పెరిగిన ట్రంప్ క్రేజ్‌.. ‘ఫైట్‌ ఫైట్‌’ టీషర్ట్‌లకు ఫుల్‌ డిమాండ్‌ | Trump Fight Fight T Shirts For Sale On Chinese Retailer Sites After US Rally Shooting, Post Viral | Sakshi
Sakshi News home page

పెరిగిన ట్రంప్ క్రేజ్‌.. ‘ఫైట్‌ ఫైట్‌’ టీషర్ట్‌లకు భలే డిమాండ్‌

Published Sun, Jul 14 2024 4:00 PM | Last Updated on Sun, Jul 14 2024 6:18 PM

Trump Fight Fight T Shirts For Sale On Chines Retailer Sites

న్యూయార్క్‌: అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు జరగడం సంచలనం రేపింది. ఈ ఘటనలో ట్రంప్‌ చెవికి బుల్లెట్‌ గాయమై రక్తం చిందింది. బుల్లెట్‌ కొంచెం పక్కకు తాకి ఉంటే ట్రంప్‌ ప్రాణాలు పోయేవి. ఇంత జరిగిన తర్వాత కూడా కొద్దిసేపటికే తేరుకున్న ట్రంప్‌ అదే వేదికపై చేయి పైకి లేపి ఫైట్‌ఫైట్‌ అని నినదించడం అందరినీ ఆకర్షించింది.

ర్యాలీకి హాజరైన వారంతా ట్రంప్‌నకు మద్దతుగా నినాదాలు చేశారు. పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు సరిగ్గా శనివారం(జులై13) సాయంత్రం 6.30 గంటలకు జరిగాయి.ఘటనపై అధ్యక్షుడు బైడెన్‌ 8 గంటలకు స్పందించారు. ఇదంతా ఇలాఉంటే చైనాలోని రిటైలర్‌ కంపెనీలు కాల్పుల తర్వాత ట్రంప్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలని డిసైడయ్యాయి.

 కాల్పులు జరిగిన రెండు గంటల్లోనే చైనాలోని ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ తొవాబో ట్రంప్‌ చేయి పైకెత్తి ఫైట్‌ఫైట్‌ అని నినాదాలు చేసే ఫొటోతో కూడిన టీషర్ట్‌లను అమ్మకానికి పెట్టింది. ఈ ఉదంతంపై అమెరికా మీడియా కథనాలు ప్రసారం చేసింది. 

దీనిపై తొవాబో స్పందించింది.‘కాల్పులు జరగ్గానే టీషర్ట్‌లను ఈ కామర్స్‌ సైట్‌లో అమ్మకానికి పెట్టాం. అసలు మేము వాటిని ఇంకా ప్రింట్‌ కూడా చేయలేదు.అప్పుడే 2000కుపైగా టీషర్ట్‌లకు ఆర్డర్‌ వచ్చింది’అని తొవాబో తెలిపింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement