సాక్షి, న్యూఢిల్లీ: చైనా యాప్‌లపై కేంద్రం తాజాగా మరో కొరడా ఝళిపించింది. భారతదేశంలో టిక్‌టాక్, ఇతర 58 చైనా యాప్‌లపై శాశ్వత నిషేధం విధించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతేడాది జూన్‌లో వీటిపై భారత ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించగా.. ఇప్పుడు వాటిని శాశ్వత నిషేధం దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
భారతీయ వినియోగదారులడేటాను అక్రమంగా సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలపై ఆయా సంస్థల వివరణను కోరింది కేంద్రం. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గత వారమే నోటీసులు జారీ చేసింది. అయితే వాటి వివరణతో సంతృప్తి చెందని ప్రభుత్వ 59 యాప్‌లను శాశ్వతంగా నిషేధించాలని నిర్ణయించింది. గత ఆరు నెలల్లో ప్రభుత్వం 208 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. గోప్యత, జాతీయ భద్రతా రక్షణకు అనుగుణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఈ యాప్‌లను నిషేధించింది.
Comments
Please login to add a commentAdd a comment