ఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య 59 చైనీస్ యాప్స్‌పై కేంద్రం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అయితే డేటా సేకరణ పద్ధతులు, లొకేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను మూడు వారాల్లోగా నివేదించాల్సిందిగా టిక్‌టాక్ సహా 58 ఇతర యాప్‌లకు ఎలక్ర్టానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేఖలు రాసింది. ఐటీ యాక్ట్ కింద ఆయా సంస్థలకి ఈ- మెయిల్స్ పంపామని, తద్వారా సమగ్రంగా విశ్లేషించడానికి వీలవుతుందని ఐటీ అధికారి ఒకరు వెల్లడించారు. భారత వినియోగదారుల డేటాతో సహా లొకేషన్ వివరాలను చైనా సర్వీర్లకు బదిలీ చేసినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు ఇదివరకే ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బ్యూటీ ప్లస్, సెల్ఫీ కెమెరా లాంటి యాప్‌లలో అశ్లీల కంటెంట్ ఉందని కూడా నివేదించాయి. చైనీస్ యాప్స్‌పై విధించిన నిషేదాన్ని డిజిటల్ స్ర్టైక్‌గా అభివర్ణించిన మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఆయా యాప్స్ నిర్వాహకులు త్వరలోనే ప్యానెల్ ముందు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
(ఆ 89 యాప్స్ తొలగించండి )
ప్రముఖ షార్ట్ వీడియో స్ర్టీమింగ్ యాప్ టిక్‌టాక్‌కు భారత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత ఈ యాప్‌ను ఎక్కువగా వాడుతున్నట్లు అధ్యయంనంలో తేలింది.భారత్‌లో టిక్‌టాక్ యూజర్లు 200 మిలియన్లకు పైగానే ఉన్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో టిక్‌టాక్‌ను బ్యాన్‌చేశారు. తాజాగా భారత్ కూడా నిషేదం విధించడంతో టిక్‌టాక్‌కు భారీ నష్టం వాటిల్లందనే చెప్పొచ్చు. అయితే తాము డేటా చోరీకి పాల్పడలేదని భారత చట్టాలు, నిబంధనలకు లోబడే ఉన్నామని వినియోగదారుల డేటా, వారి గోప్యతకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని టిక్‌టాక్ ప్రతినిధి మరోసారి తెలిపారు. అంతేకాకుండా నిర్ణీత గడువులోపు పూర్తి వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. (చైనా యాప్‌ల బ్యాన్ దిశగా అమెరికా? )
చైనీస్ యాప్స్‌కి మరో షాక్
Published Fri, Jul 10 2020 9:28 AM | Last Updated on Fri, Jul 10 2020 4:55 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment