తిండి తినకుండా ఉంటాం కానీ టిక్‌టాక్ లేకుండా ఉండలేం అంటున్నారు కొందరు టిక్‌టాక్ యూజర్లు. అందుకే టిక్‌టాక్ సహా 59 చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేదించడంతో ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు అయోమయంలో పడిపోయారు. ఇప్పటికే ఈ యాప్‌ను భారత్‌లో దాదాపు 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీంతో ఉన్నపలంగా తీసేయాలంటే ఇంకోటి రిప్లేస్ చేయాల్సిందే అనుకున్నారేమో వెంటనే టిక్‌టాక్ ప్రత్యామ్నాయం ఏంటా అని శోధించారు. అదృష్టవశాత్తూ మన భారతీయులు తయారు చేసిన 'చింగారి' యాప్ కళ్లెదుట ప్రత్యక్షమయ్యింది. ఇంకేముంది గంటలోనే ఈ యాప్‌ను లక్షమంది దాకా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
షార్ట్ వీడియో సర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్రస్తుతం భారతీయులు మక్కువ చూపిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాషల్లో ఈయాప్ అందుబాటులో ఉంది. దీంతో స్వదేశీ పరిఙ్ఞానంతో రూపొందింన 'చింగారి' యాప్‌ను ప్రోత్సహించాలంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా సైతం చింగారి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి దాని ప్రత్యేక ఫీచర్స్‌ను వివరించారు. స్వదేశీ పరిఙ్ఞానంతో రూపుదిద్దుకున్న చింగారి యాప్ రూపకర్తలపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. మరో విశేషం ఏంటంటే ఆనంద్ మహింద్రా ఇప్పటివరకు టిక్‌టాక్ యాప్‌ను మునుపెన్నడూ డౌన్‌లోడ్ చేసుకోలేదు. (ప్లేస్టోర్ నుంచి టిక్‌టాక్ తొలగింపు )
I hadn’t ever downloaded TikTok but I have just downloaded Chingari... More power to you... https://t.co/9BknBvb8j3
— anand mahindra (@anandmahindra) June 28, 2020
బెంగుళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్, సిద్ధార్థ్ గౌతమ్ గతేడాది చింగారి యాప్‌ను రూపొందించారు. అయితే మనోళ్లకు విదేశీ వస్తువులు, యాప్‌లపై మోజెక్కువ కాబట్టి చింగారి యాప్ ఆదరణకు నోచుకోలేదు. కానీ తాజాగా 59 చైనా యాప్‌లపై ప్రభుత్వం నిషేదం విధించడంతో చింగారి యాప్ డౌన్‌లోడ్స్ పెరిగాయి. ఇప్పటికే 1 మిలియన్ మార్కును దాటేసి గూగుల్ ప్లే స్టోర్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. అంతేకాకుండా పలు సామాజిక ప్లాట్‌ఫామ్‌లు సైతం చింగారిలో పెట్టుబుడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రోగ్రామర్ నాయక్ తెలిపారు. 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చింగారి యాప్ సహ వ్యవస్థాపకుడు సుమిత్ ఘోష్ స్వాగతించారు. డేటా తస్కరించి గూఢచార్యానికి పాల్పడ్డ యాప్‌ను భారత్ తిరిగి తన గూటికి చేర్చింది. ఎట్టకేలకు ఈ బ్యాన్ జరిగినందుకు మకు సంతోషంగా ఉందన్నారు. (నిషేధంపై టిక్‌టాక్ స్పందన )
Comments
Please login to add a commentAdd a comment