ఇటీవల కంపెనీలు మార్కెటింగ్ కోసం కొత్త దారులను ఎంచుకుంటున్నాయి. తమ వస్తువుల మార్కెటింగ్ కోసం కంటెంట్‌తో పాటు కాంట్రవర్శీని కూడా జత చేస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటివి బాగా పెరిగాయి.ఈ తరహాలో ఇప్పటికే ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పాటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో ఆన్‌లైన్ ప్లాట్‌పాం మింత్రా(MYNTR) కూడా చేరింది. టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై వ్యంగ్యంగా ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహాన్ని చవి చూస్తోంది.
ప్రస్తుతం జరుగుతున్న టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ టోర్నిలో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రాహుల్ వైఫల్యాలపై మింత్రా వ్యంగ్యంగా ఓ పోస్ట్ చేసింది. అందులో.. 'అవుట్ ఆఫ్ ది వరల్డ్' అని ప్రింట్ చేసిన టీ-షర్టులో.. కేవలం 'అవుట్' మాత్రం కనిపంచేలా ఉన్న టీ షర్ట్ ఫోటోను ట్విటర్‌లో షేర్ చేసింది.
ఆ ఫోస్ట్‌కు ‘కేఎల్ రాహుల్ ఇష్టమైన టీ-షర్ట్’ అంటూ సెటైరికల్‌గా క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ ట్వీట్‌కు సంబంధించి నెట్టింట దుమారమే రేగుతోంది. మింత్రా చేసని పనికి సోషల్‌మీడియాలో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చీఫ్ పబ్లిసిటీ స్టంట్స్ ఆపాలంటూ మండిపడుతున్నారు.
చదవండి: ఏంటి బ్రో, చేరిన 2 రోజులకే నా ఉద్యోగం ఊడింది.. ఓ ఐఐటియన్ బాధ ఇది!
Comments
Please login to add a commentAdd a comment