Chinese Apps
-
పెరిగిన ట్రంప్ క్రేజ్.. ‘ఫైట్ ఫైట్’ టీషర్ట్‌లకు ఫుల్ డిమాండ్
న్యూయార్క్: అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు జరగడం సంచలనం రేపింది. ఈ ఘటనలో ట్రంప్ చెవికి బుల్లెట్ గాయమై రక్తం చిందింది. బుల్లెట్ కొంచెం పక్కకు తాకి ఉంటే ట్రంప్ ప్రాణాలు పోయేవి. ఇంత జరిగిన తర్వాత కూడా కొద్దిసేపటికే తేరుకున్న ట్రంప్ అదే వేదికపై చేయి పైకి లేపి ఫైట్ఫైట్ అని నినదించడం అందరినీ ఆకర్షించింది.ర్యాలీకి హాజరైన వారంతా ట్రంప్‌నకు మద్దతుగా నినాదాలు చేశారు. పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు సరిగ్గా శనివారం(జులై13) సాయంత్రం 6.30 గంటలకు జరిగాయి.ఘటనపై అధ్యక్షుడు బైడెన్ 8 గంటలకు స్పందించారు. ఇదంతా ఇలాఉంటే చైనాలోని రిటైలర్ కంపెనీలు కాల్పుల తర్వాత ట్రంప్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని డిసైడయ్యాయి.100% of profits from this shirt go to Trump’s campaignhttps://t.co/AUeoyZ6XPT pic.twitter.com/eS18aZNl2o— Hodgetwins (@hodgetwins) July 13, 2024 కాల్పులు జరిగిన రెండు గంటల్లోనే చైనాలోని ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ తొవాబో ట్రంప్ చేయి పైకెత్తి ఫైట్ఫైట్ అని నినాదాలు చేసే ఫొటోతో కూడిన టీషర్ట్లను అమ్మకానికి పెట్టింది. ఈ ఉదంతంపై అమెరికా మీడియా కథనాలు ప్రసారం చేసింది. దీనిపై తొవాబో స్పందించింది.‘కాల్పులు జరగ్గానే టీషర్ట్లను ఈ కామర్స్ సైట్లో అమ్మకానికి పెట్టాం. అసలు మేము వాటిని ఇంకా ప్రింట్ కూడా చేయలేదు.అప్పుడే 2000కుపైగా టీషర్ట్‌లకు ఆర్డర్ వచ్చింది’అని తొవాబో తెలిపింది. -
ఈ నిషేదంతో లాభమెంత?
మరోసారి నిషేధపు వేటు పడింది. మరిన్ని చైనీస్ యాప్‌లకు భారత ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దేశ సమైక్యత, సమగ్రత, భద్రతలకూ, పౌరుల వ్యక్తిగత గోప్యతకూ భంగం కలిగిస్తున్నాయంటూ సోమవారం కొత్తగా మరో 54యాప్‌లపై కొరడా జళిపించింది. దీంతో మన దేశంలో గత రెండేళ్ళలో అప్పటి టిక్‌టాక్, పబ్జీ నుంచి ఇప్పటి ఫ్రీ ఫైర్ దాకా 300కి పైగా చైనీస్ యాప్‌లు చట్టవిరుద్ధం అయ్యాయి. తాజాగా నిషేధించిన యాప్‌లన్నీ దాదాపు గతంలో వేటుపడ్డ వాటి తాలూకువే. పాతవే కొత్త పేర్లు, అవతారాలతో రంగప్రవేశం చేశాయి. దేశభద్రతకు భంగకరమైన వాటిపై కొరడా తీయడం తప్పు కాదు. తప్పనిసరి కూడా! కానీ, నిషేధం వల్ల అసలు లక్ష్యం సిద్ధిస్తుందా? దాదాపు రెండేళ్ళ క్రితం 2020 జూన్ నుంచి ఇలాంటి జిత్తులమారి చైనా యాప్‌లపై నిషేధం మొదలైంది. వేటు వేసినప్పటికీ, భారతీయుల కీలకమైన డేటాను తస్కరించడం కోసం పాతవాటికే నకలు యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా, కొత్త నిషేధ ప్రకటనలూ విడతల వారీగా వస్తూనే ఉన్నాయి. ఆ పరంపరలో తాజాగా ప్రకటన అచ్చంగా అయిదో విడత నిషేధం. చిత్రంగా, అలీబాబా, టెన్సెంట్, గేమింగ్ సంస్థ నెట్ ఈజ్ లాంటి అతి పెద్ద చైనీస్ టెక్నాలజీ సంస్థల నుంచి వచ్చిన యాప్‌లు కూడా తాజా నిషేధిత వర్గంలో ఉండడం గమనార్హం. టెన్సెంట్కు చెందిన అత్యధిక ప్రజాదరణ పొందిన ‘పబ్జీ’ యాప్‌పై 2020 సెప్టెంబర్ విడతలో భారత్ నిషేధం పెట్టింది. ఆ తర్వాత ‘గరేనా ఫ్రీ ఫైర్’ యాప్ పాపులరైంది. ఇప్పుడు దాన్ని నిషేధించారు. చైనా నుంచి వచ్చే సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఉత్పత్తులతో గూఢచర్యం జరుగుతోందన్న ఆరోపణలు ప్రపంచమంతటా ఉన్నాయి. ఆందోళన రేపుతున్నాయి. అందువల్లే పాశ్చాత్య దేశాలతో పాటు మనమూ టెలికమ్యూనికేషన్ల ఆధునికీకరణలో కొన్ని చైనీస్ హార్డ్‌వేర్ దిగ్గజ సంస్థలను దూరం పెట్టాం. సాఫ్ట్‌వేర్‌లో సైతం సెన్సార్‌షిప్‌లో భాగంగా ‘ఉయ్ ఛాట్’ లాంటివి ప్రైవేట్ సంభాషణల్ని సేకరించి, నిల్వ చేసి చైనీస్ న్యాయవ్యవస్థకు ఇస్తున్నాయని నిపుణుల మాట. నిషేధిత యాప్‌ల తాలూకు సంస్థలు మాత్రం భారతీయ వినియోగదారుల డేటాను చైనా సర్వర్లకు అందించడం లేదంటున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా, అమెరికా, లేదా స్వయంగా మన దేశవాళీ యాప్‌లలో వేటి వల్ల, ఎలాంటి చిక్కులున్నాయో ప్రభుత్వమే ససాక్ష్యంగా ప్రజలకు వివరించాలి. చైతన్యం తేవాలి. భారత పౌరుల కీలక డేటాను విదేశీ సంస్థలు వినియోగించుకోవడం ఆందోళకరమే. దాన్ని అడ్డుకోవాలన్న మన ప్రభుత్వ దీక్షను అభినందించాల్సిందే. కానీ, అందుకు ఎంచుకుంటున్న నిషేధ మార్గం వల్ల ఆశించిన ఉత్తమ ఫలితాలొస్తాయా అన్నదే అనుమానం. రోజూ అనేక రకాల అప్లికేషన్లు, వెబ్సైట్లు, డిజిటల్ వస్తువులు వాడకం తప్పనిసరైన వేళ, పౌరుల వ్యక్తిగత డేటాను కాపాడాలంటే మన దేశం అవసరమైనవాటినే అనుమతించే పటిష్ఠమైన సాంకేతిక రక్షణ కవచం సిద్ధం చేసుకోవాలి. అలా కాక, తాత్కాలిక నిషేధాలు పెట్టినా, అపరిమిత సంఖ్యలోని ఈ యాప్ సృష్టికర్తలు చిటికెలో కొత్త పేరు, కొత్త డిజైన్‌తో పాతదానికే నకలు వదులుతారు. వెరసి, సమస్య ఆరని రావణకాష్ఠమే! మొదటి నుంచీ ఈ యాప్‌ల నిషేధాన్ని ‘డిజిటల్ స్ట్రైక్’గా మన పాలకులు అభివర్ణిస్తున్నారు. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఘర్షణల అనంతరమే తొలిసారి యాప్‌ల నిషేధం తెర మీదకొచ్చింది. పొరుగున ఉన్న చైనాతో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులకు ఒకరకంగా ఇది ప్రతిస్పందన. మరి కొద్దినెలల్లో లద్దాఖ్‌లో ప్రతిష్టంభనకు రెండేళ్ళవుతున్న వేళ ఇప్పుడు మరిన్ని యాప్‌లపై చర్యలు చేపట్టాం. దీనివల్ల చైనాకూ, ఆ దేశ సంస్థలకూ కలిగే నొప్పి మాత్రం కొంచెమే. ఉదాహరణకు, ‘పబ్జీ’ తర్వాత మన దేశంలో అమిత ప్రాచుర్యం పొంది, ఈసారి నిషేధానికి గురైన ‘ఫ్రీ ఫైర్’ మార్కెట్లో భారత్ వాటా 3 శాతమే. పైగా, కొత్త అవతారాలతో వస్తుంటే ఏటేటా ఎన్నని నిషేధించుకుంటూ పోతాం? ఇప్పటికే జరిగిన డేటా ఉల్లంఘనకు దిద్దుబాటు చర్యలు ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు. అందుకే, ఒక్క చైనాయే కాక ఏ దేశమైనా కోరలు సాచే అవకాశం ఉన్న విశాల వర్చ్యువల్ హద్దులను కాపాడుకొనే పని మీద దృష్టి పెట్టడం కీలకం. దౌత్య, సైనిక అంశాల్లో పైకి ఎంత బింకం చూపినా, ఇవాళ్టికీ మనం చైనా దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్నామనేది