తాను కోరుకున్న టీ షర్టు కొనివ్వకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన పదేళ్ల బాలుడు..
సాక్షి, ముంబై: తాను కోరుకున్న టీ షర్టు కొనివ్వకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన పదేళ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పుణేలోని ధనక్‌వాడిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బిల్డర్ సునీల్ పిసాల్ కొడుకు ఆదిత్య... తనకు టీ షర్టు కావాలంటూ పట్టుబట్టాడు. ప్రస్తుతం చలికాలం అయినందువల్ల చలి కోటు కొనిస్తామంటూ తల్లిదండ్రులు నచ్చజెప్పేందుకు యత్నించారు.
అయితే ఆదిత్య వినలేదు. తనకు టీ షర్టు మాత్రమే కావాలంటూ మొండికేశాడు, చివరకు అది కొనివ్వకపోవడంతో మనోవేదనకు గురైన ఆదిత్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. బయటకు వెళ్లిన తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి ఆదిత్య మృతదేహం ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.