సాక్షి, న్యూఢిల్లీ : ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, సైబర్ దాడి ముప్పు ఉందన్న అంచనాల మధ్య చైనాకు చెందిన టిక్‌టాక్ సహా 59 యాప్ లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టిక్‌టాక్ మంగళవారం స్పందించింది. తన వినియోగదారుల డేటాను చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయబోమని వివరణ ఇచ్చింది. భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నామంటూ టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు. (ప్లేస్టోర్ నుంచి టిక్‌టాక్ తొలగింపు)
ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని చెప్పారు. దీనిపై మరింత స్పష్టత ఇచ్చేందుకు, చర్చించడంతోపాటు, సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. వినియోగదారు గోప్యతకు, సమగ్రతకే అధిక ప్రాముఖ్యత అన్నారు. ప్రభుత్వ నిషేధాన్ని "తాత్కాలిక ఉత్తర్వు" గా అభివర్ణించించిన గాంధీ 14 భారతీయ భాషలలో లక్షలాదిమందికి ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని, వినియోగదారులు, కళాకారులు, స్టోరీ టెల్లర్స్, విద్యావేత్తలు సహా ఎంతోమందికి జీవనోపాధిని అందిస్తున్నామని వెల్లడించారు. వీరిలో చాలామంది మొదటిసారి ఇంటర్నెట్ వినియోగదారులే అన్నారు. ప్రభుత్వంతో చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుందనే విశ్వసిస్తున్నట్లు తెలిపారు. (టిక్‌టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు)
Comments
Please login to add a commentAdd a comment