వాస్తవం. డ్రాగన్‌తో మన వాణిజ్య లోటు నిరుడు ఏకంగా 69.4 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. గత ఏడాది చైనా నుంచి మన దిగుమతులు రికార్డు 46 శాతం, మన ఎగుమతులేమో 35 శాతం పెరిగాయి. అలా ఆ దేశంతో మన ద్వైపాక్షిక వాణిజ్యం నిరుడు ఏకంగా 44 శాతం పెరిగింది. అమెరికా తర్వాత ఇప్పుడు మన అతి పెద్ద వాణిజ్య భాగస్వామి చైనాయే. ఈ ఆధారపడడాన్ని తగ్గించుకోగలిగినప్పుడే చైనాపై మనం పైచేయి ప్రదర్శించగలుగుతాం. అసలైతే ఆసియాన్ దేశాలు, యూరోపియన్ యూనియన్, అమెరికాలే చైనాకు అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వాములు. వారి తర్వాత భారత్ స్థానం ఎక్కడో ఉన్నా, అధిక జనాభా కారణంగా పొరుగునే ఉన్న మన పెద్ద మార్కెట్‌ను చైనా విస్మరించ లేదు. అదే సమయంలో డ్రాగన్ తమ నాసిరకం సరుకులు వదిలించుకొనే గడ్డగా మనం మిగలకూడదు. ఆత్మనిర్భరత మనకింకా సుదూర లక్ష్యమే గనక, బీజింగ్ మీద అతిగా ఆధారపడకుండా దీర్ఘకాలిక ఫలితాలిచ్చే చర్యలు చేపట్టాలి. డేటా భద్రత సహా అన్నిటి పైనా ప్రభుత్వం సమగ్రమైన విధానంతో ముందుకు కావాలి. అంతేకానీ, వట్టి యాప్‌ల నిషేధాల వల్ల ఉపయోగం తాత్కాలికమే! -
మరో 54 చైనీస్ యాప్‌లపై నిషేధం!
India plans to ban 54 Chinese apps: దేశ భద్రతకు ముప్పు తెచ్చే 54 చైనీస్ యాప్‌లను నిషేధించాలని భారత్ యోచిస్తోందని అధికారులు తెలిపారు. అంతేకాదు నిషేధించిన యాప్‌లలో స్వీట్ సెల్ఫీ హెచ్డీ, బ్యూటీ కెమెరా- సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, ఆన్‌మోజీఎరినా, యాప్‌లాక్, డ్యూయల్ స్పేస్ లైట్లు వంటివి ఉన్నాయి. గతేడాది జూన్‌లో దేశ సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పు ఉందని పేర్కొంటూ విస్తృతంగా ఉపయోగించే టిక్‌టాక్, వీచాట్, హెలో వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సహా 59 చైనీస్ మొబైల్ అప్లికేషన్లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. పైగా మే 2020లో చైనా సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యలంఓ భారత్ దాదాపు 300 యాప్‌లను బ్లాక్ చేసింది. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించిన నేపథ్యంలో జూన్ 2020లో తొలిసారిగా భారత్ ఈ నిషేధాన్ని ప్రకటించింది. (చదవండి: తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!!) -
నిషేధం ఉన్నా.. నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయ్
దేశ భద్రతకు ముప్పు కారణంతో కేంద్ర ప్రభుత్వం పలు చైనా యాప్‌లపై నిషేధం విధించిన నేపథ్యంలో డ్రాగన్ కంపెనీలు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నాయి. వివిధ యాప్‌లకు యాజమాన్య సంస్థగా వేరే కంపెనీని ముందు పెట్టి తెర వెనుక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. భారత మార్కెట్లో నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయి. గతేడాది నిషేధం వేటు పడిన ఆలీబాబా, బైట్‌డ్యాన్స్ వంటి కంపెనీలే ఈ యాప్‌లను వెనుక నుంచి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలు తమ యాప్‌లను కొత్త సంస్థల పేర్లతో లిస్ట్ చేస్తున్నాయి. యాప్‌ల యాజమాన్యం గురించి ఎక్కువగా బైట సమాచారం పొక్కకుండా, చైనా మూలాల గురించి తెలియకుండా జాగ్రత్తపడుతున్నాయి. దేశీయంగా టాప్ 60 యాప్‌ల్లో 8 చైనాకి చెందినవి ఉన్నట్లుగా ఒక పరిశోధనలో తేలింది. వీటికి ప్రతి నెలా సగటున 21.1 కోట్ల మంది యూజర్లు ఉంటున్నారు. చైనా యాప్‌లను గతేడాది జూలైలో నిషేధించినప్పుడు ఇవే యాప్‌ల యూజర్ల సంఖ్య 9.6 కోట్లే. కానీ గడిచిన 13 నెలల్లో ఈ సంఖ్య ఏకంగా 11.5 కోట్ల మేర పెరగడం .. నిషేధం ఉన్నా చైనా యాప్‌లు ఎంత వేగంగా వృద్ధి చెందుతున్నాయో చెబుతోంది. చైనాతో సరిహద్దుల్లోనూ, దౌత్యపరంగాను ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం గతేడాది చైనా యాప్‌లపై కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఏకంగా 267 చైనా యాప్‌లను నిషేధించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, పబ్జీ, హెలో, అలీఎక్స్‌ప్రెస్, లైకీ, షేర్ఇట్, మి కమ్యూనిటీ, వుయ్‌చాట్, బైదు సెర్చి, క్యామ్‌స్కానర్, వీబో, బిగో లైవ్‌తో పాటు షావోమీ సంస్థకు చెందిన కొన్ని యాప్‌లు వీటిలో ఉన్నాయి. దేశ ప్రజలు, వారి డేటా భద్రత కారణాల రీత్యా హోం శాఖ సిఫార్సుల మేరకు వీటిపై నిషేధం విధించినట్లు కేంద్రం అప్పట్లో వెల్లడించింది. అయితే, దాదాపు అదే తరహా యాప్‌లు కొత్త అవతారంలో నిశ్శబ్దంగా చాప కింద నీరులాగా విస్తరిస్తుండటం గమనార్హం. అత్యధికం మీడియా, వినోద రంగానివే.. కొత్తగా పుట్టుకొస్తున్న వాటిల్లో చాలా మటుకు యాప్‌లు.. మీడియా, వినోద రంగానికి చెందినవే. 2020లో నిషేధం వేటు పడిన టిక్‌టాక్ (యాజమాన్య సంస్థ బైట్‌డ్యాన్స్), శ్నాక్‌వీడియో (క్వాయ్‌షో) వంటి సంస్థలు ఇదే విభాగంలో హవా కొనసాగించడం గమనార్హం. ఈ విభాగంలో పెద్ద సంఖ్యలో యూజర్లకు త్వరితగతిన చేరువ కావడానికి వీలుంటుంది కాబట్టి మీడియా, వినోద రంగాలనే చైనా కంపెనీలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దానికి తగ్గట్లే నిషేధం అనంతరం కొత్తగా వచ్చిన వాటిలో కొన్ని యాప్‌లు కేవలం నెలల వ్యవధిలోనే లక్షల కొద్దీ యూజర్లను నమోదు చేసుకోవడం ఈ వాదనలకు ఊతమిస్తోంది. ఈ యాప్‌లలో కొన్ని పైరసీని ఎరగా చూపి యూజర్లను ఆకర్షిస్తున్నాయి. భారత్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న చైనా యాప్‌లలో ప్లేఇట్ ఒకటి. ఇది ప్రధానంగా పైరసీని అడ్డం పెట్టుకుని వేగంగా వృద్ధి చెందింది. వివిధ వీడియోలను ప్లే చేయడంతో పాటు నెట్‌ఫ్లిక్స్, ఎంఎక్స్ప్లేయర్, సోనిలివ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంల నుంచి షోలు, సినిమాల కాపీలను డౌన్లోడ్ చేసుకుని, చూసుకునేందుకు ప్లేఇట్ యాప్ వీలు కల్పిస్తోంది. పలు యాప్‌లు .. యూజర్ల డివైజ్‌లో ఉన్న సమా చారం, వీడియోలు, ఫొటోలకు సంబంధించిన డేటాను సేకరిస్తున్నాయి. ఆఖరికి యూజరు ఉన్న ప్రాంతాన్ని కూడా ట్రాక్ చేయగలుగుతున్నాయి. ఎంతో ఆకర్షణీయంగా ఆయా యాప్‌లు ఉంటున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా లిస్టింగ్.. గూగుల్ ప్లే స్టోర్‌లో పలు చైనా యాప్‌లు అసలు యాజమాన్య సంస్థ పేరుతో కాకుండా వేరే కంపెనీ పేరుతో లిస్టయి ఉంటున్నాయి. ఫలితంగా వెనుక ఉండి నడిపిస్తున్న అసలు సంస్థ ఆనవాళ్లు దొరకపుచ్చుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. అయితే, ఆయా కార్పొరేట్ కంపెనీల వెబ్సైట్లలో వాటి భాగస్వామ్య సంస్థల వివరాలు, యాజమాన్యానికి సంబంధించి పబ్లిక్‌గా ఉన్న రికార్డులు, సిబ్బంది నియామకాలకు సంబంధించి లింక్డ్ఇన్ వంటి పోర్టల్స్‌ను సదరు సంస్థలు ఉపయోగిస్తున్న విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే అసలు విషయం అవగతమవుతుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పలు యాప్‌లకు, గతంలో నిషేధం వేటుపడిన యాప్‌లకు యాజమాన్య సంస్థ ఒకటే అన్నది తెలుస్తుంది. చాలా సందర్భాల్లో నిషేధించిన యాప్‌ల ఉద్యోగులనే కొత్త యాప్‌లకు ఆయా కంపెనీలు మారుస్తున్నట్లు లింక్డ్ఇన్ డేటా బట్టి చూస్తే అర్థమవుతుంది. భారత ప్రభుత్వం నిషేధించిన టిక్‌టాక్ యాప్ మాజీ హెడ్ .. ఈ ఏడాది జూలైలో బైట్‌డ్యాన్స్‌లో మరో విభాగానికి మారినట్లుగా లింక్డ్ఇన్ వివరాలు చూపడం ఇందుకు నిదర్శనం. మరోవైపు, భద్రత ఏజెన్సీలు ఏవైనా హెచ్చరికలు, సిఫార్సులు చేసిన తర్వాతే ఆయా యాప్‌లపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతేడాది కూడా దేశభద్రత కారణాలతో హోం శాఖ సిఫార్సుల మేరకే కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పలు యాప్‌ల నిషేధానికి ఆదేశాలిచ్చింది. -
టిక్‌టాక్ ఉద్యోగుల తొలగింపు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ యాప్ టిక్‌టాక్ ఇండియాలో తమ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడింది. యాప్‌పై భారత ప్రభుత్వం శాశ్వత నిషేధం విధించిన నేపథ్యంలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్.. తమ ఉద్యోగులకు బుధవారం ఓ మెమో జారీ చేసింది. "యాప్‌పై నిషేధం కొంతకాలానికే పరిమితమవుతుందని తాము భావించామని, కానీ అలా జరగలేదని" ఆ సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నది. యాప్ ఇక్కడ పని చేయకుండా అందరు ఉద్యోగులను కొనసాగిస్తూ ఉండలేము అని పేర్కొంది. ఇండియాలో భవిష్యత్ లో తిరిగి రావడానికి ప్రయత్నిస్తామని బైట్‌డ్యాన్స్ ఆ మెమోలో పేర్కొన్నది. (చదవండి: రివ్యూ: ఫౌజీ గేమ్ ఎలా ఉందంటే?) నిషేదానికి ముందు టిక్‌టాక్ కు భారతదేశం అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్. ఇండియాలోనే 200 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టీవ్ యూజర్లను సంపాదించింది. చైనా, భారత్ దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత నేపథ్యంలో చైనాకు చెందిన 267పైగా యాప్‌లను గత ఏడాది వివిధ దశలలో నిషేదించింది. ఇందులో టిక్‌టాక్ కూడా ఉంది. గోప్యత, జాతీయ భద్రతా రక్షణ కారణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఈ యాప్‌లను నిషేధించినట్లు కేంద్రం పేర్కొంది. -
చైనా యాప్‌లకు మరో భారీ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: చైనా యాప్‌లపై కేంద్రం తాజాగా మరో కొరడా ఝళిపించింది. భారతదేశంలో టిక్‌టాక్, ఇతర 58 చైనా యాప్‌లపై శాశ్వత నిషేధం విధించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతేడాది జూన్‌లో వీటిపై భారత ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించగా.. ఇప్పుడు వాటిని శాశ్వత నిషేధం దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. భారతీయ వినియోగదారులడేటాను అక్రమంగా సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలపై ఆయా సంస్థల వివరణను కోరింది కేంద్రం. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గత వారమే నోటీసులు జారీ చేసింది. అయితే వాటి వివరణతో సంతృప్తి చెందని ప్రభుత్వ 59 యాప్‌లను శాశ్వతంగా నిషేధించాలని నిర్ణయించింది. గత ఆరు నెలల్లో ప్రభుత్వం 208 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. గోప్యత, జాతీయ భద్రతా రక్షణకు అనుగుణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఈ యాప్‌లను నిషేధించింది. -
చైనా పేమెంట్ యాప్‌లకు ట్రంప్ చెక్
వాషింగ్టన్: తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. చైనాకు చెందిన 8 పేమెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌పై నిషేధాన్ని విధించారు. వీటి ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు వీలు లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. నిషేధం విధించిన జాబితాలో అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్ గ్రూప్‌నకు చెందిన అలీ పే, టెన్సెంట్కు చెందిన వియ్‌చాట్ పే సైతం చోటు చేసుకోవడం గమనార్హం! ఈ నెలలో కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ బాధ్యతలు స్వీకరించడానికి ముందే ట్రంప్ యాప్‌లపై నిషేధ బాణాన్ని ఎక్కుపెట్టారు. తద్వారా బీజింగ్‌తో నెలకొన్న వివాదాలు మరింత ముదిరే వీలున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. (మ్యూజిక్ బిజినెస్‌కు అలీబాబా టాటా) 45 రోజుల్లో చైనా యాప్‌లపై ట్రంప్ నిషేధ ఆజ్ణలను మంగళవారం జారీ చేశారు. ఈ ఆదేశాలు జారీ అయిన 45 రోజుల తరువాత నిషేధం అమల్లోకి వస్తుందని వాషింగ్టన్ ప్రభుత్వం పేర్కొంది. తాజా ఆదేశాల ప్రకారం 8 చైనా యాప్‌ల ద్వారా వ్యక్తులు లేదా సంస్థలు లావాదేవీలు నిర్వహిస్తే ఆర్థిక శాఖ తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించవలసి ఉంటుందని తెలియజేసింది. నిషేధం విధించిన యాప్‌ల జాబితాలో అలీపే, కామ్‌స్కానర్, క్యూక్యూ వాలెట్, షేర్ఇట్, టెన్సెంట్ క్యూక్యూ, వీమేట్, వియ్‌చాట్ పే, డబ్ల్యూపీఎస్ ఆఫీస్ చోటు చేసుకున్నాయి. యాప్‌ల ద్వారా చైనా బల్క్ డేటా కలెక్షన్ చేపడుతున్నట్లు ట్రంప్ ఆరోపించారు. యూజర్లకు చెందిన ప్రయివేట్ సమాచారాన్ని యాప్స్ సంగ్రహిస్తాయని, దీనివల్ల అమెరికన్లకు రిస్కులు ఎదురుకానున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి నిషేధం అమల్లోకి రానున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. (బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్) యూజర్లు.. యూఎస్‌లో యాంట్ గ్రూప్‌నకు చెందిన పేమెంట్, లైఫ్‌స్టైల్ యాప్ అలీపే గతేడాది 2.07 లక్షల డౌన్లోడ్స్ను సాధించినట్లు తెలుస్తోంది. యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే యాప్‌స్టోర్ నుంచి డౌన్లోడ్స్ నమోదయ్యాయి. ఇక గతేడాది టెక్ దిగ్గజం టెన్సెంట్ హోల్డింగ్స్‌కు చెందిన వియ్‌చాట్ పేతో కూడిన వియ్‌చాట్ 1.6 మిలియన్ డౌన్లోడ్స్ను సాధించినట్లు సెన్సర్ టవర్ ఇంక్ పేర్కొంది. వీటితోపాటు టెన్సెంట్కు చెందిన క్యూక్యూ వాలెట్, టెన్సెంట్ క్యూక్యూ సైతం నిషేధాన్ని ఎదుర్కోనున్న జాబితాలో చేరాయి. మరోవైపు గతేడాది కామ్‌స్కానర్ యాప్‌ను సైతం 4.4 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు సెన్సర్ టవర్ తెలియజేసింది. -
లోన్ యాప్.. కటకటాల్లోకి బెంగళూరు కీర్తి
సాక్షి, బెంగళూరు: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్‌కు పాల్పడిన లోన్ యాప్స్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో యువతిని అరెస్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఎన్యూ టెక్నాలజీస్ సంస్థ హెచ్ ఆర్ విభాగం మేనేజర్ కీర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ సంస్థకు హెడ్‌గా వ్యవహరించిన సూత్రధారి నాగరాజు సోదరుడు ఈశ్వర్‌ను గత వారమే అరెస్టు చేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న కీర్తి కోసం గాలించిన ప్రత్యేక బృందం ఆదివారం పట్టుకోగలిగింది. ఈ ద్ఙారుణ’ యాప్స్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన, ఇండోనేషియా కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన చైనీయురాలు యాన్ యాన్ అలియాస్ జెన్నీఫర్‌తో ఈమె నేరుగా సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. ఆమెతో వాట్సాప్ ద్వారా తరచు సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంటున్నారు. (చదవండి: లోన్ యాప్.. కటకటాల్లోకి చైనీయులు) లోన్ యాప్స్ వేధింపులకు సంబంధించి సిటీలో ఇప్పటి వరకు 28 కేసులు నమోదు కాగా... చైనీయుడితో సహా 17 మందిని అరెస్టు చేశారు. 27 బ్యాంకు ఖాతాలతో సహా వర్చువల్ ఖాతాల్లో ఉన్న రూ.100 కోట్లకు పైగా మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. ఈ లోన్ యాప్స్‌కు ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరుల్లో ఉన్న మరికొన్ని కంపెనీలతోనూ లింకులు ఉన్నట్లు గుర్తించారు. వాటి వ్యవహారాలను దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. వీటి ఏర్పాటులో కీలకమైన చైనీయులు వివిధ నగరాల్లో ట్రాన్స్‌లేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లు, బ్యాంకు ఖాతాల తెరవడం తదితర సందర్భాల్లో వీరి సేవల్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌లేటర్ ఇంద్రజిత్‌ను గుర్తించిన పోలీసులు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న వారి ఆచూకీ కనిపెట్టి వాంగ్మూలాలు నమోదు చేయాలని నిర్ణయించారు. వీరి ద్వారా చైనీయులు కార్యకలాపాలకు సంబంధించి కీలక సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: ఇన్స్టంట్ లోన్స్‌తో ఈ అనర్థాలు తప్పవు) -
లోన్ యాప్.. కటకటాల్లోకి చైనీయులు
సాక్షి, చెన్నై: రుణాలు ఇస్తామంటూ తియ్యటి మాటాలతో ఆకర్షించి, ఆ తర్వాత వడ్డీలపై వడ్డీలను బాధుతూ వేధింపులకు గురి చేస్తూ వచ్చిన లోన్ యాప్ గుట్టును చెన్నై పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా బెదిరింపుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఆ యాప్ ప్రతినిధులుగా ఉన్న ఇద్దరు చైనీయుల్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. చెన్నైకి చెందిన గణేష్ కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో మొబైల్ ప్లే స్టోర్‌లో ఉన్న లోన్ యాప్‌లపై దృష్టి పెట్టాడు. ఇందులోని ఓ యాప్‌ను ఆశ్రయించిన కొన్ని క్షణాల్లో రూ. 5వేల రుణం ఖాతాలో పడింది. వారం తర్వాత వడ్డీ ఏదీ అంటూ మెసేజ్‌లు మొదలయ్యాయి. తాను చెల్లించాల్సిన మొత్తంలో సగం కట్టేసినా, వారానికి రూ. పదిహేను వందలు వడ్డీ చెల్లించాలంటూ మొదలైన మెసేజ్‌లు చివరకు వేధింపుల వరకు వెళ్లింది. ఆందోళనకు గురైన గణేష్ చెన్నై సెంట్రల్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. గణేష్ మరికొన్ని యాప్‌ల నుంచి కూడా రుణం పొంది ఉండడంతో, అన్నింటికీ కలిపి బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన కేంద్రం నుంచి ఈ వేధింపులు వస్తున్నట్టుగా విచారణలో తేలింది. గుట్టు రట్టు..కటకటాల్లోకి ... ఈ యాప్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబర్ క్రైం వర్గాలు గణేష్ నంబర్లకు వస్తున్న బెదిరింపులు, తిట్ల పురాణాల్ని రికార్డు చేశారు. సమగ్ర సమాచారంతో ప్రత్యేక బృందం బెంగళూరుకు పయనం అయింది. అక్కడ ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఉండడాన్ని గుర్తించారు. ఆ సెంటర్ నిర్వాహకులు ప్రమోద్, పవన్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. దేశంలో చైనా యాప్‌లను నిషేధించి ఉన్న నేపథ్యంలో చైనాకు చెందిన సంస్థకు అనుకూలంగా ఈ కాల్ సెంటర్ నిర్వహిస్తుండడం వెలుగు చూసింది. బెంగళూరులో తిష్ట వేసి తమ కార్యకలాపాల్ని సాగిస్తూ వస్తున్న చైనా లోన్ యాప్ కంపెనీకి చెందిన షియో యమోవు, ఉయున్లూన్ అరెస్టు చేశారు. చైనాలో ఉన్న తమ చైర్మన్ హంక్ ఇచ్చే సూచనలకు అనుగుణంగా తాము ఇక్కడ వ్యవహారాలు నడుపుతున్నామని వారు ఇచ్చిన సమాచారం పోలీసులకు పెద్ద షాకిచ్చింది. దీంతో ఆ నలుగుర్ని అరెస్టు చేసి శనివారం చెన్నైకు తరలించారు. తాంబరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి కట కటాల్లోకి నెట్టారు. చెన్నై పోలీసు కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ కొన్ని రకాల ప్లే స్టోర్లలోని యాప్‌ల జాగ్రత్తలు తప్పని సరి అని సూచించారు. (చదవండి: లోన్ యాప్ వేధింపులు: మరో వ్యక్తి బలి) -
3 నిముషాలకు టిక్‌టాక్ వీడియోలు!
న్యూఢిల్లీ: నిముషంలోపు వీడియోలతో ప్రపంచ ప్రసిద్ధమైన టిక్‌టాక్ ప్రస్తుతం 3 నిముషాల నిడివిగల వీడియోలపై పరిశీలనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా 10 నిముషాలలోపు వీడియోలకు వీలు కల్పిస్తున్న యూట్యూబ్ బాటలో నడవనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. షార్ట్ వీడియో మేకింగ్ ప్లాట్‌ఫామ్.. టిక్‌టాక్ తాజా పరిశీలనలపై సోషల్ మీడియా కన్సల్టెంట్ మ్యాట్ నవరా వెల్లడించింది. 3 నిముషాల వీడియోల ఫీచర్ ప్రాథమిక దశలో ఉన్నట్లు స్క్రీన్ షాట్‌తో ట్విటర్ ద్వారా మ్యాట్ తొలిసారి తెలియజేసింది. ప్రస్తుతం టిక్‌టాక్ నిముషం వ్యవధిగల వీడియోలను అప్లోడ్ చేసేందుకే వీలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మినియేచర్ 10 నిముషాల నిడివి వరకూ వీడియోలకు వీలున్న యూట్యూబ్‌కు మినియేచర్ ఫీచర్‌గా టిక్‌టాక్ తాజా ప్రణాళికలు ఉన్నట్లు టెక్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రత్యర్ధి సంస్థ ఇన్స్టాగ్రామ్ రీల్స్ సైతం వీడియోల అప్లోడ్ సమయాన్ని 15 సెకన్ల నుంచి 30 సెకన్లకు పెంచింది. ఇక యూట్యూబ్ షార్ట్స్ ద్వారా యూజర్లు 15 సెకన్లలోపు వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేందుకు వీలుంటుందని టెక్ నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (టిక్‌టాక్ విక్రయానికి గడువు పెంపు) నిషేధం భద్రతా ప్రమాణాల రీత్యా టిక్‌టాక్ యాప్ వినియోగాన్ని ఇటీవల భారత్, యూఎస్ ప్రభుత్వాలు నిషేధించాయి. అయితే టిక్‌టాక్ యూఎస్ యూనిట్‌ను విక్రయించేందుకు చైనీస్ ప్రమోటర్ కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు ట్రంప్ ప్రభుత్వం ఈ నెల 4 వరకూ గడువిచ్చిన విషయం విదితమే. కాగా.. యూఎస్ యూనిట్ నిర్వహణకు యూఎస్ దిగ్గజాలతో బైట్‌డ్యాన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా టిక్‌టాక్ యూఎస్ బిజినెస్ విక్రయంపై ట్రంప్ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనను పంపింది. దీనిలో భాగంగా యూఎస్ దిగ్గజాలు ఒరాకిల్, వాల్‌మార్ట్ ఆధ్వర్యంలో టిక్‌టాక్‌ను కొత్త సంస్థగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. అంతేకాకుండా టిక్‌టాక్‌లో ప్రస్తుత ఇన్వెస్టర్లు కొనసాగుతారని తెలియజేసింది. అయితే టిక్‌టాక్ యూఎస్ వినియోగదారుల డేటా, కంటెంట్ ఆధునీకరించడం తదితర కార్యకలాపాలను యూఎస్ కంపెనీలు చేపడతాయని పేర్కొంది. -
టిక్‌టాక్ విక్రయానికి గడువు పెంపు
వాషింగ్టన్: ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ పాలనా విభాగం టిక్‌టాక్ విక్రయానికి మరో 7 రోజుల గడువును పెంచింది. ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసింది. దీంతో డిసెంబర్ 4లోగా చైనీస్ కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు టిక్‌టాక్ యూఎస్ విభాగాన్ని విక్రయించేందుకు వీలు చిక్కింది. షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ విక్రయానికి ఆగస్ట్‌లోనే ఆదేశించిన ట్రంప్ ప్రభుత్వం తదుపరి గడువును 15 రోజులపాటు పెంచిన విషయం విదితమే. ఈ గడువు సైతం శుక్రవారం(27)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా 7 రోజుల గడువునిచ్చింది. తొలుత ట్రంప్ ప్రభుత్వం టిక్‌టాక్ యాప్‌ను విక్రయించవలసిందిగా బైట్‌డ్యాన్స్‌ను ఆదేశించింది. ఇందుకు 90 రోజుల గడువునిస్తూ ఆగస్ట్ 14న ఆదేశాలు జారీ చేసింది. కాగా.. టిక్‌టాక్ యూఎస్ విభాగం విక్రయానికి చైనీస్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ కొద్ది రోజులుగా చర్చలు నిర్వహిస్తూ వస్తోంది. టిక్‌టాక్ కొనుగోలు రేసులో తొలుత మైక్రోసాఫ్ట్ పేరు వినిపించినప్పటికీ తదుపరి రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇంక్, సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఒరాకిల్ రేసులోకి వచ్చిన విషయం విదితమే. ప్రతిపాదన ఇలా ఈ నెల 10న టిక్‌టాక్ విక్రయంపై యూఎస్ ప్రభుత్వానికి బైట్‌డ్యాన్స్ ఒక ప్రతిపాదనను పంపింది. దీనిలో భాగంగా ఒరాకిల్, వాల్‌మార్ట్ ఆధ్వర్యంలో టిక్‌టాక్‌ను కొత్త సంస్థగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఇదేవిధంగా టిక్‌టాక్‌లో ప్రస్తుత ఇన్వెస్టర్లు కొనసాగుతారని తెలియజేసింది. అయితే టిక్‌టాక్ యూఎస్ వినియోగదారుల డేటా, కంటెంట్ ఆధునీకరించడం తదితర కార్యకలాపాలను యూఎస్ కంపెనీలు చేపడతాయని పేర్కొంది. -
43 చైనా యాప్‌లపై నిషేధం
న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా తో ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో 43 చైనా మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించింది. అలీబాబా గ్రూప్‌కి చెందిన ఈ కామర్స్ యాప్ అలీ ఎక్స్‌ప్రెస్ సహా కొన్ని డేటింగ్ యాప్‌లపై నిషేధం విధిస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ యాప్‌లు దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా ఉన్నందున కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నిషేధం విధించింది. ఈ విషయాన్ని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర హోంశాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్‌కు అందిన సమాచారాన్ని క్రోడీకరించి దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 43 యాప్‌లపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. ఇప్పటివరకు మూడు దఫాలుగా చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. గల్వాన్ లోయలో భారత్‌తో ఘర్షణలకు దిగిన డ్రాగన్ దేశానికి బుద్ధి చెప్పడం కోసం ఈ ఏడాది జూన్ 29న తొలిసారిగా 59 యాప్‌లపై నిషేధం విధించింది. భారత పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత కోసం భారత్‌లో విస్తృతం ప్రాచుర్యం కలిగిన పబ్జి, టిక్‌టాక్ వంటి గేమింగ్ యాప్‌ల ఆటకట్టించింది. ఆ తర్వాత జూలై 27న ప్రజాదరణ పొందిన కామ్‌స్కానర్ వంటి మరో 47 యాప్‌లపై నిషేధం విధించింది. సెప్టెంబర్ 2న మరో 118 యాప్‌లను నిషేధించింది. పబ్జి, టిక్‌టాక్ వంటి గేమింగ్ యాప్‌లను తొలి దశలో నిషేధం విధించిన కేంద్రం ఇప్పుడు కామర్స్, డేటింగ్ యాప్‌లపై కొరడా ఝళిపించింది. తాజాగా 43 యాప్‌లతో మొత్తం నిషేధం విధించిన యాప్‌ల సంఖ్య 267కి చేరుకుంది. పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత, దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం వాటిల్లితే ఎలాంటి చర్యలకైనా దిగుతామని కేంద్రం స్పష్టం చేసింది. -
మరో ఝలక్ : చైనా యాప్‌లపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సమగ్రతకు భద్రతకు ముప్పు అంటూ ఇప్పటికే భారీగా చైనా యాప్‌లపై వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 43 చైనా మొబైల్ యాప్‌లను తాజాగా నిషేధించింది. మాంగో టీవీ, అలీసప్లయర్స్ మొబైల్ యాప్, అలీబాబా వర్క్‌బెంచ్ ,క్యామ్‌కార్డ్, అలీఎక్స్‌ప్రెస్ లాంటివి ఇందులో ఉన్నాయి. ఈ మేరకు సమాచార మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని, చట్టవిరుద్ద కారక్రమాలల్లో పాలు పంచుకుంటున్నారన్న సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సమగ్ర నివేదికల ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఏ కింద ఈ చర్య తీసుకున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటీవీ (టీవీ వెర్షన్) వీటీవీ సిడ్రామా, కెడ్రామా అండ్ మోర్, వీటీవీ లైట్ భారతదేశంలో నిషేధించబడిన యాప్‌లలో ఉన్నాయి. వీటితోపాటు విడేట్, సింగోల్, ట్రూలీ చైనీస్, ట్రూలీ ఏషియన్, చైనాలోవ్, డేట్‌మైజ్, ఏషియన్ డేట్, ఫ్లిర్ట్‌విష్, గైస్ ఓన్లీ డేటింగ్, రెలా తదితర డేటింగ్ యాప్‌లను బ్లాక్ చేసింది. ప్రధానంగా జనాదరణ పొందిన షాపింగ్ వెబ్సైట్ అలీఎక్స్‌ప్రెస్‌కు కూడా నిషేధించింది.. చైనీస్ ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబాకు ఇది పెద్ద ఎదురు దెబ్బ. తూర్పు లడఖ్‌లోని దేశసరిహద్దు ప్రాంతం వద్ద చైనా దుశ్చర్య, ఉద్రిక్తతల మధ్య పలు యాప్‌లపై కొరడా ఝళిపించింది. ఈ ఏడాది జూన్ 29న 59 యాప్‌లను, సెప్టెంబర్ 2న మరో 118 చైనా యాప్‌లను నిషేధించింది. వీటిలో ప్రముఖ చైనాయాప్‌లు టిక్‌టాక్, షేర్ఇట్, హెలో, షెయిన్, లైక్, వీచాట్, యుసి బ్రౌజర్ లాంటివి ఉన్న సంగతి తెలిసిందే. -
టిక్‌టాక్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన అమెరికా
-
పబ్జీ, లూడో కూడా ఇక లేనట్లే..
ఢిల్లీ : టిక్‌టాక్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న పబ్జీపై భారత ప్రభుత్వం త్వరలోనే నిషేధం విధించనుంది. దీనితో పాటే అలీ ఎక్స్‌ప్రెస్, లూడో సహా చైనాకు చెందిన 275 యాప్‌లపై భారత్ నిషేదం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గాల్వన్ లోయల్ భారత్-చైనా మధ్య ఉద్రిక్తలు నెలకొన్నప్పటి నుంచి చైనాకు చెందిన యాప్‌లపై ప్రత్యేక దృష్టి సారించిన నిఘా వర్గాలు ఇప్పటికే టిక్‌టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 యాప్‌లను నిషేదించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ భద్రతకు ముప్పు కలిగేంచాలా మరో 275 చైనా యాప్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. (సూపర్ లోకల్ మొబైల్ యాప్స్.. అదుర్స్! ) నిబంధనల్ని ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల డేటా తస్కరణకు గురవుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం ముందుంచారు. ఈ యాప్ బ్యాన్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. చైనాకు చెందిన అన్నిటెక్ కంపెనీలు.. ప్రభుత్వం ఏ సమాచారాన్ని కోరానా ఇవ్వాల్సిందిగా 2017 నాటి చట్టంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్, సహా వివిధ దేశ వినియోగదారుల డేటాపై డ్రాగన్ నియంత్రణ ఉండే ఆస్కారం ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే దీనిపై భారత్‌ను అనుసరించి చైనా యాప్‌లను నిషేదించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సైతం ట్రంప్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. (ముదిరిన దౌత్య యుద్ధం: కీలక పరిణామం) -
టిక్‌టాక్ బ్యాన్పై వెనక్కి తగ్గిన అమెజాన్!
వాషింగ్టన్: టిక్‌టాక్ యాప్‌ను తమ ఫోన్ల నుంచి తీసేయాలని కోరుతూ ఉద్యోగులకు మొయిల్ పంపిన అమెజాన్ సంస్థ కొన్ని గంటల్లోనే దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. పొరపాటుగా ఈ- మొయిల్ పంపామని, టిక్‌టాక్ నిషేధంపై ప్రస్తుతం తమకు ఎలాంటి విధానాలు లేవని పేర్కొంది. టిక్‌టాక్ పునరుద్ధరణకు సంబంధించి ఏం జరిగిందనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అమెజాన్ డాట్‌కామ్ ప్రతినిధి జాకీ అండర్సన్ నిరాకరించారు. ఓ సీనియర్ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ తెలిపిన దాని ప్రకారం.. టిక్‌టాక్ యాప్‌ను తీసేయాలని ఉద్యోగులకు మొయిల్ పంపగా ఆ విషయం కాస్తా టిక్‌టాక్ ప్రతినిధి వరకు చేరింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆయన అమెజాన్ ప్రతినిధి జాకీ అండర్సన్‌తో పరస్పరం చర్చలు జరిపారు. దీంతో టిక్‌టాక్ నిషేధంపై అమెజాన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం బహిష్కరించిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా సైతం టిక్‌టాక్ బ్యాన్ దిశగా అడుగులు వేస్తోంది. తమ దేశంలో టిక్‌టాక్ యాప్‌ను నిషేధించే యోచనలో ఉన్నట్టు అమెరికా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సైతం ప్రకటించారు. అంతేకాకుండా రిపబ్లికన్ జాతీయ కమిటీ టాక్‌టాక్ యాప్‌ను ఇకపై డౌన్లోడ్ చేయవద్దని తమ సభ్యులను శుక్రవారం ఈ- మెయిల్ ద్వారా కోరింది. సైబర్ ముప్పు ఉందనే సమాచారంతో గతేడాది నేవీ సభ్యులు టిక్‌టాక్‌ను ఉపయోగించరాదని అమెరికా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. (చైనా యాప్‌ల బ్యాన్ దిశగా అమెరికా?) అమెరికాలో రోజురోజుకీ ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ టిక్‌టాక్ సమూలమైన సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన యాజమాన్య బోర్డు, చైనా వెలుపల ప్రత్యేక ప్రధాన కార్యాలయం లాంటి మార్పులను టిక్‌టాక్ ప్రతినిధులు సన్నద్ధమైనట్లు సమాచారం. టిక్‌టాక్ ప్రధాన కార్యాలయ వ్యవహారాలను చైనా రాజధాని బీజింగ్ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చైనాకు చెందిన టిక్‌టాక్ మాజీ చీఫ్ అలెక్స్ జూ, లాస్ఏంజెలెస్ కేంద్రంగా పనిచేసే కొత్త సీఈఓ కెవిన్ మేయర్‌కి బాధ్యతలను అప్పగించారు. (చైనా మూలాలను చెరిపేస్తున్న టిక్‌టాక్) -
చైనీస్ యాప్స్‌కి మరో షాక్
ఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య 59 చైనీస్ యాప్స్‌పై కేంద్రం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అయితే డేటా సేకరణ పద్ధతులు, లొకేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను మూడు వారాల్లోగా నివేదించాల్సిందిగా టిక్‌టాక్ సహా 58 ఇతర యాప్‌లకు ఎలక్ర్టానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేఖలు రాసింది. ఐటీ యాక్ట్ కింద ఆయా సంస్థలకి ఈ- మెయిల్స్ పంపామని, తద్వారా సమగ్రంగా విశ్లేషించడానికి వీలవుతుందని ఐటీ అధికారి ఒకరు వెల్లడించారు. భారత వినియోగదారుల డేటాతో సహా లొకేషన్ వివరాలను చైనా సర్వీర్లకు బదిలీ చేసినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు ఇదివరకే ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బ్యూటీ ప్లస్, సెల్ఫీ కెమెరా లాంటి యాప్‌లలో అశ్లీల కంటెంట్ ఉందని కూడా నివేదించాయి. చైనీస్ యాప్స్‌పై విధించిన నిషేదాన్ని డిజిటల్ స్ర్టైక్గా అభివర్ణించిన మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఆయా యాప్స్ నిర్వాహకులు త్వరలోనే ప్యానెల్ ముందు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. (ఆ 89 యాప్స్ తొలగించండి ) ప్రముఖ షార్ట్ వీడియో స్ర్టీమింగ్ యాప్ టిక్‌టాక్‌కు భారత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత ఈ యాప్‌ను ఎక్కువగా వాడుతున్నట్లు అధ్యయంనంలో తేలింది.భారత్‌లో టిక్‌టాక్ యూజర్లు 200 మిలియన్లకు పైగానే ఉన్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో టిక్‌టాక్‌ను బ్యాన్‌చేశారు. తాజాగా భారత్ కూడా నిషేదం విధించడంతో టిక్‌టాక్‌కు భారీ నష్టం వాటిల్లందనే చెప్పొచ్చు. అయితే తాము డేటా చోరీకి పాల్పడలేదని భారత చట్టాలు, నిబంధనలకు లోబడే ఉన్నామని వినియోగదారుల డేటా, వారి గోప్యతకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని టిక్‌టాక్ ప్రతినిధి మరోసారి తెలిపారు. అంతేకాకుండా నిర్ణీత గడువులోపు పూర్తి వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. (చైనా యాప్‌ల బ్యాన్ దిశగా అమెరికా? ) -
అమెరికా నిర్ణయం.. చైనాకు భారీ షాక్
వాషింగ్టన్: గల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను బహిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్ నిర్ణయానికి అమెరికా మద్దతు తెలిపింది. అంతేకాక ప్రస్తుతం తాము కూడా చైనా యాప్‌లను బహిష్కరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను అధ్యక్షుడి కంటే ముందు బయటపడాలని అనుకోవడం లేదు. కానీ చైనా యాప్‌లను బహిష్కరించాలని భావిస్తున్న మాట మాత్రం వాస్తవం. అధ్యక్షుడి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం’ అన్నారు. అమెరికా చట్టసభ సభ్యులు కూడా టిక్‌టాక్ యాప్ పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అక్కడి సాఫ్ట్వేర్ కంపెనీలు చైనా ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాక టిక్‌టాక్ అమెరికా యూజర్ల డాటాను నిర్వహించడంపై కూడా అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.(‘బ్యాన్ టిక్‌టాక్’ అమెరికాలోనూ..!) చైనాలో అందుబాటులో లేని టిక్‌టాక్ యాప్‌ను ప్రపంచ నలుమూలలా జనాలు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని దేశాలు చైనాయాప్లను బహిష్కరించాలని పాంపియో కోరారు. చైనా వంచన విధానంతోనే కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అంతేకాక హాంగ్‌కాంగ్ వ్యవహారంలోనూ చైనా తీరుపై ఆగ్రహంగా ఉన్న అమెరికా తాజాగా ఇప్పుడు చైనా యాప్‌ల నిషేధం దిశగా అడుగులు వేయడం గమనార్హం. (టిక్‌టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు) -
టిక్‌టాక్ బ్యాన్ : ‘రీల్స్’ వచ్చేసిందట!
సాక్షి, న్యూఢిల్లీ : టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను నిషేధం తర్వాత దేశీయంగా అదే తరహా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పోటీ పెరిగింది. టిక్‌టాక్‌కు భారత మార్కెట్లో ఉన్ నక్రేజ్ను సొమ్ము చేసుకునేందుకు దిగ్గజ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఈ రేసులోకి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన ఇన్స్టాగ్రామ్ కూడా చేరిపోయింది .టిక్‌టాక్‌పై నిషేధంతో దాని యూజర్లందరూ చింగారి, రోపోసో ప్లాట్‌ఫామ్‌లవైపు మొగ్గు చూపుతున్న తరుణంలో ఇన్‌స్టా వేగం పెంచింది. టిక్‌టాక్ లాంటి ఫీచర్లతో ఇన్స్టాగ్రామ్ తన 15 సెకన్ల చిన్న వీడియో ఫీచర్ ‘రీల్స్’ ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. టిక్‌టాక్ మాదిరిగానే, రీల్స్ వినియోగదారులను ఆడియో క్లిప్‌లతో 15-సెకన్ల వీడియోలను, స్టోరీలను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది యూజర్లకు రీల్స్ కు సంబంధించిన అప్డేట్స్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే రీల్స్‌ను నవీకరిస్తున్నామని ధృవీకరించిన ఫేస్బుక్ నిర్దిష్ట వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. (టిక్‌టాక్ బ్యాన్.. దూసుకుపోతున్న చింగారీ) గత ఏడాది బ్రెజిల్ లో లాంచ్ చేసిన ఈ యాప్‌ను ఆ తరువాత ఫ్రాన్స్, జర్మనీ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా టిక్‌టాక్‌ను పోలిన తన లాస్సో యాప్‌ను జూలై 10 నుంచి మూసివేస్తున్నట్లు ఫేస్బుక్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
'మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ పెరగడంతో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ కీలక విషయాన్ని వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియా విధానానికి తాము కట్టుబడి ఉన్నామని శుక్రవారం ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా వ్యూహంలో సమగ్ర, దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్నామని వన్‌ప్లస్ టాప్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే భారతదేశంలో టీవీల తయారీని కంపెనీ ప్రారంభించామన్నారు. అలాగే ఈ వారంలో తొలి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్‌ను భారత్, యూరప్‌లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. 2014లో ప్రవేశించినప్పటి నుండి భారతదేశం వన్‌ప్లస్‌కు కీలకమైన మార్కెట్‌గా కొనసాగుతోందనీ, 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు అనుగుణంగా ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి చాలా కష్టపడ్డామని వన్‌ప్లస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ నవ్నిత్ నక్రా చెప్పారు. దేశంలో వన్‌ప్లస్ టీవీల తయారీని మొదలు పెట్టామని, గత సంవత్సరం హైదరాబాద్‌లో ఆర్అండ్డీ కేంద్రాన్ని ప్రారంభించామని వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడికి కట్టుబడి ఉన్నామని నక్రా చెప్పారు. ఈ కేంద్రంలోని కెమెరా ల్యాబ్, కమ్యూనికేషన్స్, నెట్వర్కింగ్ ల్యాబ్‌లు ఆటోమేషన్ ల్యాబ్‌ల కనుగుణంగా కెమెరా, ఆటోమేషన్, నెట్వర్కింగ్, కనెక్టివిటీ ఫ్యూచర్ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి పెడుతుందన్నారు. ప్రధానంగా 5 జీ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. దేశంలో 5 వేలకు పైగా ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ఉండగా, త్వరలోనే ఈ సంఖ్యను 8000 దాటాలనే ప్రణాళికలో ఉన్నామని వివరించారు. (నిషేధంపై టిక్‌టాక్ స్పందన) వన్‌ప్లస్ 2018 ఫిబ్రవరి నుండి భారతదేశంలో తన ఉత్పత్తులను తయారు చేస్తోంది. ప్రీమియం హ్యాండ్సెట్ తయారీదారు గురువారం అద్భుతమైన ఫీచర్లతో వన్‌ప్లస్ టీవీ యు, వై సిరీస్‌ను కంపెనీ గురువారం విడుదల చేసింది. కాగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చైనాకు చెందిన అనేక కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయి. అయితే లద్దాఖ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా సమస్యల రీత్యా, టిక్‌టాక్, వీచాట్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. -
నిషేధిత 59 చైనీస్ యాప్స్ అవుట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 59 చైనీస్ యాప్స్‌ను గూగుల్, యాపిల్ భారత్‌లోని తమ యాప్‌స్టోర్స్ నుంచి తొలగించాయి. దీంతో భారత్‌లోని మొబైల్ ఫోన్ యూజర్లకు ఇవి అందుబాటులో ఉండవు. దేశ సమగ్రతకు, భద్రతకు ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం 59 చైనీస్ యాప్స్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ తమ యాప్ స్టోర్ నుంచి వీటిని అందుబాటులో లేకుండా చేశాయి. తాత్కాలికంగా భారత ప్లే స్టోర్ విభాగంలో పలు యాప్స్‌ను బ్లాక్ చేసినట్లు గూగుల్ తెలిపింది. నిషేధం ఎదుర్కొంటున్న వాటిల్లో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ఇట్, ఉయ్‌చాట్, క్యామ్‌స్కానర్, మి కమ్యూనిటీ మొదలైనవి ఉన్నాయి. చట్టపరమైన చర్యల యోచన లేదు: టిక్‌టాక్ .. ప్రభుత్వ నిషేధంపై టిక్‌టాక్ స్పందించింది. దీనికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనేదీ లేదని స్పష్టం చేసింది. ‘అలాంటి ప్రణాళికలేమీ మాకు లేవు. ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. భారత ప్రభుత్వ చట్టాలు, నిబంధనలకు లోబడే మేం పనిచేస్తాం. యూజర్ల డేటా భద్రత, వ్యక్తిగత వివరాల గోప్యతకు మేం అత్యంత ప్రాధాన్యమిస్తాం‘ అని టిక్‌టాక్ ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు, నిషేధిత యాప్స్‌లో ఒకటైన బిగో లైవ్ కూడా స్పందించింది. ‘మేం భారత ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తాం. దీనిపై చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటాం‘ అని పేర్కొంది. నియామకాల ప్రణాళికల్లో చింగారీ చైనీస్ యాప్‌లపై నిషేధంతో దేశీ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా యాప్స్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. అనేక రెట్లు పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను వచ్చే కొద్ది నెలల్లో 200కి పెంచుకోవాలని యోచిస్తున్నట్లు దేశీ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ చింగారీ వెల్లడించింది. -
చైనా యాప్స్ డిలీట్ చేయండి..మాస్క్ పొందండి
లక్నో : తమ మొబైల్ ఫోన్లలో చైనా అప్లికేషన్లను తొలిగించే వారికి ఉచితం మాస్కులు అందిస్తామని ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, బహ్రాయిచ్ బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ ప్రకటించారు. దీనికి అణుగుణంగా ఇప్పటికే పలువరికి ఫేస్ మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. భారత దేశ సమగ్రతకు, భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. భారత్ వెలుపల ఉన్న సర్వర్లకు వినియోగదారుల డేటాను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా అందిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ప్రభుత్వం తెలపింది. ఈ నేపథ్యంలో చైనా అప్లికేషన్లను ప్రజలు స్వతహాగా తొలిగించేట్లు అనుపమ వినూత్నంగా ప్రయత్నించారు. పార్టీ స్థానిక మెర్చా యూనిట్ సహకారంతో ఆమె నియోజకవర్గంలో విసృతంగా ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా గతేడాది ఆమెను మంత్రి పదవి నుంచి తొలిగించారు. (టిక్‌టాక్ నిషేధంతో భారీగా నష్టపోయిన చైనా ) -
‘చైనా వైపు రెండింతలు చనిపోయారు’
న్యూఢిల్లీ : భారత్‌కు చెడు చేయాలని చూసేవారికి దీటైన సమాధానం చెబుతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణ త్యాగం చేశారని.. కానీ చైనా వైపు ఆ సంఖ్య రెండింతలుగా ఉంటుందని చెప్పారు. గురువారం పశ్చిమ బెంగాల్‌లోని వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. సరిహద్దుల్లో గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిస్థితులపై స్పందించారు. ప్రస్తుతం మనం రెండు ‘సీ’ ల గురించి వింటున్నామని.. అందులో ఒకటి కరోనా వైరస్ అని, మరోకటి చైనా అని అన్నారు. భారత ప్రభుత్వం శాంతిపై నమ్మకంతో.. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని చూస్తుందని వెల్లడించారు. (చదవండి : ఆ అక్కాచెల్లెళ్లు.. నిత్యానంద ‘కైలాస’లో) గల్వాన్ ఘర్షణ తర్వాత వారివైపు జరిగిన ప్రాణ నష్టంపై చైనా ఎలాంటి స్పష్టత ఇవ్వని విషయాన్ని గుర్తించాలన్నారు. గతంలో పాక్ భూభాగంలోకి వెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. అలాగే గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వృథా కానివ్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలను గుర్తుచేశారు. మరోవైపు 59 చైనీస్ యాప్‌ల నిషేధంపై స్పందిస్తూ.. భారతీయులు డేటా రక్షించేందుకు డిజిటిల్ స్ట్రైక్ ప్రారంభించామని చెప్పారు. కాగా, గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో భారత్ తమవైపు 20 మంది జవాన్లు మృతిచెందినట్టుగా ప్రకటించగా.. చైనా మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయని సంగతి తెలిసిందే. -
టిక్‌టాక్‌ను నిషేధించరాదు.. అప్పటివరకే!
హైదరాబాద్: టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లను నిషేధించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో నిఖిల్ సిద్ధార్థ్, సందీప్ కిషన్‌లు కూడా తమ స్పందనను తెలిపారు. ఈ నేపథ్యంలో నిఖిల్ ట్వీట్ చేస్తూ.. ‘టిక్‌టాక్‌ను నిషేధించరాదు.. మన దేశాన్ని మన ప్రజాస్వామ్యాన్ని గౌరవించేంత వరకే’ అంటూ స్పందించాడు. అది చూసిన హీరో సందీప్ కిషన్ స్పందిస్తూ.. ‘నాది కూడా అదే అభిప్రాయం మామ. కానీ ఇప్పుడు చైనా యాప్‌లను నిషేధించడం అవసరం. చైనా ప్రభుత్వం చేసేది సరైనది కాదు. అయితే మనం కూడా ఉపాధిని కోల్పోతామనుకో.. కానీ ప్రభుత్వ నిర్ణయం ఏంటో కూడా చూడాలి’ అంటూ సమాధానం ఇచ్చాడు. (టిక్‌టాక్ పోయింది..'చింగారి' వచ్చేసింది) TIKTOK shudnt be banned... as long as they respect our country.. our life and DEMOCRACY "Period" #tiktokbanindia — Nikhil Siddhartha (@actor_Nikhil) June 30, 2020 దీనికి నిఖిల్.. ‘అవును మామ.. కానీ నా ట్వీట్ మళ్లీ చదువు.. అందులోని వ్యంగ్యం అర్థం అవుతుంది’ అంటూ రిట్వీట్ చేసి.. చైనా ఉత్పత్తులను నిషేధించాలని పిలుపునిస్తూ #BanChineseProducts అనే హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేయమని కోరాడు. దీనికి ‘సందీప్ క్షమించు మామ నీ వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేదు’ అని సమాధానం ఇచ్చాడు. కాగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, సైబర్ ముంపు నుంచి దేశాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం టిక్‌టాక్, హాలో యాప్, యూసీ బ్రౌజర్లతో సహా 56 చైనా యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. (టిక్ టాక్ ఏంజెల్స్) Exactly my point mama... u shud read my tweet again and also the sarcasm in it 😇 lets push this hashtag 👇🏽#BanChineseProducts — Nikhil Siddhartha (@actor_Nikhil) June 30, 2020 -
టిక్‌టాక్ కంప్లీట్ ఆఫ్‌లైన్
న్యూఢిల్లీ : భారత్‌లో టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ యాప్‌లపై కేంద్రం సోమవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో గూగుల్ ప్లే స్టోర్,యాప్ స్టోర్లలో టిక్‌టాక్‌తో పాటు మిగిలిన కొన్ని యాప్‌లను తొలగించారు. మరోవైపు ఆయా ఫోన్లలో ఇన్స్టాల్ అయి ఉన్న యాప్స్ మాత్రం మామూలుగా పనిచేస్తూ వచ్చాయి. అయితే కొద్దిసేపటి నుంచి మొబైల్ ఫోన్లలో, డెస్క్‌టాప్ వర్షన్లో టిక్‌టాక్ యాప్ సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా టిక్‌టాక్ యాప్ పూర్తిగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయింది. టిక్‌టాక్ యాప్ ఓపెన్ చేస్తున్న వినియోగదారులకు.. నెట్వర్క్ ఎర్రర్ కనిపిస్తుంది. (చదవండి : టిక్‌టాక్‌పై నిషేధం) అలాగే యాప్ ఓపెన్ చేసేవారికి ‘భారత ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా 59 యాప్‌లపై నిషేధం విధించింది. మేము భారత ప్రభుత్వ ఆదేశాన్ని పాటించే పనిలో ఉన్నాం. అలాగే సమస్యను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి, పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ఇండియాలో ఉన్న మా వినియోగదారుల భద్రత మాకు అత్యంత ప్రధానమైంది’ అనే సందేశం కనిపిస్తుంది. మరోవైపు భారత్‌లో తమ యాప్‌ను నిషేధించడంపై టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ స్పందిస్తూ.. తమ వినియోగదారుల డేటాను చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయబోమని వివరణ ఇచ్చారు. భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నామంటూ టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు.(చదవండి : నిషేధంపై టిక్‌టాక్ స్పందన)