకానికల్ ఇంజనీర్. తండ్రి స్థాపించిన శ్రీరంగ పాలిమర్స్‌కి ఎం.డిగా బాధ్యతలు చేపట్టాడు. పాలియెస్టర్ రీసైకిల్ చేస్తున్న సమయంలో అతడికి వచ్చిన ఆలోచనే ఎకోలైన్ దుస్తులు. ఈ ఫ్యాషన్ బ్రాండ్ ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్లో దూసుకుపోతోంది. ఇంతకీ బాటిల్స్‌తో చొక్కాలు ఎలా చేస్తారంటే... ఎలాగంటే..పెట్ బాటిల్స్‌కున్న మూతలు, రేపర్లు తొలగించిన తర్వాత క్రషింగ్ మెషీన్లో వేసి చిన్న ముక్కలు చేయాలి. ఆ ముక్కలను వేడి చేసి కరగబెట్టి ఫైబర్‌గా మార్చాలి. ఈ ఫైబర్ దారాలతో వస్త్రాన్ని రూపొందించాలి. క్లాత్‌తో మనకు కావల్సినట్లు టీ షర్ట్, జాకెట్, బ్లేజర్ వంటి రకరకాలుగా కుట్టుకోవడమే. వీటి ధర కూడా తక్కువే. ఐదు వందల నుంచి ఆరు వేల వరకు ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్లి ఎకోలైన్ అని సెర్చ్ చేయండి అంటున్నారు సెంథిల్.అయితే ఈ వస్త్రాన్ని రీసైకిల్ చేసిన పెట్ బాటిల్స్‌తో తయారు చేసినట్లు ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి తమకు చాలా సమయం పట్టిందన్నారు. దీని కోసం, కస్టమర్‌కు అవగాహన కల్పించడానికి వెబ్సైట్లో మొత్తం మేకింగ్ ప్రక్రియను వీడియో రూపంలో బహిర్గతం చేయల్సి వచ్చిందనిసెంథిల్ చెప్పారు. ఈ లోగా మిగతా కార్పొరేట్ కంపెనీలు పర్యావరణ అనుకూలంగా రూపొందుతున్న ఈ టీ షర్ట్‌లకు మద్దతు ఇవ్వడంతో అనూహ్యంగా కంపెనీ లాభాల బాట పట్టింది.ఇక ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ప్రక్రియలో నీటిని ఆదా చేస్తారే గానీ వృధా కానియ్యరు. అలాగే వీళ్లు ఇందుకోసం బొగ్గును కూడా వినియోగించారు. చాలావరకు 90% సోలార్ ఎనర్జీపైనే ఆధారపడతారు. అంతేగాదు ఈ బాటిల్స్ వల్ల ఉత్పత్తి అయ్యే దాదాపు పదివేల టన్నులు కార్బన్డయాక్సైడ్ ఉద్గారాలను కూడా ఈ ప్రక్రియతో నిరోధించారు. అంతేకాదండోయ్ మనం ఈ ప్లాస్టిక్ దుస్తులను వాడి వాడి బోర్ కొట్టినట్లయితే..తిరిగి వాటిని ఈ కంపెనీకి ఇచ్చేయొచ్చు. వాటిని మళ్లీ రీసైకిల్ చేస్తుంది కూడా. అంతేగాదు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌తో తయారు చేసిన జాకెట్లను ధరించారు కూడా.ఇలా రూపొందించడానికి రీజన్..పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతగా ఈ ప్రక్రియకు నాంది పలికానని అన్నారు సెంథిల్ శంకర్. ప్రపంచవ్యాప్తంగా మనం వాడి పారేసిన ప్లాస్టిక్ బాటిళ్ల సంఖ్య నిమిషానికి మిలియన్ ఉంటున్నట్లు ఫోర్బ్స్ చెప్తోందన్నారు. ఒక బాటిల్ డీకంపోజ్ కావాలంటే నాలుగు వందల ఏళ్లు పడుతుందని, పైగా ఆ అవశేషాలు పల్లపు ప్రదేశాలకు కొట్టుకుపోతుంటాయని చెప్పారు. దీంతో ఇవన్నీ వర్షం కారణంగా కాలువలకు అడ్డుపడి వరదలకు కారణమవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తన వంతు బాధ్యతగా చెన్నైకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో వేస్ట్‌గా పడి ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లన్నింటిని సేకరిస్తున్నామని చెప్పారు. అంతేగాదు తమ ఫ్యాక్టరీలో రోజుకు 15 లక్షల బాటిళ్ల దాక రీసైకిల్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక చివరిగా అందరూ పర్యావరణ సంరక్షణార్థం ఈ రీసైకిల్ ప్రక్రియలో పాలు పంచుకోండి అని పిలుపునిస్తున్నారు సెంథిల్ శంకర్.(చదవండి: నీట్ ఎగ్జామ్‌లో సత్తా చాటిన తండ్రి, కూతురు!..50 ఏళ్ల వయసులో..) -
లవ్ స్కానింగ్
ముంబైలోని మహాలక్ష్మీ రేస్‌కోర్స్ ప్రాంతంలో జరిగిన మ్యూజిక్ ప్రోగ్రామ్‌కు హాజరైన ఒక యువకుడి టీ షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. 22 సంవత్సరాల హార్థిక్ టీ షర్ట్ వెనకాల ఐ–క్యాచింగ్ మెసేజ్ ‘ఫర్ సింగిల్ పీపుల్ వోన్లీ’తోపాటు క్యూ ఆర్ కూడా ఉంది. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే నేరుగా అతడి టిండర్ ప్రొఫైల్లోకి తీసుకువెళుతుంది. హార్థిక్ డిజిటల్ ఫ్లర్టింగ్ అనేది టాకింగ్ పాయింట్ కావడమే కాదు సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
Shobha Shetty: బిగ్‌బాస్ బ్యూటీకి నాగార్జున స్పెషల్ గిఫ్ట్.. టీ షర్ట్‌లో శోభ (ఫోటోలు)
-
టాలీవుడ్ హీరోకు ఎంఎస్ ధోని గిఫ్ట్.. అదేంటో తెలుసా?
టాలీవుడ్ హీరో నితిన్ మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్ అంటూ అభిమానులను పలకరించునున్నారు. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల జంటగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వక్కంత వంశీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే హీరో నితిన్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ట్విటర్లో ఓ ఫోటోను నితిన్ పంచుకున్నారు. అందులో ఓ టీ షర్ట్‌ను చేతిలో పట్టుకుని కనిపించారు. ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్ నుంచి ఎక్స్‌ట్రార్డీనరీ గిఫ్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ టీ షర్ట్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పంపించారంటూ ట్వీట్ చేశారు. కాగా.. నితిన్ నటించిన ఎక్స్‌ట్రార్డీనరీ డిసెంబర్ 8న థియేటర్లలో సందడి చేయనుంది. EXTRAORDINARY gift from an EXTRAORDINARY MAN… Thankuu @msdhoni sir for this!! Love u ❤️ pic.twitter.com/dNTeXl1JOe — nithiin (@actor_nithiin) November 29, 2023 -
T Shirts And Jeans Ban: విద్యాశాఖ సంచలన నిర్ణయం.. ఇకపై జీన్స్, టీషర్ట్లు బ్యాన్!
పాట్నా: బీహార్ విద్యాశాఖ జీన్స్, టీషర్ట్ పై నిషేధాన్ని విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఇతర సిబ్బంది జీన్స్, టీషర్ట్ ధరించటంపై నిషేధాన్ని విధించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. వివరాల ప్రకారం.. విద్యాశాఖ కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది జీన్స్, టీషర్ట్ వంటి క్యాజుబల్స్ ధరించి రాకూడదని ఆదేశించింది. ‘ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లుగా దుస్తులు ధరించి ఆఫీసుకు వస్తున్నారు.ఇటువంటి దుస్తులు ధరించి రావటంవల్ల కార్యాలయాల సంస్కృతి దెబ్బతింటోందని’ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇలాంటి దుస్తులు ధరించడం పనిచేసే సంస్కృతికి విరుద్ధమని తెలిపారు. కాబట్టి అధికారులు, ఉద్యోగులందరూ విద్యా శాఖ కార్యాలయాలకు అధికారిక దుస్తులలో మాత్రమే రావాలి. విద్యా శాఖ కార్యాలయాల్లో ఫ్యాషన్ ట్రెండీ వంటి దుస్తులు, ముఖ్యంగా జీన్స్, టీ-షర్టులు బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా, సరన్ జిల్లా జిల్లా మేజిస్ట్రేట్ ఏప్రిల్‌లో ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆదేశాలను తప్పక పాటించాలని కోరింది. ఫార్మల్ డ్రెస్‌లు ధరించాలని, గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలని పేర్కొంది. కాగా బీహార్ ప్రభుత్వం, 2019లో, రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ర్యాంక్‌లతో సంబంధం లేకుండా జీన్స్, టీ-షర్టులు ధరించడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. లైట్ కలర్ లో ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలని ఉద్యోగులను ఆదేశించింది. చదవండి: అక్కడకు రాగానే రైళ్లలో లైట్లు బంద్.. విచిత్రమో, విడ్డూరమో కాదు! -
అరే ఏం క్రియేటివిటీ.. ప్రమాదంలో ఉన్న పిల్లలను కాపాడే టీ-షర్ట్
-
ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ని పలువురు ఈ శీతకాలంలో మీరు ఎందుకు కేవలం టీ షర్ట్ ధరించి నడుస్తున్నారు, మీకు చలిగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. దీనికి ప్రతిగా రాహుల్ రైతు, కార్మికుడు, పేద పిల్లలను ఎప్పుడైనా ఇలా అడిగారా అని ఎదురు ప్రశ్న వేశారు. నులు వెచ్చని బట్టలు ప్రాథమిక వస్తువులు, వాటిని కొనుగోలు చేయని వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని అడిగారు. నేను సుమారు 2,800 కిలోమీటలర్లు నడిచాను కానీ అది ఏమంతా పెద్ద విషయం కాదు. నిజానికి వ్యవసాయం చేసే రైతులు, కార్మికులు, రోజు చాలా దూరం నడుస్తారు, కష్టపడతారు అని చెప్పారు. ఈ యాత్రలో అన్నిరకాల ప్రజలను కలిశాను. తాను ఇప్పుడూ ఎవరి చేయినైనా పట్టుకుని వారు ఏం పని చేశారో చెప్పగలను అన్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే ఈ జోడో యాత్ర కాశ్మీర్లో ముగియనుంది. "నాకు సాధారణ ప్రజలలో ద్వేషం కనిపించలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ద్వేషాన్ని, భయాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. కానీ నాకు యాత్ర ప్రారంభించినప్పుడూ ప్రజల్లో ద్వేషం ఉంటుందేమోనని చాలా భయపడ్డాను." అని అన్నారు. రాహుల్ చేపట్టిన ఈ జోడోయాత్రలో ప్రముఖులు, స్టార్లు, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే తోపాటు తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక వాద్రాతో సహా అగ్ర నేతలందరూ ఈ యాత్రలో పాల్గొన్నారు. (చదవండి: జోడో యాత్రలో పాల్గొంటే పొలిటికల్ కెరీర్ నాశనం అవుతుందన్నారు’) -
భారత ఆటగాడిపై సెటైరికల్ ట్వీట్.. మింత్రాపై మండిపడుతున్న నెటిజన్స్!
ఇటీవల కంపెనీలు మార్కెటింగ్ కోసం కొత్త దారులను ఎంచుకుంటున్నాయి. తమ వస్తువుల మార్కెటింగ్ కోసం కంటెంట్‌తో పాటు కాంట్రవర్శీని కూడా జత చేస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటివి బాగా పెరిగాయి.ఈ తరహాలో ఇప్పటికే ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పాటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో ఆన్లైన్ ప్లాట్‌పాం మింత్రా(MYNTR) కూడా చేరింది. టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై వ్యంగ్యంగా ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహాన్ని చవి చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ టోర్నిలో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రాహుల్ వైఫల్యాలపై మింత్రా వ్యంగ్యంగా ఓ పోస్ట్ చేసింది. అందులో.. 'అవుట్ ఆఫ్ ది వరల్డ్' అని ప్రింట్ చేసిన టీ-షర్టులో.. కేవలం 'అవుట్' మాత్రం కనిపంచేలా ఉన్న టీ షర్ట్ ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. ఆ ఫోస్ట్‌కు ‘కేఎల్ రాహుల్ ఇష్టమైన టీ-షర్ట్’ అంటూ సెటైరికల్‌గా క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ ట్వీట్‌కు సంబంధించి నెట్టింట దుమారమే రేగుతోంది. మింత్రా చేసని పనికి సోషల్‌మీడియాలో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చీఫ్ పబ్లిసిటీ స్టంట్స్ ఆపాలంటూ మండిపడుతున్నారు. చదవండి: ఏంటి బ్రో, చేరిన 2 రోజులకే నా ఉద్యోగం ఊడింది.. ఓ ఐఐటియన్ బాధ ఇది! -
టీషర్ట్ రాజకీయం స్థాయికి బీజేపీ దిగజారింది
సాక్షి, హైదరాబాద్: భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ ధరించిన టీషర్ట్ గురించి రాజకీయం చేసే స్థాయికి బీజేపీ దిగజారిందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీపై ఏ విమర్శలు చేయాలో ఆ పార్టీకి అర్థం కావడం లేదన్నారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాల గురించి రాహుల్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేకనే బీజేపీ టీషర్ట్ రాజకీయం చేస్తోందన్నారు. మరి పూటకో డ్రస్ మార్చే ప్రధాని మోదీ గురించి ఏం చెబుతారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ రూ.40వేల టీషర్ట్ ధరించారని, మోదీ రోజూ వేసుకుని తిరిగే రూ.60లక్షల విలువైన డ్రెస్‌ల గురించి బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. రాహుల్ యాత్ర రూట్ మార్పుపై చర్చిస్తా.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తన నియోజకవర్గంలో కూడా 30 కిలోమీటర్ల మేర ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డిలో ప్రవేశించి నియోజకవర్గం దాటి వెళ్లేంతవరకు అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలను ఈ యాత్రలో భాగస్వాములను చేస్తామని తెలిపారు. స్థానిక నేతలతో సమన్వయం చేసుకుని రాహుల్ యాత్రను విజయవంతం చేస్తామని పక్రటించారు. అయితే, ఓఆర్ఆర్ మీదుగా జరిగే పాదయాత్రతో ప్రయోజనం ఉండదని, అందుకే దీనిపై పీసీసీ నాయకత్వంతో చర్చిస్తానని, శంషాబాద్ నుంచి రాజేంద్రనగర్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, లింగంపల్లిల మీదుగా సంగారెడ్డికి వచ్చేలా రూట్ మార్చాలని పీసీసీని కోరతానని జగ్గారెడ్డి వెల్లడించారు. -
వైట్ టీ షర్ట్‌లో అదిరిపోయిన సమంత.. టీ షర్ట్ ధరెంతంటే ?
స్టార్ హీరోయిన్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అందం, అభినయం, ఫిట్నెస్తో సినీ ప్రేక్షకుల్నీ అలరిస్తోంది. సమంత ఉంటే సినిమాకు మంచి ఫలితమే దక్కుతుందని దర్శకనిర్మాతలు ఆమె వెంట క్యూ కడుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల వంటి ప్రాజెక్టులతో సామ్ ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫిట్నెస్, మోటివేషనల్ పోస్ట్‌తో యాక్టివ్‌గా ఉంటుంది. సమంతకు ఫిట్నెస్తో పాటు డ్రెస్సింగ్ స్టైల్‌పై కూడా ప్రత్యేక అవగాహన ఉంది. విభిన్నమైన డ్రైస్సింగ్ స్టైల్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది సామ్. తాజాగా సమంత ముంబైలోని ఓ సెలూన్ నుంచి బయటకు వస్తూ కెమెరా కళ్లకు చిక్కింది. ప్రస్తుతం ఆ ఫొటోల్లో సమంత వేసుకున్న వైట్ టీ షర్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ చర్చంతా సామ్ వేసుకున్న టీ షర్ట్ ఖరీదు గురించి. ఎందుకంటే సామ్ వేసుకున్న ఆ 'ఆర్13 వైట్ టీ షర్ట్' ధర సుమారు రూ. 17,000 ఉంటుందట. వైట్ రిప్డ్ టీతో జత చేసిన బేసిక్ బ్లాక్ జీన్స్, వైట్ స్పోర్ట్స్ షూలు ధరించి మాస్క్ పెట్టుకుని ఆకట్టుకుంది సామ్ లుక్. త్వరలో ఈ స్టైల్‌ను ఎంతమంది ఫాలో అవుతారో చూడాలి మరీ. -
Afghanistan: ‘సిగ్గుందా? శవాలపై వ్యాపారమా?’
అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల దురాక్రమణ తర్వాత.. నెలకొన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఓవైపు తాలిబన్లు భద్రతా హామీ ఇచ్చినట్లే ఇచ్చి.. అఫ్గన్లపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు భయాందోళన నిండిన పౌరులు.. పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఆడవాళ్ల భద్రత ప్రశ్నార్థకంగా మారగా.. పసిపిల్లలనైనా రక్షించాలనే తాపత్రయంతో కంచె అవతల ఉన్న విదేశీ సైన్యానికి అందిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా అనిపిస్తున్నాయి. అఫ్గన్ పరిస్థితులు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఓ దుస్తుల కంపెనీ.. అఫ్గన్ దుస్థితిని క్యాష్ చేసుకోవాలనుకున్న ప్రయత్నాన్ని దారుణంగా తిప్పికొట్టారు కస్టమర్లు. తాలిబన్ ఆక్రమణ పూర్తయ్యాక అమెరికా సీ-17 విమానం ద్వారా తప్పించుకునే ప్రయత్నంలో.. ఇద్దరు వ్యక్తులు గగనతలం నుంచి ఓ బిల్డింగ్ మీద పడి ప్రాణాలు పొగొట్టుకున్న విషయం తెలిసిందే. అఫ్గన్ల భయానికి అద్దంపట్టే ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. As Afghans are fleeing and clinging to planes out of desperation, someone decided to capitalize on their pain and misery with this repulsive t-shirt. It’s being sold on at least half a dozen t-shirt printing websites right now. Humans can be so cruel. pic.twitter.com/du5cCbD2QA — Holly Dagres (@hdagres) August 18, 2021 అయితే ఈ ప్రాణభీతి ఘటనను ఉద్దేశిస్తూ.. కాబూల్ స్కై డైవింగ్ క్లబ్ పేరుతో ఓ దుస్తుల కంపెనీ లేటెస్ట్ మోడల్స్‌ను రిలీజ్ చేసింది. ఆకాశంలో విమానం నుంచి కిందపడ్డ పౌరులను ఉద్దేశిస్తూ ఆ టీషర్ట్ ఉంది. Kabul Skydiving Club Est. 2021 పేరుతో లేటెస్ట్ మోడల్స్‌ను రిలీజ్ చేసింది. కొన్ని ప్రముఖ ఆన్లైన్ స్టోర్లు వీటిని అమ్మకానికి ఉంచడం విశేషం. దీంతో ‘సరదానా? శవాలపై వ్యాపారమా?’ అంటూ విమర్శలు మొదలయ్యాయి. అయితే రాజకీయ ఉద్దేశాలు, అఫ్గన్ల దీనస్థితిని తెలియజేసేందుకు తాము ఆ టీషర్టులను రూపొందించినట్లు కంపెనీ వివరణ ఇచ్చుకుంది. కానీ, వివరణపై నెటిజన్స్ మాత్రం తగ్గట్లేదు. విషాద ఘటన ద్వారా టీషర్టులను అమ్మే ప్రయత్నాన్ని ‘క్రూరం.. ఘోరం’గా అభివర్ణిస్తూ నెటిజన్స్ మండిపడుతున్నారు. చదవండి: మా కంటి పాపలనైనా కాపాడండి -
గిన్నిస్ రికార్డు: టీషర్ట్ మీద టీషర్ట్లు వేసి రికార్డులకెక్కాడు
-
టీషర్ట్‌ల్లో దూరిపోయి సరికొత్త రికార్డు!
టీషర్ట్ మీద టీషర్ట్ వేసి గిన్నిస్ రికార్డుల్లోకెక్కాడు టెడ్ హేస్టింగ్స్ అనే వ్యక్తి. మొత్తం 260 టీషర్టులను ఒకేసారి తన ఒంటిమీద వేసుకొని చరిత్ర సృష్టించాడు. నమ్మశక్యంకాని ఈ ఫీట్ 2019లో సాధించాడు. అయితే ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఇన్‌స్టా పేజీలో దీన్ని పోస్ట్ చేసింది. (చదవండి : ఘోరం: చుట్టుముట్టి కాల్చి చంపారు!) ఈ వీడియోలో హేస్టింగ్స్ ఒక్కో టీషర్ట్ వేసుకుంటుండగా, చుట్టూ ఉన్నవారు అతడికి సహాయం చేస్తున్నారు. మీడియం నుంచి 20 ఎక్స్ సైజు వరకు టీషర్టులను ఒక్కొక్కటీ వేసుకుంటుంటే అందరూ ప్రోత్సహించారు. అనంతరం ఒక్కొక్కటీ విప్పుతూ లెక్కపెట్టారు. మొత్తం 260 కౌంట్ తేలగా, అతడి పేరును గిన్నిస్ బుక్‌లో నమోదు చేశారు. కాగా, తండ్రిపడే కష్టం పిల్లలకు తెలియాలని ఈ ఫీట్ చేసినట్లు అతడు చెప్పాడు. దీని ద్వారా వచ్చిన డబ్బులను ఓ స్కూల్ ప్లే గ్రౌండ్ నిర్మాణానికి వాడతానని హేస్టింగ్స్ తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram Most t-shirts worn at once 👕 260 by Ted Hastings 🇨🇦 A post shared by Guinness World Records (@guinnessworldrecords) on Aug 18, 2020 at 1:26am PDT -
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రధారణ విషయంలో పలు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో టీ షర్టు ధరించడం పద్దతి కాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్వాలియర్ డివిజన్లోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు జీన్స్, టీ షర్టులు ధరించకుండా నిషేధం విధించింది. దీనికి సంబంధించిన డివిజనల్ కమిషనర్ ఎంబీ ఓజా సర్క్యూలర్ జారీ చేశారు. ఉద్యోగులందరూ హుందాగా, సంప్రదాయంగా ఉండే దుస్తులను ధరించి విధి నిర్వాహణకు రావాలని ఆదేశించారు. (మెహబూబా నిర్బంధం మరో 3 నెలలు) కాగా జూలై 20న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించిన సమావేశానికి మాండ్సౌర్ ఇల్లాలోని ఓ అధికారి పద్దతిగా లేని దుస్తులు (టీ షర్టు) ధరించి హాజరయ్యాడు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. తమ ఉత్తర్వులను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ కంటే ముందు అనేక రాష్ట్రాలు టీ షర్టు, జీన్స్ పై నిషేధం విధించాయి. గత ఏడాది బిహార్, తమిళనాడు ప్రభుత్వాలు సైతం సచివాలయంలోని ఉద్యోగులు ఈ దుస్తులు ధరించరాదని ఉత్తర్వులు జారీ చేశాయి. (సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే 10 వేలు ఫైన్) -
20 పైసలకే టీ షర్ట్, క్యూ కట్టిన జనం
సాక్షి, తిరుత్తణి: న్యూ ఇయర్ బంపర్ ఆఫర్‌తో తమిళనాడులోని తిరుత్తణిలో ఓ షాప్ వద్ద జనాలు క్యూ కట్టారు. చెలామణిలో లేని 20 పైసల నాణెం తెస్తే టీ షర్ట్ ఇస్తామని ప్రకటనతో తిరుత్తణిలోని దుస్తుల దుకాణానికి యువత పోటెత్తారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుత్తణిలోని ఓ రెడీమెడ్ షోరూమ్ వినూత్న ప్రకటన చేసింది. చలామణిలో లేని పాత 20 పైసల నాణెం తెస్తే రూ.300 విలువ చేసే టీషర్ట్ ఇస్తామని నిర్వహకులు ప్రకటించారు. అయితే తొలి వందమందికి మాత్రమే ఇస్తామని చెప్పడంతో యువత పెద్ద ఎత్తున దుకాణం ముందు క్యూ కట్టారు. టీ షర్ట్ దక్కినవాళ్లు ఆనందం వ్యక్తం చేయగా, దక్కని వాళ్లు నిరుత్సాహంతో వెనుతిరిగారు. -
ఎదుటోడిని వేసుకోండి
సిగ్నల్ పడకముందే దాటేయాలని హోండా యాక్టివా స్పీడ్ పెంచింది అమృత. హఠాత్తుగా ఆ చౌరస్తాలో ఆమెకు రైట్ సైడ్ ఉన్న రోడ్ నుంచి ఓ టూ వీలర్ అడ్డురావడంతో సడెన్ బ్రేక్ వేసింది. ‘‘ట్రాఫిక్ రూల్స్ పాటించరు పాడు లేదు.. ఇంతకీ..’’ అని ఆమె ఇంకేదో అనబోయే లోపు.. ఆ అనేదేంటో ఆ టూ వీలర్ వ్యక్తికి అర్థమైనట్టే తన టీ షర్ట్ మీది వాక్యాలు చూపించాడు అమృతకు.. ‘‘ఇంట్లో చెప్పే వచ్చా’’ అని. ‘‘అబ్బా.. అవునా?’’ అనుకుంటూ తన టీషర్ట్ మీది వాక్యాలూ చూపించింది.. ‘‘ఫసక్’’ అని!ఆ వ్యక్తి హెల్మెట్ కవర్ వేసుకుంటూ వెహికిల్ రైజ్ చేసుకొని వెళ్లిపోయాడు. అమృతా దూసుకెళ్లింది డెస్టినేషన్ వైపు.హోటల్ పార్కింగ్‌లోకి వెళ్లబోతుంటే ఓ పాదాచారుడు అడ్డొచ్చాడు. ఆ స్లోప్‌లో మళ్లీ బ్రేక్ వేస్తూ చిరాగ్గా చూసింది అతనిని ‘‘ఎవడ్రా నువ్వు?’’ అన్నట్టు. ఆ యంగ్ మన్ పరమ పుర్సత్గా తన టీ షర్ట్ చూపించాడు ‘‘పక్కా లోకల్’’ అని రాసున్న అక్షరాలను!‘‘మిడిల్ క్లాస్ అబ్బాయి’’ అనుకుంటూ పార్కింగ్‌లోకి వెళ్లింది. రెస్టారెంట్లో.. ‘‘సారీ గైస్.. ట్రాఫిక్... ఆ రూల్స్‌ని బ్రేక్ చేసే వాళ్లతో లేట్ అయిపోయింది’’ అంటూ అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్‌తో జాయిన్ అయింది అమృత.‘‘వాట్ హ్యాపెండ్?’’ అడిగాడు జయసూర్య.‘‘రెండుసార్లు డాష్ కొట్టబోయా’’ అంది అమృత మంచినీళ్ల గ్లాస్ తీసుకుంటూ!అమృత ముందుకొచ్చి నిలబడ్డాడు పాండు. ఏంటీ అన్నట్టు చూసింది ఆమె నీళ్లు తాగుతూ!టీ షర్ట్ చూపించాడు.. ‘‘లైట్’’ తీస్కో అని ఉంది దాని మీద. నోట్లో నీళ్లు పాండు మీద పడేలా నవ్వేసింది.‘‘యూ నో.. ఈ రోజు ట్రాఫిక్‌లో.. పార్కింగ్‌కి వెళ్తుంటే నా వెహికిల్‌కి అడ్డొచ్చిన వాళ్లూ ఇలాంటి టీ షర్ట్సే వేసుకున్నారు’’ అని చెప్పింది అమృత మంచి నీళ్ల గ్లాస్ టేబుల్ మీద పెడుతూ.‘‘అర్రే.. అంటే ట్రెండ్‌ను ఫాలో అవ్వడంలో మనమెప్పుడూ లేటే అన్నమాట’’ అంది గీతిక.ఆనంది టీషర్ట్ చూపించాడు శివ.. గీతికకు. ‘‘మూస్కో’’ అని ఉంది. వెంటనే తన టీషర్ట్ మీదున్న అక్షరాలను చూపించింది గీతిక.. ‘‘ఏడ్చావ్ లే..’’ అని.‘‘ఓకే. టాపిక్‌కి వద్దాం...’’ అంటూ జయసూర్య వైపు తిరిగి‘‘ రేయ్ జయ్.. చెప్పరా.. పార్టీ ఎక్కడ అరేంజ్ చేస్తున్నావో?’’ అడిగింది గీతిక.‘‘మా బాబాయ్ వాళ్ల ఫామ్ హౌజ్‌లో’’ చెప్పాడు. ‘‘ఎక్కడది?’’ అందరూ అడిగారు ముక్త కంఠంతో.‘‘తూప్రాన్’’ చెప్పాడు జయసూర్య. ‘‘రేయ్.. మొదటిసారి పెళ్లి చేసుకుంటున్నావ్. నీ ప్రీ మ్యారేజ్ పార్టీ అదిరిపోవాలి బ్రో..’’ అన్నాడు శివ సీరియస్‌గా. ‘‘మొదటిసారి ఏంట్రా.. మొదటిసారి’’ అంటూ వాడి వీపును దబేల్ మనిపించారంతా. ఆ సరదా సందడిలోనే తినడానికీ ఆర్డర్ ఇచ్చేసుకున్నారు.‘‘మరీ అంతగా డబ్బులు తగలేసుకోకురా! పెళ్లయ్యాక చాలా ఖర్చులుంటాయి’’ సలహా ఇచ్చింది అమృత.‘‘పేరెంట్స్ చూసుకుంటారు’’ టీషర్ట్ చూపించాడు జయసూర్య. ‘‘నిన్నూ...’’ అంటూ నవ్వుతూ జయ్ భుజమ్మీద ఒక్కటిచ్చింది.‘‘ఫారిన్ స్కాచ్ పెట్టాల్రా మామా’’ అన్నాడు పాండు. ‘‘అవున్రా పెట్టాల్రా’’ అంటూ ‘‘అబే.. శివా.., బంటీ మాట్లాడరేందిరా..’’ మిగతావాళ్లనూ రెట్టించాడు అభిరామ్. ‘‘అంతేగా.. అంతేగా’’ తన టీషర్ట్ చూపించాడు బంటీ!‘‘మీ టీషర్ట్స్ గోలేంట్రా’’ అంటూ సంహిత తల పట్టుకుంటూంటే ‘‘అరే చిచ్చా... ఈ ప్రీ మ్యారేజ్ పార్టీకి మన ఫ్రెండ్స్ అందరి మ్యానరిజమ్స్‌తో ఇట్లాంటి టీషర్ట్స్‌ను కస్టమైజ్ చేసుకుందామారా?’’.. అద్భుతమైన ఐడియా తట్టినట్టు ఎక్సయిటింగ్‌గా చెప్పాడు పాండు. ‘‘రంగుపడుద్ది’’ అనే టీషర్ట్ వేసుకున్న గౌతమ్, ‘‘పని చూస్కో’’అని మాటున్న టీషర్ట్ వేసుకున్న అభిరామ్, ‘‘నాకు బూతులు ఊరికే రావు’’ అనే రాతతో టీషర్ట్ వేసుకున్న శివ.. అందరూ పాండూ ముందుకొచ్చి నిలబడ్డారు.ఏం చెప్పాలో తెలియక ‘‘అబే హాదీ..’’ అంటూ సెల్లో మొహం పెట్టిన హార్దిక్‌ను తట్టాడు. తలపైకెత్తి ‘‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావు గారు’’ అన్న తన టీషర్ట్ అక్షరాలను చూపించాడు హార్దిక్. అందరూ పాండు వైపు చూశారు ‘‘అయిందా’’ అన్నట్టు. తలగోక్కున్నాడు పాండు. అప్పుడే హడావిడిగా వీళ్ల దగ్గరకు వచ్చాడు ఆదిత్య.. ‘‘మీటింగ్ ఎన్ని గంటలకో చెప్పి చావచ్చు గదరా’’ అంటూ. అప్పటికే వీళ్లు ఖాళీ చేసిన స్నాక్స్ ప్లేట్లను చూస్తూ... ‘‘ నాకేమన్నా చెప్పండ్రా.. ఆకలేస్తోంది’’ అన్నాడు ఆదిత్య. ‘‘మాది అయిపోయింది. కావల్సింది ఆర్డర్ ఇచ్చుకో’’ అన్నాడు అభిరామ్. సర్వర్ కోసం అటూఇటూ చూశాడు ఆదిత్య. ఎవరూ కనపడలేదు. వాడి ఆత్రం అర్థమైన అభిరామ్ ‘‘కౌంటర్ దగ్గరకెళ్లి ఆర్డర్ ఇయ్యిపోరా’’ అన్నాడు. వెళ్లడానికి ఆదిత్య ఇబ్బంది పడ్తూంటే.. శివను వెనక్కి తిప్పి అతని వీపు చూపించాడు అభిరామ్.. ‘‘వెళ్లి నా పేరు చెప్పు’’ అని ఉంది. ‘‘సరే.. నీ ఏడుపేదో ఏడ్చి రా.. పార్కింగ్ లాట్లో వెయిట్ చేస్తూంటాం’’ అంటూ లేచాడు జయసూర్య. తోపాటే అందరూ లేచారు. లిఫ్ట్ దగ్గర.. తన ఛాతి దగ్గర అదే పనిగా చూస్తున్న అబ్బాయికి.. తను వేసుకున్న టీషర్ట్ మీది అక్షరాలను చూపించింది అమ్మాయి.. ‘‘ఫేస్ పైనుంది బే’’ అని. ఆ అబ్బాయి తమాయించుకుని ఏమీ ఎరగనట్టు ఆమె పక్కన నిలబడ్డ అబ్బాయిని చూశాడు. అతను గుర్రుగా తన టీ షర్ట్ మీదున్న అక్షరాలను చూపించాడు ‘‘ఈ పిల్ల నాది బే’’. దాంతో తన టీ షర్ట్ మీదున్న అక్షరాలను చూసుకున్నాడు అబ్బాయి ‘‘దీనమ్మ జీవితం’’.ఇంతలోకే రెస్టారెంట్లో ఆదిత్య దగ్గరకు బిల్ తీసుకొని వచ్చాడు సర్వర్. తన టీషర్ట్‌ను సర్వర్కి చూపించాడు ఆదిత్య.. ‘‘దే పేడ్ నో’’ అని. లేదన్నట్టుగా తలూపాడు సర్వర్. అప్పుడే తన పక్క టేబుల్ అతను బిల్ పే చేసి వెళ్తుంటే అతని టీ షర్ట్ వెనక ఓ వాక్యం కనిపించింది ఆదిత్యకు ‘‘ఒక ఇంగ్లిష్ కవి ఏమన్నాడో తెలుసా?’’ అని.పై సన్నివేశాలన్నీ కల్పితమే. కాని ఆ సినిమా డైలాగ్స్‌తో ఉన్న టీషర్ట్స్ వాస్తవం. వీటి రూపకర్తలు ఇద్దరు సాఫ్టవేర్ ఇంజనీర్స్. మహీ ఇలీంద్ర, హరీష్ వాసిరెడ్డి. ప్రకాశం, ఖమ్మం జిల్లా వాసులు. హైదరాబాద్‌లో ఇద్దరికీ కామన్ ప్యాషన్ అయిన సినిమా ప్లాట్‌ఫామ్ మీద కలుసుకున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మొదలు కొన్ని షార్ట్ మూవీస్‌కీ పనిచేశారు. వెబ్సిరీస్కూ వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఈ టీషర్ట్స్ థాట్‌తో ఈ కామర్స్‌లోనూ కాలు పెట్టారు. దేడ్ దిమాగ్ ఇంగ్లీష్‌లో ‘ఐ లవ్ న్యూయార్క్’ అని, ‘కొలంబియా బాయ్స్’ అని, ‘లవ్ అమెరికా’ అని ‘లండన్ డ్రీమ్స్’ అని రకరకాల స్లోగన్స్‌తో టీ షర్ట్స్ దొరుకుతాయి. కానీ తెలుగులో ఇలాంటివి లేదు. మన భాషలో పాపులర్ అయిన మాటలతో టీషర్ట్స్‌ను మార్కెట్లోకి తెస్తే ఎలా ఉంటుంది అనిపించింది ఆ ఇద్దరికీ. హిట్ కావాలంటే ఒకే ఫార్మూలా.. సినిమా! సో.. ఈ స్టార్టప్‌కి ‘దేడ్ దిమాగ్’ అని పేరుపెట్టి.. పంచ్లా పేలిన డైలాగ్స్‌ను టీ షర్ట్స్ మీద ప్రింట్ చేయించి మార్కెట్లో విడుదల చేశారు. టేకాఫ్ కొంచెం స్లో అయినా.. రెండు నెలల్లో స్పీడ్ అందుకుంది. క్రేజ్‌కి తగ్గ రేంజ్లో ఇప్పుడు రోజుకి కనీసం అయిదు వందల టీషర్ట్స్ సప్లయ్‌కి డిమాండ్ ఉంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చెన్నై, బెంగళూరు, ముంబై దాటి అమెరికా దాకా! ప్రీ మ్యారేజ్ పార్టీలు, బ్యాచ్‌లర్ పార్టీలు, సంగీత్, మెహందీ, పుట్టినరోజులు, బారసాలలు, కాలేజ్ పార్టీలు.. ప్రైవేట్ ఫంక్షన్స్.. అన్నిటికీ కస్టమైజ్ చేసుకున్న డైలాగ్స్‌తో ఈ టీషర్ట్స్ అమ్ముడు పోతున్నాయి. హోలీ లాంటి పండగలకూ.. థీమ్ పార్టీలకూ ఇలాంటి టీషర్ట్స్ కావాలనుకుంటున్నారు ట్రెండ్ ఫాలోవర్స్. కొంతమంది తమ కుటుంబ వేడుకల కోసం కుటుంబ సభ్యుల మ్యానరిజమ్స్‌తో ఈ టీషర్ట్స్‌ను తయారు చేసి ఇవ్వమని కోరుతున్నారట. అంతేకాదు కొన్ని పొలిటికల్ క్యాంపెయిన్స్కీ అడుగుతున్నారని చెప్పారు ఆ ప్రొడ్యూసర్స్. ‘‘ఈ టీ షర్ట్స్ ద్వారా మన భాష, కల్చర్‌ను ప్రమోట్ చేయడం మా లక్ష్యం. పాపులర్ కావడానికి ముందు సినిమా డైలాగ్స్‌ను వాడుకున్నాం కాని.. తర్వాత సామెతలు.. నుడికారాలు, పలుకుపడులు వంటివాటినీ ప్రింట్ చేస్తాం’’ అని చెప్తున్నారు మహీ, హరీష్‌లు. సరస్వతి రమ -
టీ షర్ట్స్‌తో ఆఫీస్‌కు వస్తే..
లండన్ : ఆఫీస్ అనగానే సూటూ, బూటూ, టైతో బయలుదేరే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే..టై ధరించడంతో మెదడుకు రక్త సరఫరా ఇతరులతో పోలిస్తే 7.5 శాతం తక్కువగా ఉన్నట్టు జర్మన్ పరిశోధకుల అథ్యయనంలో వెల్లడైంది. ఆఫీస్‌కు ట్రెడిషనల్ వేర్ కన్నా టీ షర్ట్స్ ధరించి వచ్చేవారే మెరుగ్గా పనిచేస్తున్నట్టు అథ్యయనం సూచించింది. సౌకర్యవంతమైన దుస్తులతోనే ఉద్యోగులు మంచి సామర్థ్యం కనబరుస్తారని తేలింది. జర్మనీ పరిశోధకులు 30 మంది ఎగ్జిక్యూటివ్‌లపై జరిపిన ఎంఆర్ఐ స్కాన్‌లో వారి మెదడుకు రక్త సరఫరా టైలు ధరించని వారితో పోలిస్తే తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. ఇది ఆయా ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అథ్యయనం హెచ్చరించింది. టైలతో కళ్లపై ఒత్తిడి పెరుగుతుందని గతంలోనూ పలు అథ్యయనాలు హెచ్చరించాయి. శరీరంలోని అవయవాలు చురుకుగా పనిచేసేందుకు అవసరమైన సంకేతాలు పంపేందుకు మెదడుకు నిరంతరాయంగా రక్త సరఫరా అత్యంత కీలకం. అథ్యయన వివరాలు జర్నల్ స్ర్టింగర్లో ప్రచురితమయ్యాయి. -
ఇక ఆఫీస్‌కు నో జీన్స్-టీ షర్ట్
జైపూర్ : రాజస్థాన్ లేబర్ డిపార్ట్మెంట్ జారీ చేసిన సర్క్యులర్ ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఇక మీదట ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చే సమయంలో జీన్స్, టీ షర్ట్ వంటి అభ్యంతరకరమైన దుస్తులు ధరించ కూడదని సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నెల 21న లేబర్ కమిషనర్ గిర్రియాజ్ సింగ్ కుష్వాహా ఈ సర్క్యులర్‌ను జారీ చేశారు. ఈ విషయం గురించి గిర్రియాజ్ ‘కొంతమంది ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేటప్పుడు జీన్స్, టీ షర్ట్ లాంటి అభ్యంతరకర దుస్తులు ధరించి వస్తున్నారు. ఇలాంటి దుస్తులు ధరించి విధులకు హాజరవ్వడం అంటే వారు తమ ఉద్యోగానికి, ఆఫీస్‌కు మర్యాద ఇవ్వనట్లే. ఈ పరిస్థితిని మార్చడం కోసం ఈ నోటీస్‌ను జారీ చేయాల్సి వచ్చింది. ఇక మీదట ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేటప్పుడు ప్యాంట్, షర్ట్ మాత్రమే ధరించే రావాలి’ అన్నారు. అయితే ఈ నోటీస్ గురించి ఇంతవరకూ ఉద్యోగుల నుంచి తనకు ఎటువంటి ఫీడ్‌బ్యాక్ అందలేదని తెలిపారు. ఈ విషయం గురించి ‘ఆల్ రాజస్థాన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ ప్రెసిడెంట్ గజేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ నోటీస్‌ను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. జీన్స్, టీ షర్ట్ ధరించడం అభ్యంతకరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి సర్వీస్ రూల్స్ రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఈ నోటీస్‌ను విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా కమిషన్‌ను కోరాతామని చెప్పారు. -
రిలయన్స్ కొత్త టీ షర్ట్ ‘ది ఎర్త్ టీ’
సాక్షి, హైదరాబాద్: ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలు-2018’కి భారత్ ఆతిథ్యం ఇస్తున్న సందర్భంగా రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ ‘ది ఎర్త్ టీ’ అనే టీ షర్ట్‌ని విడుదల చేసింది. తన ‘ఫ్యాషన్ ఫర్ ఎర్త్’ కార్యక్రమంలో భాగంగా లాక్మే ఫ్యాషన్ వీక్‌తో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ టీ షర్ట్‌ని ప్రముఖ డిజైనర్ అనిత డోంగ్రే డిజైన్ చేశారు. ఫ్యాషన్ అంటే ప్రకృతిని, పర్యావరణాన్ని పణంగా పెట్టడం కాదనీ, పర్యావరణ హితం కోరుతూ పనిచేయడం కూడా అనే నినాదంతో రిలయన్స్ ఇండస్ర్టీస్ జనవరిలో ఫ్యాషన్ ఫర్ ఎర్త్ కార్యక్రమాన్ని చేపట్టింది. ముంబైలోని జియో గార్డెన్లో జరిగిన నాటి కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మందికి అందించిన తాగు నీటి సీసాలను రీయూజ్ కోసం ఆర్ఐఎల్ స్వయంగా సేకరించడం గమనార్హం. -
ఆ బుడతడి కల నెరవేరింది!
ఐదేళ్ల ముర్తాజా అహ్మది 'మెస్సీ'పై తనకున్న అభిమానంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలమంది హృదయాలు కొల్లగొట్టాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ వీరాభిమాని అయిన ఈ చిన్నారి.. అతని టీ షర్ట్ మాదిరి ప్లాస్టిక్ బ్యాగ్‌ను ధరించి.. యుద్ధబాధిత ఆఫ్గానిస్థాన్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించాడు. అతని ఫొటోలు నెట్టింట్లోకి రావడంతోనే ఎంతోమంది దృష్టిని ఆకర్షించాయి. నీలం, తెలుపు రంగుల్లో ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్‌పై 'మెస్సీ'తోపాటు అతని జెర్సీ నంబర్ 10ని రాసి.. మొర్తాజా ధరించాడు. ఫుట్‌బాల్ సూపర్ స్టారైన లియోనల్ మెస్సీ కూడా నీలం, తెలపు రంగుల్లోని జెర్సీనే ధరిస్తాడు. దీంతో మొర్తాజా ఫొటోలు ఆన్లైన్లో ఒక్కసారిగా హల్చల్ చేశాయి. మొర్తాజా ఎవరూ అన్న అన్వేషణ ఫుట్‌బాల్ అభిమానుల్లో మొదలైంది. ఈ వార్త స్వయంగా మెస్సీకి కూడా చేరడంతో.. ఆ బుడతడిని కలువాలని ఆయన కూడా ముచ్చటపడ్డారు. ఎట్టకేలకు మొర్తాజా యుద్ధబాధిత ఆఫ్గానిస్థాన్‌లోని ఓ మారుమూల పల్లెలో తేలాడు. ఒకప్పుడు తాలిబన్ నియంత్రణలో ఈ ప్రాంతంలో ఆటలకు ఎంతమాత్రం తావు లేదు. అయినా ఇక్కడి చిన్నారులు క్రికెట్ అన్నా, ఫుట్‌బాల్ అన్న పడిచస్తారు. అలా చిన్నప్పుడు 'మెస్సీ'కి మొర్తాజా వీరాభిమాని అయిపోయాడు. తమ్ముడి అభిమానాన్ని సంతృప్తిపరిచేందుకు తన దగ్గరున్న ప్లాస్టిక్ బ్యాగుతో 'మెస్సీ' టీ షర్ట్ మాదిరి చొక్కాను రూపొందించి ఇచ్చాడు అతని సోదరుడు 15 ఏళ్ల హమయోన్. ఆ చొక్కాను ధరించి ఆనందంతో ఫుట్‌బాల్ ఆడుతున్న మొర్తాజా ఫొటోలు ఆన్లైన్లో ఏకంగా మెస్సీ దాకా పాకాయి. దీంతో మెస్సీ స్వయంగా తాను ధరించే జాతీయ జట్టు టీ షర్ట్‌ని సంతకం చేసి మరీ మొర్జాజా కోసం పంపాడు. మెస్సీ మేనేజ్మెంట్, యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మొర్తాజాకు ఈ టీ షర్ట్ బహుమతిగా అందించారు. దీంతో ఫుల్ ఖుషి అయిన మొర్తాజా 'నేను మెస్సీని ఎంతోగానో ఇష్టపడతాను. ఆయన నన్ను ఇష్టపడుతున్నట్టు ఈ టీ షర్ట్ రాసి పంపారు' అని చెప్పాడు. మెస్సీ టీ షర్ట్ లో ఆడాలన్న తన కల నెరవేర్చుకున్న ఈ బుడతడు త్వరలోనే మెస్సీని కూడా కలువాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. -
కోరుకున్న టీ షర్టు కొనివ్వలేదని...
సాక్షి, ముంబై: తాను కోరుకున్న టీ షర్టు కొనివ్వకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన పదేళ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పుణేలోని ధనక్వాడిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బిల్డర్ సునీల్ పిసాల్ కొడుకు ఆదిత్య... తనకు టీ షర్టు కావాలంటూ పట్టుబట్టాడు. ప్రస్తుతం చలికాలం అయినందువల్ల చలి కోటు కొనిస్తామంటూ తల్లిదండ్రులు నచ్చజెప్పేందుకు యత్నించారు. అయితే ఆదిత్య వినలేదు. తనకు టీ షర్టు మాత్రమే కావాలంటూ మొండికేశాడు, చివరకు అది కొనివ్వకపోవడంతో మనోవేదనకు గురైన ఆదిత్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. బయటకు వెళ్లిన తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి ఆదిత్య మృతదేహం ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.